ఆవాహన
కవిత్వం దాకా దేనికి అసలేది గానీ నేను రాయగలనని
మీదాక దేనికి నా మట్టుకు నాకే అనిపించదుఎప్పుడో నిన్నమొన్నటి ఇప్పుడెప్పుడో
ఏదో విషాదపు టగాధంలో పడినప్పుడో
ఏదో అనురాగపు గాఢత్వంలో లీనమైనప్పుడో
ఏదో ఆనందపు మేఘాల మీద తేలిపోయినప్పుడో
ఎప్పుడో అలాంటప్పుడెప్పుడో తను నేనైనప్పుడు తప్పకవిత్వం దాకా దేనికి అసలేది గానీ నేను రాయగలనని
మీదాక దేనికి నా మట్టుకు నాకే అనిపించదు