పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16438

  1. పదమల్లుని పథగమనం: గజ్జెల మల్లారెడ్డికి ఘన నివాళి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    02/21/2026 4:02 am

    గిరి గారు,
    మీరు శ్యామలీయం బ్లాగును సందర్శించి నందుకు చాలా సంతోష మండీ.
    మీకు నా చిరు సాహిత్యకృషి నచ్చినందుకు మరింత సంతోషం.
    అనేక ధన్యవాదా లండీ.

  2. పదమల్లుని పథగమనం: గజ్జెల మల్లారెడ్డికి ఘన నివాళి గురించి Giri అభిప్రాయం:

    02/20/2026 5:40 pm

    కమ్యూనిజంలో ఇచ్చి పుచ్చుకొనే సోదరభావం తప్ప దానం నిషిద్ధం. “నేను ఇస్తున్నాను నువ్వు పుచ్చుకొంటున్నావు” అనేది రాజరికానికి గుర్తు. అది వాళ్ళు అంగీకరించరు. ఈరోజు ఒకరికి ఇస్తే రేపు మనం అవసరంలో ఉన్నప్పుడు వారూ ఇతోధికంగా సాయం చేస్తారు అంతే!

    మీ శ్యామలీయం చూసానండి. మీ ఆధ్యాత్మిక సాహిత్యాభిలాషకి అభినందనలు.

  3. తమిళ సంగ సాహిత్యం-2: అగం కవిత్వ పరిచయం గురించి rao vemuri అభిప్రాయం:

    02/16/2026 9:17 pm

    తమిళంతో పరిచయం లేక రెండు, మూడు సార్లు చదివితే కాని అర్థం కాలేదు. చివరికి బాగుందనే చెప్పాలి!

  4. కంప్యూటర్ చిప్ కథ – 10: మాక్స్‎వెల్ అభిమానులు గురించి వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    02/15/2026 2:08 am

    హనుమా,

    ఈ కథ చాలా బాగుంది.

    ఒక పెద్ద తిరిగే పీఠం (Turntable) బదులు ఒక భ్రమణ పీఠం (Turntable) అని ఉంటే “లంబ దిశలో (Perpendicular)” level లో ఉండేది 😊

    “లాడ్జ్ పరిశోధనలతో పాటు, క్లిష్టమైన శాస్త్రీయ అంశాలను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా సరళంగా వివరించడంలో మేటి అనిపించుకున్నాడు” అని రాసావు, ఉదాహరణకు రైలు పట్టాలు, పిల్లనగ్రోవి వంటి సారూప్యాలు(analogies). ఈ కథ విషయంలో అది నీకు కూడా వర్తిస్తుంది.

    “హెవిసైడ్, “ఆత్మ అమరత్వం” (Immortality of the soul) అనే సిద్ధాంతం మతపరమైనది కాదు; ఆ దృక్పథం పూర్తిగా పొరపాటని ఆయన భావించాడు. ఆయన దృష్టిలో “మరింత ఉదాత్తమైన” అర్థం —ప్రతి వ్యక్తి ఈ ప్రపంచంపై చూపే శాశ్వత ప్రభావం, అది ఆ వ్యక్తి మరణానంతరం కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ కోణంలో చూస్తే, కొన్ని ఆత్మలు అత్యంత మహత్తరమైనవని అన్నాడు” అని రాసావు. ఆ సిద్ధాంతం నాకు నచ్చింది.

    నీ నుండి మరిన్ని విజ్ఞానభరిత వ్యాసాల కోసం ఎదురు చూస్తూ,

    మిత్రుడు
    వెంకటేశ్వరరావు
    సిడ్నీ

    .

  5. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి Kondala Rao Palaka అభిప్రాయం:

    02/15/2026 2:04 am

    దాదాపూ ముప్పయ్యేళ్ళుగా soc.culture.indian.telugu వగైరా ఫోరంస్‌లో పరిచయమున్నా, వేలూరి గారిని 2003 లోనే మొదటిసారిగా కలిసేను. పాండిత్యం, సహృదయం, హాస్యం ఆయన ట్రేడ్‌మార్కులు. Diaspora సాహిత్యాన్ని బాగా ప్రోత్సాహించిన వ్యక్తి. నేను వ్రాస్తున్న వ్యాసాన్నొకదాన్ని ఆయనకి చూపిస్తే బాగుంటుంది అనుకుంటుండగానే అశనిపాతం లాంటి ఈ వార్త!

  6. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి sarma అభిప్రాయం:

    02/13/2026 10:39 pm

    వేలూరివారి పేరు వినడమే కాని వివరం తెలియదు. వారు కాలగ్రాశీభూతులు కావడం బాధాకరమే. వేవే లని దీర్ఘం తీసివుంటారనుకోను. 🙏🙏🙏

  7. ఎవరికెవరు? గురించి చిట్టత్తూరు మునిగొపాల్ అభిప్రాయం:

    02/13/2026 8:29 am

    కథ మామూలుగా మొదలై ఆశావహ మానవీయ దృక్పథంతో ముగిసింది. అథోజగత్తులో కూడా అసమాన వ్యక్తిత్వం అప్పుడప్పుడూ తన ఉనికి చాటుకుంటుందని నిరూపించబడింది. రచయితకు అభినందనలు.

  8. ఎవరికెవరు? గురించి సురేష్ పిళ్లె అభిప్రాయం:

    02/13/2026 1:50 am

    కామెంట్లు పెట్టిన వారికి నమస్తే.

    కథ చదివినందుకు కృతజ్ఞతలు.

    సాధారణంగా మిత్రులకు షేర్ చేసుకోవడం ‘బాగుంద’నే ప్రతిస్పందన తప్ప మరొకటి రాదు. గ్రూపుల్లో షేర్ చేస్తే ఎమోజీలే వస్తుంటాయి. ఈమాటలో ప్రచురితమైన కథను మీరు సావధానంగా చదివి.. అభిప్రాయాలు చెప్పడం, చర్చించడం చాలా సంతోషం. లోపాలుగా మీరు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకుని.. నేను కూడా కథను మళ్లీ తూకం వేసుకునే ప్రయత్నం చేస్తాను. నా బుద్ధి అనుమతించినంత మేర దిద్దుకుంటాను.
    థాంక్యూ

    @పల్లె దేవప్రియం
    నా పాతకథల్లో ముగింపు ఎప్పుడైనా మీకు నచ్చి ఉండవచ్చునేమో. అందుకే అలాంటి వ్యాఖ్య చేశారు. ఒకవేళ అలా మీకు ఏవైనా నచ్చిఉన్నా కూడా అందులో కూడా నా ప్రతిభగానీ, అనుభవంగానీ ఏమీ లేదు. కేవలం కథ అలా నాతో రాయించుకుని ఉంటుందంతే.

    @తాడిగడప శ్యామలరావు
    కథ రాయడంలో నాకేమీ శాస్త్రీయ శిక్షణ లేదు. కథ- స్కెచ్ వంటి వాటిని వింగడించగల నేర్పు లేదు. ఆయా రూపాల లక్షణాలు, నిర్మాణ తీరులు తెలియవు. అందువల్ల, మీ అభిప్రాయం ప్రకారం, కథే కాని దానిని ఆ కోవలో మీరు చదవాల్సి వచ్చింది. సారీ.

  9. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:

    02/12/2026 4:07 pm

    వేలూరి గారి నిర్యాణం బాధాకరం.
    1998 లో మేము ప్రచురించిన వేలూరి వెంకటేశ్వర రావు గారి మొట్టమొదటి కథా సంపుటి ‘మెటమార్ఫసిస్’
    ( డా. వెల్చేరు నారాయణ రావు గారి ముందు మాట, 15 కథలు) అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వారు నన్ను సంప్రదిస్తే ఉచితంగా PDF ప్రతి పంపించగలను.

    భవదీయుడు,

    వంగూరి చిట్టెన్ రాజు
    వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
    వాట్సప్: 1 832 594 9054
    ఇమైల్: vangurioundation@gmail.com

  10. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి Rao Vemuri అభిప్రాయం:

    02/12/2026 2:42 pm

    వేలూరి గారితో ఏనాటి పరిచయం! తెలుగు భాషా పత్రిక స్థాపించిన కొత్త రోజులలో నేను శ్రీ పెమ్మరాజు వేణుగోపాలరావు గారింటికి వెళ్లినప్పుడు వారింటి వీధిగుమ్మంలో వేలూరిగారిని మొదటిసారి కలుసుకున్నాను! అప్పుడు తలనిండా నల్లటి జుత్తుతో ఉన్నారు. ఆయన రాసిన మెటమార్ఫసిస్ కథ ఎన్నిసార్లు చదివేనో! ఆయన ఇక మన మధ్య లేరంటే నమ్మలేకపోతున్నాను.
    మనమిద్దరమూ వేవే లమే అని, ఆయన నాతో తరచు అంటూ ఉండేవారు. – వేవే