మహల్లాలస

అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని సౌందర్య రూపాలను చూడాలని

అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని నాద స్వరాలను వినాలని

అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని స్నిగ్ధత్వాలని స్పర్మించాలని

అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని పరిమళాల గాఢత్వాలను పీల్చాలని

అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని రుచుల కమ్మదనాలను చవిచూడాలని

అనాది నుంచి ఇంతవరకు
ఎవరికీ తెలియని అనురాగమానసాన్ని అద్వైతించుకోవాలనిprev   next