కాని, మనం మాట్లాడే నాలుగోవంతు, పదోవంతు తెలుగైనా ఆ సంభాషణలు ఇంగ్లీష్‌ లో కుదరవు. కొన్ని నాజుకైనా భావాలు, పలకరింతలు, ఆప్యాయతలు తెలుగు పదాలలో మాత్రమే చెప్పగలుగుతాము. అవి లేకపోతే విషయాలు తెలపగలము, కాని అల్లం పచ్చిమిరపకాయ లేని పెసరట్టు లాగా చప్పగా ఉంటుంది.

ప్రకృతిలో నాలుగు ప్రాథమిక బలాలు (fundamental forces) ఉన్నాయని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. విశ్వార్భవానికి మూలకారణమైన ఆదిశక్తి ఒక్కటే అయినప్పటికీ అది ఈ నాడు మనకి నాలుగు వివిధ బలాలుగా ద్యోతకమవుతున్నాదని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.

అసలు “శృంగార నైషథ” కావ్య కర్త ఐన ఆ శ్రీనాథుడు వీటిలో ఒక్కటైనా చెప్పాడో లేడో కూడ మనకు తెలియదు. ఐతే, ఆయన చెప్పినా మరొకరు చెప్పినా ఈ పద్యాల ద్వారా, శ్రీనాథుడి “వ్యక్తిత్వం” గురించి తర్వాతి తరాల వారు ఏమని భావించారో మనకు తెలిస్తుంది.

ఈ కవిత అర్థమవడానికి “వర్షుకాభ్రములు” అన్న పదంకోసం నిఘంటువులు తిరగెయ్యనక్కరలేదు. మహా ప్రవాహంలా హోరెత్తించే ఆ కవిత్వ వేగం సామాన్య పాఠకుణ్ణి సైతం మున్ముందుకి తోసుకుపోతుంది.

శాస్త్రీయ సంగీతం అంటే సామాన్యంగా సీరియస్‌ వ్యవహారం. అయనా అందులో కూడా కొన్ని జోకులూ, ఛలోక్తులూ ఉంటూనే ఉంటాయ. వాటిలో చిరునవ్వు తెప్పించేవి కొన్నిటిని ఈ వ్యాసంలో పొందుపరుస్తున్నాను.

శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి మాటల్లో చెప్పాలంటే “ఎమెనో కేవలం ఒక విశిష్ట శాస్త్రజ్ఞుడు మాత్రమే కాదు. ఒక మహామనీషి కూడానూ. ఆయన మంచితనం, ఏమాత్రమూ గర్వం లేని ప్రవర్తన, శాస్త్రీయ పరిశోధనలో ఆయన చూపించే ఏకాగ్రత, శ్రద్ధాసక్తులు ఆయన శిష్యులందర్నీ ఎంతగానో ప్రభావితంచేశాయి. ఆయన శిష్యులందరికీ ఆయన ఒక గొప్ప స్ఫూర్తీ, మార్గదర్శీ”.

పార్థివనామ సంవత్సరం ఇస్మాయిల్‌ అవార్డ్‌ కు ప్రతిభగల కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి రచించిన “వానకు తడిసిన పూవొకటి” అనే కవితా సంకలనాన్ని ఎంపిక చేశారు. అక్టోబర్‌ లో విడుదల కాబోయే ఈ పుస్తకం నుండి రెండు చిన్న కవితలు.

సంగీతరావుగారి వంటి అనుభవజ్ఞులతో మాట్లాడినా, వారి జ్ఞాపకాల గురించి చదివినా తెలుగువారి సంగీతసాంప్రదాయం గురించి మనకు కొంత తెలుస్తుంది.

గమనాన్నీ, యానాన్నీ, ప్రవాహాన్నీ అక్షరాలలో చిత్రించాలని — అంతర్ బహిర్ వర్తనాల మధ్యన వుండే గొలుసు పొరలు చిరగకుండా వొక్కొక్కటె విప్పి, యేదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కె తో రాసిన అస్తిత్వ వాద మనోవైజ్ఞానిక నవల హిమజ్వాల

ఈ సంచికలో తానా కథల పోటీలో బహుమతులొచ్చిన కథలు ప్రచురించటానికి తానా సాహితీ శాఖ వారు అనుమతించారు. అందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. […]

కథా సమీక్ష విముక్తుడు (రచయిత్రి: జొన్నలగడ్డ రామలక్ష్మి) ఓ చేయితిరిగిన రచయిత చదివించే గుణంతో ఓ చిన్న విషయం గురించి రాసిన కథ. కేన్సరుతో […]