అనగా అనగా ఒకరాత్రి

ఆమె అతడిని చూసింది. అదే క్షణాన అతడూ చూశాడు. చూసి, చూపు తిప్పుకున్నాడు. ఐస్ వల్ల గ్లాస్‌కి చెమటలు పడుతున్నాయి. ఆమె అతడిని గమనిస్తూనే ఉంది. ఒక్కో గుక్క తాగి, గ్లాస్ కిందపెట్టి, ఆమెను చూడబోయి, ఆమె గమనిస్తుందని గమనించి, రెప్పలనీడలో కళ్ళను అటూ ఇటూ పరిగెత్తిస్తూనే ఉన్నాడు.