ప్రసాద్ గారు చెప్పినది నిజమే, “రామః గచ్ఛతి” అనే ఉండాలి. ఛకారం పోతే రామః గతి ఆవుతుంది. అప్పుడు రాముడే గతి కదా! రామం గచ్ఛంతి అంటే అందరూ రాముడి వైపే పయనిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు.
దాని విషయం వదిలేస్తే, వ్యాసం చాలా సరదాగాను, ఆలోచింపజేసేదిగానూ కూడా ఉన్నది. వేలూరి వేంకటేశ్వర రావు గారికి ధన్యవాదాలు!
బండి – ర అనే అక్షరం నా చిన్నప్పుడే మాయమయింది. ఆ రోజుల్లోనే, ఎవరూ ఎప్పుడు మామూలు ర రాయాలో, ఎప్పుడు బండి – ర రాయాలో, నేర్పించలేదు. పెద్దయ్యాక కూడా చేతకాలేదు. తేడాయే తెలిసేది కాదు, ఏవో కొన్ని పదాలు కంఠంస్థం పట్టడం తప్ప. అందరూ వాడుక భాషలో రాయడం మొదలెట్టాక, ఆ అక్షరం పూర్తిగా మాయమయిందనే చెప్పాలి.
భాష అనేది ఎప్పుడూ పరిణామం చెందుతూ వుంటుంది కాబట్టి, ఇది సహజమే – అని నా అభిప్రాయం.
ఇక, క్ష గురింది. ఇది, ఒక విడి అక్షరం కాదు. ఇది , ఒక సంయుక్తాక్షరం.
క్ + ష్ + అ ==> క్ష
అని అందరికీ తెలుసు కదా?
కాబట్టి ఇది, మాయం అయిపోవడం అనేది వుండదు. వాడకంలో తగ్గొచ్చు. ఇది మాయం అవ్వాలంటే, క్, ష్ – రెండూ మాయం అవాలి మరి!
అలాగే, త్ర, జ్ఞ కూడా. ఇవి కూడా సంయుక్తాక్షరాలే! విడి అక్షరాలు కావు కదా?
జ్ఞ అనే అక్షరాన్ని, రామారావు ఎలా పలికినా, కొంత మంది ఉత్తర దేశీయులు (ముఖ్యంగా మా అల్లుడూ, వియ్యంకురాలూ), ‘గ్యా’ అనే పలికారు. ‘జ’, ‘ఞ’ అక్షరాల్లోంచి వచ్చిన ఈ సంయుక్తాక్షరంలో ‘గ’ శబ్దం ఎక్కడ నించీ వొచ్చిందో, నాకయితే అర్ధం కాలేదు. చిన్నప్పట్నించీ, సంస్కృతంలో కొంత మిడకడం వల్ల, ఈ సంయుక్తాక్షరాన్ని సరిగానే పలుకుతూ వొచ్చాను. కొంత మంది దక్షిణ దేశీయులు కూడా ఈ అక్షరాన్ని వేరేగా పలకడం తెలుసు. ఈ సంయుక్తాక్షరాల వాడుక ఏమీ తగ్గినట్టు లేదు మరి!
– ప్రసాద్
“పూలనుంచి సేకరించిన మకరందం తిరిగి తుమ్మెద నోటినుంచి వచ్చి తేనె అయినట్టు జనంనుంచి గ్రహించిన దానినే తిరిగి జనానికి అందించే క్రమంలో అతని పాట మాధుర్యాన్ని సంతరించుకుంది”. వ్యాసం బాగుంది రెడ్డి రామకృష్ణ గారు.
నమస్కారం. కళాపూర్ణోదయం సులువుగా చదువడానికి వీలుగా అందజేసినందుకు కె.వి.ఎస్.రామారావుగారికి ధన్యవాదాలు. ఇది నా whatsapp group లో నా స్నేహితులతో పంచుకుందుకు అనుమతి అభ్యర్థిస్తున్నాను.
మంచితెలుగులో రచన చదువుతుంటే మంచివిందుభోజనం చేసినట్లే ఉంటుంది నాకు.
ఈవ్యాసంలోని తెలుగుభాషావిన్యాసం అలాంటి అనుభూతిని కలిగించింది. మీరచనలు చదవాలి. ఇప్పుడంతా తీరికే కదా నాకు.
నా టీనేజ్ చివరలో రావాడ కృష్ణ గారనే ప్రసిధ్ధ రేఖాచిత్రకారుల స్నేహం దొరికింది. ఆయన ఒక టీచర్. ఒక సందర్భంలో ఒకమ్మాయి మాష్టారూ నాబొమ్మ వేయరా అని మారాం చేస్తే ఆమె నోట్ బుక్కులో అక్షరాలా రెండు నిముషాల్లో పెన్సిల్ ఉపయోగించి బొమ్మ బ్రహ్మాండంగా వేసిచ్చారు. ఆయన కూడా ఫ్రీహేండ్ బొమ్మే బొమ్మ అనేవారు.
ఎమితిని సెపితివె? గురించి Venkateswara Rao veluri అభిప్రాయం:
02/01/2026 6:07 pm
NARA is 95 today.
హఠాత్తుగా అక్షరాలు మాయమైతే… గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:
02/01/2026 11:53 am
ప్రసాద్ గారు చెప్పినది నిజమే, “రామః గచ్ఛతి” అనే ఉండాలి. ఛకారం పోతే రామః గతి ఆవుతుంది. అప్పుడు రాముడే గతి కదా! రామం గచ్ఛంతి అంటే అందరూ రాముడి వైపే పయనిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు.
దాని విషయం వదిలేస్తే, వ్యాసం చాలా సరదాగాను, ఆలోచింపజేసేదిగానూ కూడా ఉన్నది. వేలూరి వేంకటేశ్వర రావు గారికి ధన్యవాదాలు!
హఠాత్తుగా అక్షరాలు మాయమైతే… గురించి ప్రసాద్ అభిప్రాయం:
02/01/2026 9:30 am
బండి – ర అనే అక్షరం నా చిన్నప్పుడే మాయమయింది. ఆ రోజుల్లోనే, ఎవరూ ఎప్పుడు మామూలు ర రాయాలో, ఎప్పుడు బండి – ర రాయాలో, నేర్పించలేదు. పెద్దయ్యాక కూడా చేతకాలేదు. తేడాయే తెలిసేది కాదు, ఏవో కొన్ని పదాలు కంఠంస్థం పట్టడం తప్ప. అందరూ వాడుక భాషలో రాయడం మొదలెట్టాక, ఆ అక్షరం పూర్తిగా మాయమయిందనే చెప్పాలి.
భాష అనేది ఎప్పుడూ పరిణామం చెందుతూ వుంటుంది కాబట్టి, ఇది సహజమే – అని నా అభిప్రాయం.
ఇక, క్ష గురింది. ఇది, ఒక విడి అక్షరం కాదు. ఇది , ఒక సంయుక్తాక్షరం.
క్ + ష్ + అ ==> క్ష
అని అందరికీ తెలుసు కదా?
కాబట్టి ఇది, మాయం అయిపోవడం అనేది వుండదు. వాడకంలో తగ్గొచ్చు. ఇది మాయం అవ్వాలంటే, క్, ష్ – రెండూ మాయం అవాలి మరి!
అలాగే, త్ర, జ్ఞ కూడా. ఇవి కూడా సంయుక్తాక్షరాలే! విడి అక్షరాలు కావు కదా?
జ్ఞ అనే అక్షరాన్ని, రామారావు ఎలా పలికినా, కొంత మంది ఉత్తర దేశీయులు (ముఖ్యంగా మా అల్లుడూ, వియ్యంకురాలూ), ‘గ్యా’ అనే పలికారు. ‘జ’, ‘ఞ’ అక్షరాల్లోంచి వచ్చిన ఈ సంయుక్తాక్షరంలో ‘గ’ శబ్దం ఎక్కడ నించీ వొచ్చిందో, నాకయితే అర్ధం కాలేదు. చిన్నప్పట్నించీ, సంస్కృతంలో కొంత మిడకడం వల్ల, ఈ సంయుక్తాక్షరాన్ని సరిగానే పలుకుతూ వొచ్చాను. కొంత మంది దక్షిణ దేశీయులు కూడా ఈ అక్షరాన్ని వేరేగా పలకడం తెలుసు. ఈ సంయుక్తాక్షరాల వాడుక ఏమీ తగ్గినట్టు లేదు మరి!
– ప్రసాద్
గెలుపు గురించి శ్రీను.కుడుపూడి అభిప్రాయం:
02/01/2026 9:28 am
బాగుంది సార్ కథ.
పాట-మాట-1: జనం మెచ్చిన జాంపండు – మన వంగపండు గురించి మొయిద శ్రీనివాసరావు అభిప్రాయం:
02/01/2026 9:27 am
“పూలనుంచి సేకరించిన మకరందం తిరిగి తుమ్మెద నోటినుంచి వచ్చి తేనె అయినట్టు జనంనుంచి గ్రహించిన దానినే తిరిగి జనానికి అందించే క్రమంలో అతని పాట మాధుర్యాన్ని సంతరించుకుంది”. వ్యాసం బాగుంది రెడ్డి రామకృష్ణ గారు.
హఠాత్తుగా అక్షరాలు మాయమైతే… గురించి ప్రసాద్ అభిప్రాయం:
02/01/2026 4:53 am
ఇంకో చిన్నమాట.
సంస్కృతంలో “గచ్ఛంతి” అని రాయకూడదు.
“గచ్ఛన్తి” అనే రాయాలి.
నా బుర్రకి ఒక చిన్న అనుమానం. ‘ఛ’ అనే అక్షరం లేకపోతే – అన్నప్పుడు, ‘చ’ అనే అక్షరం కూడా లేనట్టు అర్ధం వస్తుందా? ఎలా?
‘ఛ’ అనే అక్షరం లేకపోతే, “గచ్ఛంతి” అనే పదం, “గచంతి” అవుతుంది గానీ, “గంతి” ఎలా అవుతుంది? నాకు అర్ధమే కాలేదు.
హాస్యం కోసమే అలా రాశారు – అనుకోవాలా? అలా అయితే, సరే.
— ప్రసాద్
హఠాత్తుగా అక్షరాలు మాయమైతే… గురించి ప్రసాద్ అభిప్రాయం:
02/01/2026 4:20 am
“రామం” అనే పదం ద్వితీయా విభక్తిలో వుంది. “కర్మ” పదం ఇది.
“గచ్ఛంతి” అనే పదం, “గమ్” అనే మూల ధాతువు యొక్క లట్- లకారం (వర్తమాన కాలం)లో ప్రథమ పురుష బహువచన క్రియాపదం. సంస్కృతంలో క్రియకు “లింగం” (gender) లేదు.
తెలుగులో అనువాదం చేయాలంటే, “రాముడిని వెళుతున్నారు” అని రాయాలి. ఇది సరి కాదు కదా? “రాముడు వెళుతున్నాడు” అని రాయాలంటే, “రామః గచ్ఛతి” అని రాయాలి.
“రామం గచ్ఛంతి “ అనేది సరైన వాక్యం కాదు కదా, నేను సంస్కృతం నేర్చుకున్న ప్రకారం?
“రామః గచ్ఛతి” అని వుండాలి.
ఒక వేళ, “రామం గచ్ఛంతి” అనేది ముద్రారాక్షసమైతే, నాది కంఠశోషే మరి! 🙂
అలా కాకపోతే, ఆ వాక్యం ఎలా సరైనదో, దయచేసి తెలియజేయండి. నాకు తెలియనిదాన్ని, నేర్చుకుంటాను. 🙏🙏
—- ప్రసాద్
కళాపూర్ణోదయం: విషయ సూచిక గురించి Radhadevi అభిప్రాయం:
02/01/2026 12:53 am
నమస్కారం. కళాపూర్ణోదయం సులువుగా చదువడానికి వీలుగా అందజేసినందుకు కె.వి.ఎస్.రామారావుగారికి ధన్యవాదాలు. ఇది నా whatsapp group లో నా స్నేహితులతో పంచుకుందుకు అనుమతి అభ్యర్థిస్తున్నాను.
స్క్రాప్ బుక్ మాటలు గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
01/31/2026 10:52 pm
మంచితెలుగులో రచన చదువుతుంటే మంచివిందుభోజనం చేసినట్లే ఉంటుంది నాకు.
ఈవ్యాసంలోని తెలుగుభాషావిన్యాసం అలాంటి అనుభూతిని కలిగించింది. మీరచనలు చదవాలి. ఇప్పుడంతా తీరికే కదా నాకు.
నా టీనేజ్ చివరలో రావాడ కృష్ణ గారనే ప్రసిధ్ధ రేఖాచిత్రకారుల స్నేహం దొరికింది. ఆయన ఒక టీచర్. ఒక సందర్భంలో ఒకమ్మాయి మాష్టారూ నాబొమ్మ వేయరా అని మారాం చేస్తే ఆమె నోట్ బుక్కులో అక్షరాలా రెండు నిముషాల్లో పెన్సిల్ ఉపయోగించి బొమ్మ బ్రహ్మాండంగా వేసిచ్చారు. ఆయన కూడా ఫ్రీహేండ్ బొమ్మే బొమ్మ అనేవారు.
యూట్యూబ్‍లో ఈమాట: డిసెంబర్ 2025 గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:
01/31/2026 2:29 pm
Dear editors: in my opinion, audio line for prose might not become as popular as the video line. My two cents. Tq. V r veluri.