శిలాలోలిత
ఈ శిల
ఎర్రని కాంతుల
ఈ నీలంతెలుపు శిలరాయిలా కనిపించే ఈ శిల శిలే గాని
వానచినుకు రాలినా ఎండపొడ తగిలినా
చిరుగాలి వీచినా పరిమళం సోకినా
మమతలా కరుణలా మనిషిలా ద్రవిస్తుందిఅజ్ఞాత అనురాగ శిల్పి
అపురూప సౌందర్య స్రష్టమౌన ముద్రాంకిత రసయోగి
కనిపించి వినిపించి అనిపించి
ఈ నిరీంద్రియశిల చైతన్యశిలై
ఈ రాతిశిల నాతిశిలైఅనురాగం తాగి మత్తెక్కి
మంచులో తడిసి వెన్నెట్లో మెరిసి
లలితంగా స్థిరచిత్త లోలితంగా
ఈ శిల