Wednesday, September 8, 2010

దుర్మతిని కృష్ణా

దుర్మతిని మిగుల దుష్టపు
గర్మములను జేసినట్టి కష్టుడ నన్నున్
నిర్మలుని జేయవలె ని
ష్కర్ముడ నిను నమ్మినాను సతతము కృష్ణా!

This is from "Krishna Satakam" by Nrisimha Kavi. The poet is expressing his surrender to Lord Krishna as follows:

durmatini = wicked minded (I am)
migula dustapu karmamulanu chesinatti kastudanu = who has done several sinful actions
nannun nirmaluni cheyavale = (you should) purify me
nishkarmuda = (currently, I am) not engaged in actions
ninu namminaanu satatamu = always faithful to you / eternally surrendered to you
Krishna = O Krishna (Dear Lord!)

Monday, August 30, 2010

కృష్ణ శతకము

కం. అపరాధ సహస్రంబులు
నపరిమితములైన యఘము లనిశము నేనున్
గపటాత్ముడనై చేసితి
జపలుని నను గావు శేష శాయివి కృష్ణా!! 48

కం. నర పశుడ మూఢ చిత్తుడ
దురితారంభుడను మిగుల దోషగుడను నీ
గుఱుతెఱుగ నెంత వాడను
హరి నీవే ప్రాపు దాపు వౌదువు కృష్ణా!! 49

కం. పంచేంద్రియ మార్గంబుల
గొంచెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్
ఇంచుక సజ్జన సంగతి
నించుక మిమ్మెరిగినాడ నిప్పుడె కృష్ణా!! 50

కం. దుష్టుండ దురాచారుడ
దుష్ట చరిత్రుండను జాల దుర్బుద్ధిని నే
నిష్ట నిను గొల్వ నేరను
గష్టుడ నను గావు కరుణను కృష్ణా!! 51

రచయిత- నృసింహకవి.

Saturday, August 21, 2010

భయం - అభయం

భోగే రోగభయం కులే చ్యుతిభయం విత్తే నృపాలాద్భయం
మానే ధైన్యభయం బలే రిపుభయం రూపే జరాయా భయమ్‌ ౤
శాస్త్రే వాదిభయం గుణే ఖలభయం కాయే కృతాంతాద్భయం
సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్య మే వాభయమ్‌

- Bhartrihari Vairagya Satakam - 31

bhoge roga bhayam = in the enjoyments there is a fear of falling ill
kule chyuti bhayam = In the high order of society there is a fear of falling off
vitte nrupaalaat bhayam = in wealth there is a fear of government (tax man)
maane dainya bhayam = in honor there is a fear of humiliation
bale ripu bhayam = in power there is a fear of enemy
ruupe jarayaa bhayam = in beauty there is fear of old age
sastre vaadi bhayam = in the sastras there is a fear of opponents
gune khala bhayam = in virtue there is a fear of vicious ones
kaaye krutaantaat bhayam = in the body there is a fear of death (lord yama)
sarvam vastuh bhayaanivtam bhuvihi - all vastus (things) are always come along with some sort of fear in this world
nrunaam vairagyam eva abhayam - for the people "dispassion" - vairagya alone is fearlessness!

om tat sat

Friday, August 20, 2010

మహా మాయ - మహా లక్ష్మి

నమస్తేస్తు మహామాయే - శ్రీ పీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే - మహాలక్ష్మీ ర్నమోస్తుతే ||

namah te astu mahamaaye sripithe sura pujite
sankha-chakra-gadaa-haste mahalakshmi namah astu te

I bow down to you O "mahamaaya" on sripitha worshiped by the gods!
I bow down to you O "mahalakshmi" holding sankha, chakra and gadaa in your hands!

-- On the occasion of varalakshmi vratam.

Notes:
1. The first bow down to the Divine mother's swarupa devoid of all actions and attributes.

2. The second bow down to the Divine mother's swabhava that controls all the action with three gunas (sankha represents rajo guna of creation; chakra represents satva guna of control; and the gadaa represents tamo guna of transformation. The forth hand holds a "varada mudra" that indicates the surrender!)

om tat sat

Saturday, July 17, 2010

స్నానం

మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే |
సకృద్గీతాంభసి స్నానం సంసార మల నాశనమ్ ||

-- గీతా మహాత్మ్యం

mala nirmochanam pumsaam jala snanam dine dine
sakrut gita-ambhasi snanam samsaara mala naasanam

-- From Gita Mahatyam.

As a bath with water daily cleanses the impurities of the body,
in the same way a bath in the waters of srimad bhagavad gita cleanses the impurity called "samsaara" completely!

om tat sat

(Today is karkataka sankramanam and the start of dakshinaayanam)

Saturday, June 26, 2010

సీతా యజ్ఞం


మంత్ర యజ్ఞపరా విప్రా సీయజ్ఞాశ్చ కర్షకాః
గిరి యజ్ఞస్థథా గోపాః ఇజ్యోస్మాభిర్గిరిర్వనే||

ఏరువాక పౌర్ణమి సందర్భంగా

Monday, June 7, 2010

పెక్కుచదువులేల?

పెక్కుచదువులేల? చిక్కువాదములేల?
ఒక్క మనసుతోడ నూరకున్న
సర్వసిద్ధుడౌను, సర్వంబు తానౌను
విశ్వదాభిరామ! వినుర వేమ!

-- యోగి వేమన

Loose English Notes:
pekku chaduvulela? = why to learn different branches of studies?
chikku vaadamulela? = why to engage in complected arguments?
okka manasu toda urakunna = by keeping ONE mind stable without thoughts
sarva siddhudaunu = one will become an achiever (siddha)
sarvambu taanaunu = he will verily become ALL (the soul of everything)
visvadaabhi raama, vinura vema! = listen to this word of "Vemana" O visvadaabhiraama!

In simple words, Yogi Vemana explains the method of attaining highest state of "sthita prajna".

Sunday, June 6, 2010

నిర్గుణ బ్రహ్మ

ఏకమై పరమై విశోకమై సత్యమలోకమై వ్యాపకాలోకమగుచు
జ్ఞానమై జగదధిష్టానమై ముక్తి నిదానమై మాయావిహీనమగుచు
నందమై కేవలానందమై సంతతాస్పందమై శృతి పద్మ కంద మగుచు
సారమై చిదచిదాకారమై యతి నిర్వికారమై విగత సంసార మగుచు

జిలుగు మేలసుల కలకలు గలుగు కొనుచు
మెలగు ప్రకృతిని దగులక మిగిలి వెలుగు
వెలుగు వెలుగంగ జేయు గలయ వెలుగు
పరమ పరిపూర్ణ నిర్గుణ బ్రహ్మ మనఘ

-- శ్రీ సీతారామాంజనేయ సంవాదము; శ్రీ పరశురామ లింగమూర్తి

Loose English notes:

ekamai = one in three distinctions of time
paramai = transcendent all times
vishokamai = beyond misery at all times
satyamalokamai = the loka of TRUTH at all times
vyapaka alokamu aguchu = enclosing everything that is visible
jnanamai = knowledge at all times
jagad adhistanamai = support of the jagat (that what moves) the unmoving hold of ever moving jagat
mukti nidaanamai = the source of liberation all times
maaya vihiinamaguchu = removing the maaya
nandamai = bliss always
kevala nandamai = bliss without an object always (vs. samsparsaja bhoga; enjoyment produced by the contact of a sense object)
santataaspandamai = the vital vibration always
shruti padma kanda maguchu = being the support for lotus of vedas
saaramai = essense always
chida chidaakaramai = conscious personified always
yati nirvikaaramai = unchanging, immutable always
vigata samsaara maguchu = being detached to the samsaara

prakrutini which is julugu melasula kalakalu galugu konuchu
dagulaka = not attached to
migili velugu = ever effulgent
velugu veluganga jeyu galaya velugu = the light which makes all other lights light
That parama paripoorna (which is filled inside and out) is the Nirguna Brahma!

Thursday, June 3, 2010

రాముని గుణములు

ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః |
నియత ఆత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ |1-1-8|
బుద్ధిమాన్ నీతిమాన్ వాఙ్గ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః |
విపులాంసో మహాబాహుః కంబు గ్రీవో మహాహనుః |1-1-9|
మహోరస్కో మహేష్వాసో గూఢ జత్రుః అరిందమః |
ఆజాను బాహుః సుశిరాః సులలాటః సువిక్రమః |1-1-10|

సమః సమ విభక్త అంగః స్నిగ్ధ వర్ణః ప్రతాపవాన్ |
పీన వక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభ లక్షణః |1-1-11|
ధర్మజ్ఞః సత్యసంధః చ ప్రజానాం చ హితే రతః |
యశస్వీ జ్ఞానసంపన్నః శుచిః వశ్యః సమాధిమాన్ |1-1-12|
ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతా రిపు నిషూదనః |
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా|1-1-13|
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |
వేద వేదాఙ్గ తత్త్వజ్ఞో ధనుర్వేదే నిష్ఠితః |1-1-14|
సర్వ శాస్త్ర అర్థ తత్త్వజ్ఞో స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
సర్వలోక ప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః |1-1-15|

సర్వదా అభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః |
ఆర్యః సర్వసమః చ ఏవ సదైవ ప్రియ దర్శనః |1-1-16|
స చ సర్వ గుణోపేతః కౌసల్య ఆనంద వర్ధనః |
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవాన్ ఇవ |1-1-17|
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియ దర్శనః |
కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథ్వీ సమః |1-1-18|

ధనదేన సమః త్యాగే సత్యే ధర్మ ఇవ అపరః |
తం ఏవం గుణ సంపన్నం రామం సత్య పరాక్రమం |1-1-19|

-- వాల్మీకి రామాయణం నుంచి

Wednesday, May 26, 2010

రామ మంత్రం

సప్త కోటి మహా మంత్రాః బుద్ధి భ్రమణ కారకః
ఏక ఎవ పరో మంత్రో రామ ఇత్యక్షర ద్వయం

{There are 70 million great "mantras" that exist in scriptures that could cause confusion!
There is only one highest mantra made up of two letters: "rA, ma" .}

మన శాస్త్రాల్లో ఏడు కోట్ల మంత్రాలున్నాయని చెపుతారు. అన్నీ కఠినమైనవి, త్వరగా అర్ధం కానివీ. కాని "రామ" మంత్రం అన్నిటినీ అధిగమించింది.

-- నిన్ను నీవు తెలుసుకో నుంచి ("హంస")

Sunday, May 16, 2010

ఈ జీవుడు - మాయలు

ఎవ్వరెవ్వరివాడో యీజీవుడు చూడ | నెవ్వరికి నేమౌనో యీజీవుడు ||

ఎందరికి గొడుకుగా డీజీవుడు వెనుక- | కెందరికి దోబుట్ట డీజీవుడు |
యెందరిని భ్రమయించ డీజీవుడు దుఃఖ- | మెందరికి గావింప డీజీవుడు ||

ఎక్కడెక్కడ దిరుగ డీజీవుడు వెనుక- | కెక్కడో తనజన్మ మీజీవుడు |
యెక్కడి చుట్టము దనకు నీజీవుడు యెప్పు- | డెక్కడికి నేగునో యీజీవుడు ||

ఎన్నడును జేటులేనీజీవుడు వెనుక- | కెన్నిదనువులు మోవ డీజీవుడు |
యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి | యెన్నిపదవుల బొంద డీజీవుడు ||

-- అన్నమయ్య

(అక్షయ తృతీయ సందర్భంగా!)

Monday, May 3, 2010

కడునడుసు చొరనేల?

కడునడుసు చొరనేల కాళ్ళు గడుగనేల | కడలేని జన్మసాగర మీదనేల ||

దురితంబులనెల్లదొడవు మమకారంబు- | లరిదిమమతలకు దొడ వడియాసలు |
గురుతయిన యాసలకు గోరికలు జీవనము | పరగ నిన్నిటికి లంపటమె కారణము ||

తుదలేని లంపటము దుఃఖహేతువు దుఃఖ- | ముదుటయినతాపమున కుండగ జోటు |
పదిలమగు తాపంబు ప్రాణసంకటము లీ- | మదము పెంపునకు దనమనసు కారణము ||

వెలయు దనమనసునకు వేంకటేశుడు గర్త | బలిసి యాతనిదలచుపనికి దాగర్త |
తలకొన్న తలపులివి దైవమానుషముగా | దలచి యాత్మేశ్వరుని దలపంగ వలదా ||

-- అన్నమయ్య

Sunday, April 18, 2010

ఒక దైవం, ఒక బిల్వ పత్రం

అంతా మిథ్య తలంచి చూచిన, నరుడిట్లౌ టెరింగిన్, సదా
కాంత, ల్పుత్రులు, నర్థమున్, తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది చరించుఁ గాని; పరమార్థంబైన నీ యందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడుఁ గదా శ్రీ కాళహస్తీశ్వరా !

పుడమి న్నిన్నొక బిల్వ పత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం
బడయన్; నేరక పెక్కు దైవములకుం బప్పుల్, ప్రసాదంబులుం,
గుడుముల్, దోసెలు, సారె సత్తు, లటుకుల్, గుగ్గిళ్ళునుం బెట్టుచుం
జెడి యెందుం గొఱగాక పోదు రకటా శ్రీ కాళహస్తీశ్వరా!

-- శ్రీ కాళహస్తీశ్వర శతకము, ధూర్జటి.

Wednesday, March 31, 2010

ఏకాత్మ పంచకం

౧ తన్ను మరచి తనువు తానై తలచి
ఎన్నియో జన్మము లెత్తి తుది -తన్ను
తెలిసి తా నౌట పలు దేశ సంచార
కల న్మేల్కొనుట కను

Forgetting the Self, mistaking the body for the Self, going through innumerable births and finally finding and being the Self — this is justlike waking up from a dream of wandering all over the world.

౨ తానుండి తానుగ దన్ను తా నేనెవ?
దే నుండు స్థానమేది ?
యను వానికి
నేనెవ డెక్కడ నేనున్నా నన్న మధు
పానుని యాడు పలుకు
He who asks ‘Who am I?’ although existing as the Self, is like a drunken man who asks about his own identity and whereabouts.


౩ .తనలో దను ఉండ దాను జడమౌ
తనువందున్నట్టు తలచు -మనుజుడు
చిత్రములో నున్నది చిత్రమున కాధార
వస్త్రమని ఎంచువాడు
When in fact the body is in the Self, to think that the Self is within the insentient body is like thinking that the cinema screen on which a figure is projected is inside the figure.


౪. పొన్నుకు వేరుగ భూషణ ముండునే
తన్ను విడిచి తనువేది -తన్ను
దను వను వాడజ్ఞుడు తా నను వాడు
తను గనిన జ్ఞాని ధరించు .
Has the ornament any existence apart from the gold (of which it is made)? Where is the body apart from the Self? The ignorant mistake the body for the Self, but the Jnani, knower of the Self, perceives the Self as the Self.

౫. ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే
యప్పడా వస్తువు నాది -గురు చెప్పక
చెప్పి తెలియగ జేసినారే , ఎవరు
చెప్పి తెలుపుదురు చెప్పు .
That one Self, the Reality, alone exists for ever. If even the Primal Guru (Adi Guru, Dakshinamurti) revealed it in silence, who can convey it in speech?


ఏకాత్మ తత్వము నిట్టి దని తేల్చి భక్త
దేహాత్మ భావము దీర్చెను ఏకాత్మ
జ్ఞాన స్వరూప రమణ గురు నాధుడు తా
నానతిచ్చు పంచక మందు .

-- భగవాన్ రమణ మహర్షి

Saturday, March 13, 2010

మాటలు - ముక్తి

మాటలుడుగకున్న మంత్రమ్ము దొరకదు
మంత్రముడుగకున్న మనసు నిలువదు
మనసు నిలువకున్న మరి ముక్తి లేదయా
విశ్వదాభిరామ వినుర వేమా

maatalu udugakunna mantrammu dorakadu
until the speech is not subsided, one will not get a mantram (mantram here is a thought)

mantram udugakunna manasu niluvadu
until the thought is not subsided, the mind will not get stabilized.

manasu niluvakunna mari mukti leduraa
until the mind is not stabilized, there is no [concept of] "mukti" i.e., liberation....

visvadaabhiraama vinura vema
o, visvada and abhiraama, listen to this "vema"!

Saturday, March 6, 2010

ఇంద్రియ జయం

విశ్వామిత్ర పరాశర ప్రభృతయో వాతామ్బుపర్నాశనా
స్తేఽపి స్త్రీముఖపఙ్కజమ్ సులలితం దృస్ట్వైవ మోహం గతాః
శాల్యన్నం సఘృతం పయో దధియుతమ్ భుఞ్జన్తి యే మానవా
స్తేషామిన్ద్రియనిగ్రహో యది భవేద్విన్ధ్యః ప్లవేత్సాగరే ౥

వనదళ వాతముల్ మెసవు వారు పరాశర కౌశికాదు లా
ఘనులును సుందరీజనుల గన్గొని మోహిత చిత్తు లైరి హె
చ్చిన ఘ్రుత పాయసాన్నము భుజించెడి వారలకున్ మనోజయం
బు నేగడునేని వింధ్యము సముద్ర జలంబుల దేలియాడదే.

--భర్తృహరి శృంగార శతకం నుంచి

Saturday, February 20, 2010

గృహ్యం - తీసుకో తగినవి

విషాదప్యమృతం గ్రాహ్యమమేధ్యాదపి కాఞ్చనమ్ ౤
నీచాదప్యుత్తమా విధ్యా స్త్రీరత్నం దుష్కులాదపి ౥ - Chanakya Neeti (I-16)

విషాదపి అమృతం గృహ్యం
అమెధ్యాదపి కాంచనం
నీచా దపి ఉత్తమా విద్యా
స్త్రీ రత్నం దుష్కులాదపి

విషం లో ఉన్నా కుడా అమృతాన్ని, అసుద్ధం లో ఉన్నా బంగారాన్ని, నీచుడి దగ్గర నుంచైనా ఉత్తమమైన విద్యని, తక్కువ కులం నుంచైనా స్త్రీ రత్నాన్ని గ్రహించవచ్చు - చాణక్య నీతి నుంచి

Sunday, January 17, 2010

అగ్ని కి సమ్మెట పోటు

అనఘునికైన జేకురు ననర్హుని గూడి చరించునంతలో
మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే
యనువుననైన దప్పవు యథార్ధము; తానది ఎట్టులన్నచో
యినుమును గూర్చి యగ్ని నలయింపదే సమ్మెట పెట్టు భాస్కరా!

-- భాస్కర శతకం నుంచి

చెడ్డ వారి తో కలిసి తిరిగితే మంచి వారికి కూడా కస్టాలు వస్తాయని ఇనుము తో పాటు అగ్ని కి కూడా సమ్మెట పోటు సామ్యం చెపుతోంది ఈ పద్యం దృష్టాంతాలంకారములు బాగా వాడిన శతకం భాస్కర శతకం లోనిది. మారవి వెంకయ్య కవి ఈ శతక రచయిత.

Wednesday, January 13, 2010

సంక్రాంతి పురుష లక్షణం

త్రిశిరం ద్విముఖం చైవ చతుర్వక్త్ర త్రినేత్రకం
లంబకర్ణం రక్తదంతం లమ్బభ్రూ దీర్ఘనాశికమ్
అష్ట బాహు ద్విపాదం చ వికృతం కృష్ణ వర్ణకం
శతయోజనం మౌన్నత్యం విస్తీర్ణమ్ ద్వాదశం స్మృతం
ఏవం రూపం సవిజ్ఞేయం సంక్రాంతేః పురుషస్యతు

--మకర సంక్రాంతి సందర్భంగా

Monday, December 28, 2009

చాణక్య నీతి సూత్రాలు

ఐరణ్డమవలమ్బ్య కున్ఞరమ్ న కోపయేత్
ఆముదం చెట్టు ఆసరా చూసుకుని ఏనుగకు కోపం కలిగించ కూడదు

అతిప్రవృద్ధాపి శల్మలీ వారణస్థమ్భో న భవతి
ఎంత లావుగా పెరిగినా బురుగచెట్టు ఏనుగును కట్టడానికి ఉపయోగించదు

అతిదీర్ఘోఽపి కర్ణికారో న ముసలీ భవతి
కర్నికారం (కొండగోడు) కర్ర ఎంత పొడవు గా ఉన్నా రోకలి గా ఉపయోగించదు

అతిదీప్తోఽపి ఖద్యోతో న పావకః
ఎంత ప్రకాశిస్తున్నా మెరుగుడుపురుగు నిప్పు కాదు

న ప్రవృద్ధత్వమ్ గుణహేతుః
(ధనాదుల చేత) బాగా ఎదిగినంత మాత్రాన సద్గుణాలు రావు

సుజీర్ణోఽపి పిఛుమన్దో న శుఞ్కలాయతే
ఎంత ముదిరినా వేపకర్ర అడకత్తెరకు (సరోతా) ఉపయోగపడదు

యథా బీజమ్ తథా నిష్పత్తిః
విత్తనాన్ని బట్టి దిగుబడి ఉంటుంది

యథా శ్రుతం తథా బుద్ధిః
చదువును పట్టి బుద్ధి

యథా కులం తథాచారః
కులాన్ని పట్టి ఆచారం (నడవడిక)

సంస్కృతః పిచుమన్దో న సహకారో భబతి
ఎంత దోహదం చేసినా వేప తియ్యమామిడి కాదు

-చాణక్య నీతి సూత్రాలు (ఆచార్య పుల్లెల శ్రీ రామచంద్రుడు గారి ఆంధ్ర తాత్పర్యం)
ఇటువంటి 562 సూత్రాలు 8 అధ్యాయాల్లో "రాజనీతి సూత్రాణి" పేరుతొ రచించ బడ్డాయి. ఇవి అందరికీ ఉపకరిస్తాయి.