ఈ వ్యాసం విస్తారంగా, విశ్లేషణాత్మకంగా ఉంది, “ఫిరదౌసి” ని చాలా చక్కగా పరిచయం చేసింది. “ఫిరదౌసి” ని ఇంతలా అనుభవించి చదివినందుకు, ఆ అనుభవాన్నీ, నీ ఆలోచననీ మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు!
జాషువా గురించి నేను స్కూల్లో తెలుగు పాఠాల్లో మాత్రమే చదివాను. కానీ నన్నతని కవితలు చాలా స్పందింపజేశాయి. అతని శిశువు, రాజు-కవి వంటి కవితలు చాలా నచ్చినా నన్ను చాలా ఆకట్టుకున్నవి మటుకు అతను సామాజంపై వేసిన విసుర్లు. “నా కవితా వధూటి వదనంబును ఎగాదిగ చూసి”, “కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి” వంటి పద్యాలు నాలో చాలా అవేదననీ అభ్యుదయాన్నీ నింపాయి ఆ స్కూల్ రోజుల్లోనే! నీ వ్యాసం ద్వారా మళ్ళీ ఓ సారి జాషువాని తలుచుకున్నాను, థాంక్స్!
కవిత బాగుంది. ఆకాశంమీద పసివాడు ఎగుడుదిగుడు గీతలు గీసినట్టు కొండలున్నాయనడం కొత్త ఊహ. అలాగే మత్తగజంతో కొండను ఉపమింపజేయడం బాగుంది. కవిత్వానికి భావనా బలం ముఖ్యమంటారు కట్టమంచి. ప్రతీకలు ముఖ్యమంటారు పాశ్చాత్యవిమర్శకులు. ఒక విమర్శకునిగా నీకవితలను చదివాక అటు భావనాబలం, ఇటు ప్రతీకవాదం మీకవితల్లో నాకు కనిపించాయమ్మా… చిన్నవయసులో మంచి కవితలు రాస్తుంన్నందుకు మనసారా అభినందిస్తున్నాను. లాటిన్ అమెరికన్ కవిత్వాన్నో ఆఫ్రికన్ కవితలనో అనుకరించి ఒక్కోసారి యథాతథంగా మక్కిమక్కి కాపీకొట్టి గొప్ప కవిత్వం రాస్తున్నట్టు ప్రచారం కల్పించుకొని అవార్డు పల్లకీల్లో ఊరేగుతున్న మార్కెట్ కవుల యుగానికి మీలాంటి యువకవులు ముగింపు పలక గలరన్న ఒక ఆశ మీకవిత్వం చదివాక నెరవేరుతుందని పిస్తుంది. మంచి భవిష్యత్ ఉంది ఇంకా సాధనతో పట్టుదలతో మరిన్ని కవితలురాసి సంకలనంగా వెలువరిస్తావని ఆశిస్తూ చీకట్లో వెలిగి చీకట్లో మిగిలే మిణుగురులు కవితాపాదం గొప్ప ఫిలాసఫికల్ థాట్. అబినందనలు.
ఛందస్సులోను, ఛందస్సు నడ్డి విరగ్గొట్టి ఎడాపెడా కవితలు రాస్తున్న మీకు
జార + నలినముఖులు అన్న పదానికి అర్థం చెప్పాలా?
ఎంతశృంగారకవికయినా మొగపురుగులని, నలినముఖులు, అని వర్ణించే మూర్ఖత్వం ఉంటుందంటారా?
తామరపువ్వులవంటి ముఖాలున్న మొగ సన్నాసులు ఏమిటండీ విడ్డూరం కాకపోతే!(ఒకవేళ మొగవాళ్ళే ఆడవాళ్ళలాగా వేషంవేసుకున్నా, తిమ్మన గారు, వాళ్ళ Max Factor ముఖాలని, తామరపువ్వులతో పోలుస్తాడా?)
అయినా కారా గారు మీ (మన)సందేహం తీర్చగల సమర్థుడు!
నాతెలివికి తాటాకులు కడదామని కోరికుంటే, నే రాసిన కథలనో, వ్యాసాలనో చీల్చి చెండాడండి!
By the way, we might drop in suddenly at Naples! Best wishes, — వేవేరా
ఈ సంచిక ఒక సర్వాంగసుందరమైన సంచిక. దేశికాచార్యుల బిల్హణీయ నాటిక నన్ను మొట్టమొదట ఆకట్టుకొన్నది. అందులోని పద్యములు, గీతములు రసవత్తరముగా నున్నవి. మురళీధరరావుగారి పాండిత్యము, తర్కము, భాషాపటిమ వారి వ్యాసములో ప్రతిబింబించుచున్నది. కామేశ్వరరావుగారి వివరణ పద్యమునకన్న మిన్నగా నున్నది. తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్ పైన దిలీప్ గారి పరిచయ వ్యాసము చదువుటకు చక్కగా నున్నది. ఇది భవిష్యత్తులో బహుజనోపాయకారిగా నుంటుందని ఆశిస్తున్నాను. ఇవి గాక ఇతర రచయితల వ్యాసములు, కవితలు, శబ్దతరంగములు మనోరంజితములు. ఇంత చక్కని సంచికను అందజేసిన సంపాదకులకు నా జోహారులు. – మోహన
శ్రీ తమ్మినేని: పది సంవత్సరాల క్రితం రాసిన మీ ఈ కవితని ఇప్పుడే చూశాను. ఈ genreలొ తెలుగులొ కవితలు రాయటం ఒక సాహసం. మీ కలం మీరు చేసిన సాహసానికి నిజాయితీతొ సహకరించింది. ఒక విషయం: ‘నిరూపించనంటావు’ అని అన్నారు మీ కవితలో, రామానుజన్ ఎప్పుడైనా ‘నిరూపించను’ అని స్పష్టంగా అన్నాడా, కాక పోతే హార్డీ మాటలనుంచి అల్లా అనుకొవచ్చా, లేక కేవలం మీ ఊహాత్మక అభిప్రాయమా? (రాసినది పది సంవత్సరాల క్రితమని తెలిసినా అడుగుతున్నాను).
“అసలు మీరెలా ఉంటారు? ఆర్టో, లిటరేచరో, సినిమానో, భక్తో, పేకాటో, అమ్మాయో, మందో, వల్లకాడో ఏదో ఒకటి ఉండాలి కదా? ఏదీ లేకుండా ఎలా ఉంటారు? చెప్పండి. నిజం చెప్పండి?” అన్నాను తీవ్రంగా.
నిజం చెప్పమంటారా? ఆ పాత్రలోని వ్యక్తి గురించి నేను కూడా అంతవరకు ఆసక్తిగా చదువుతూ వస్తున్నానా, అలా ప్రశ్నించడం చదవగానే నాకూ నవ్వొచ్చింది.
చాలా మంది ఈ లోకంలో వాళ్ల కోసం కన్నా ఎదుటివాళ్ల గురించి ఆలోచిస్తూ సమయం గడిపేస్తారు. మొత్తానికి సమయం గడిపేసాము ఇవ్వాళ్టికి అన్నట్టుగా. కాని అనివార్య పరిస్తితుల్లో ఎదుటివ్యక్తుల గురించి తెలుసుకోవడంలో ఉండే ఆ త్రుష్ణే వేరేమో. మొత్తానికి కథలో పేర్లు లేకుండా, చివరి వరకు ఆసక్తిగా కథని నడిపించడం ఒక ఎత్తెతే ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండానే వెనుతిరగడం ఒక లాంటి వెలితి మిగిల్చింది. అదే కథని ఎక్కువ రోజులు గుర్తుంచుకునేలా చేస్తుందేమో.
మీ కవితలు చదివడం వళ్ల, మీరు రాసిన కథలో కూడా ఆ కవిత్వం నాకు అడుగడుగునా కనిపించింది. ప్రకృతిని మీరు వర్ణించిన తీరు అద్భుతం. నాకు కథ చాలా నచ్చింది. నేనే కథకి ముగింపు నిచ్చేసుకున్నా ఆ వ్యక్తి గురించి తెలుస్కోలేని వెలితితో అదే ఆలోచిస్తూ ఆత్మహత్య వాయిదా పడిపోయి ఉంటుందని. లేదా ఒక అద్భుతమైన కళాఖండం చిత్రించాక ఆ సఫలత విజయంలో తన ఆత్మహత్య మరిచిపోయాడని.
జాషువా – పిరదౌసి గురించి Phanindra అభిప్రాయం:
01/14/2015 1:41 pm
ఈ వ్యాసం విస్తారంగా, విశ్లేషణాత్మకంగా ఉంది, “ఫిరదౌసి” ని చాలా చక్కగా పరిచయం చేసింది. “ఫిరదౌసి” ని ఇంతలా అనుభవించి చదివినందుకు, ఆ అనుభవాన్నీ, నీ ఆలోచననీ మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు!
జాషువా గురించి నేను స్కూల్లో తెలుగు పాఠాల్లో మాత్రమే చదివాను. కానీ నన్నతని కవితలు చాలా స్పందింపజేశాయి. అతని శిశువు, రాజు-కవి వంటి కవితలు చాలా నచ్చినా నన్ను చాలా ఆకట్టుకున్నవి మటుకు అతను సామాజంపై వేసిన విసుర్లు. “నా కవితా వధూటి వదనంబును ఎగాదిగ చూసి”, “కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి” వంటి పద్యాలు నాలో చాలా అవేదననీ అభ్యుదయాన్నీ నింపాయి ఆ స్కూల్ రోజుల్లోనే! నీ వ్యాసం ద్వారా మళ్ళీ ఓ సారి జాషువాని తలుచుకున్నాను, థాంక్స్!
రెండు కవితలు గురించి sreehari అభిప్రాయం:
12/09/2014 11:22 am
నిజంగా నిజంగా అభినందనలు మానసా. ఇంత సరళంగా కూడా కవిత్వం చెప్పచ్చా అనిపిస్తుంది, నీ కవితలు చదువుతుంటే.
రెండు కవితలు గురించి bhanu అభిప్రాయం:
12/01/2014 10:51 pm
అంటూ చీకటి గొప్ప తనాన్ని అందంగా వర్ణించారు. బాగున్నాయి మానస గారు మీ కవితలు.
రెండు కవితలు గురించి బిక్కి కృష్ణ అభిప్రాయం:
11/27/2014 7:38 am
కవిత బాగుంది. ఆకాశంమీద పసివాడు ఎగుడుదిగుడు గీతలు గీసినట్టు కొండలున్నాయనడం కొత్త ఊహ. అలాగే మత్తగజంతో కొండను ఉపమింపజేయడం బాగుంది. కవిత్వానికి భావనా బలం ముఖ్యమంటారు కట్టమంచి. ప్రతీకలు ముఖ్యమంటారు పాశ్చాత్యవిమర్శకులు. ఒక విమర్శకునిగా నీకవితలను చదివాక అటు భావనాబలం, ఇటు ప్రతీకవాదం మీకవితల్లో నాకు కనిపించాయమ్మా… చిన్నవయసులో మంచి కవితలు రాస్తుంన్నందుకు మనసారా అభినందిస్తున్నాను. లాటిన్ అమెరికన్ కవిత్వాన్నో ఆఫ్రికన్ కవితలనో అనుకరించి ఒక్కోసారి యథాతథంగా మక్కిమక్కి కాపీకొట్టి గొప్ప కవిత్వం రాస్తున్నట్టు ప్రచారం కల్పించుకొని అవార్డు పల్లకీల్లో ఊరేగుతున్న మార్కెట్ కవుల యుగానికి మీలాంటి యువకవులు ముగింపు పలక గలరన్న ఒక ఆశ మీకవిత్వం చదివాక నెరవేరుతుందని పిస్తుంది. మంచి భవిష్యత్ ఉంది ఇంకా సాధనతో పట్టుదలతో మరిన్ని కవితలురాసి సంకలనంగా వెలువరిస్తావని ఆశిస్తూ చీకట్లో వెలిగి చీకట్లో మిగిలే మిణుగురులు కవితాపాదం గొప్ప ఫిలాసఫికల్ థాట్. అబినందనలు.
నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:
11/03/2014 9:20 pm
లైలా గారూ:
ఛందస్సులోను, ఛందస్సు నడ్డి విరగ్గొట్టి ఎడాపెడా కవితలు రాస్తున్న మీకు
జార + నలినముఖులు అన్న పదానికి అర్థం చెప్పాలా?
ఎంతశృంగారకవికయినా మొగపురుగులని, నలినముఖులు, అని వర్ణించే మూర్ఖత్వం ఉంటుందంటారా?
తామరపువ్వులవంటి ముఖాలున్న మొగ సన్నాసులు ఏమిటండీ విడ్డూరం కాకపోతే!(ఒకవేళ మొగవాళ్ళే ఆడవాళ్ళలాగా వేషంవేసుకున్నా, తిమ్మన గారు, వాళ్ళ Max Factor ముఖాలని, తామరపువ్వులతో పోలుస్తాడా?)
అయినా కారా గారు మీ (మన)సందేహం తీర్చగల సమర్థుడు!
నాతెలివికి తాటాకులు కడదామని కోరికుంటే, నే రాసిన కథలనో, వ్యాసాలనో చీల్చి చెండాడండి!
By the way, we might drop in suddenly at Naples! Best wishes, — వేవేరా
నిప్పులు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
10/08/2014 9:45 pm
చి.సౌ. మానస చామర్తి గారికి,
భగవత్కరుణానుభవానికి నోచుకొన్న వాగ్విభూతితో కవితలు వ్రాస్తున్నారు. అజహల్లక్షణగా ఉన్న నాయకుని మనోగతాన్ని వ్యంగ్యం చేసి, ప్రణయినీధర్మాన్ని భావధ్వనిగా నిలిపి, పొయ్యిలో రాజుకోవటం మొదలై శీతమారుతపోతసంస్పర్శతో అంతర్హితాలైన అంగారకణికల ద్వారా శృంగారభణితిని వక్తృప్రౌఢోక్తిసిద్ధంగా నిరూపించారని లాక్షణికులంటారు. ఆ అనువర్తనీయతల మాటకేమి గాని, మనసులకు హత్తుకొనిపోయే మధురిమను మాటలతో మూటగట్టారు!
సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
ఈమాట జులై 2014 సంచికకు స్వాగతం! గురించి మోహన అభిప్రాయం:
07/03/2014 11:14 am
ఈ సంచిక ఒక సర్వాంగసుందరమైన సంచిక. దేశికాచార్యుల బిల్హణీయ నాటిక నన్ను మొట్టమొదట ఆకట్టుకొన్నది. అందులోని పద్యములు, గీతములు రసవత్తరముగా నున్నవి. మురళీధరరావుగారి పాండిత్యము, తర్కము, భాషాపటిమ వారి వ్యాసములో ప్రతిబింబించుచున్నది. కామేశ్వరరావుగారి వివరణ పద్యమునకన్న మిన్నగా నున్నది. తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్ పైన దిలీప్ గారి పరిచయ వ్యాసము చదువుటకు చక్కగా నున్నది. ఇది భవిష్యత్తులో బహుజనోపాయకారిగా నుంటుందని ఆశిస్తున్నాను. ఇవి గాక ఇతర రచయితల వ్యాసములు, కవితలు, శబ్దతరంగములు మనోరంజితములు. ఇంత చక్కని సంచికను అందజేసిన సంపాదకులకు నా జోహారులు. – మోహన
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి తః తః అభిప్రాయం:
06/16/2014 10:59 pm
శ్రీ మోహన: డిగ్రీ ల గురించి ‘ ఇంటి దగ్గరి ‘ ఉదాహరణ
కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
అంకితము
మల్లంపల్లి సోమశేఖరశర్మకు
……
‘డిగ్రీలు’ లేని పాండిత్యంబు వన్నెకు – రాని యీ పాడుకాలానఁ బుట్టి
నీ చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూర – మూషరక్షేత్ర వర్షోదక మయి ….
తః తః
రామానుజం (1887-1920) గురించి తఃతః అభిప్రాయం:
04/27/2014 2:34 pm
శ్రీ తమ్మినేని: పది సంవత్సరాల క్రితం రాసిన మీ ఈ కవితని ఇప్పుడే చూశాను. ఈ genreలొ తెలుగులొ కవితలు రాయటం ఒక సాహసం. మీ కలం మీరు చేసిన సాహసానికి నిజాయితీతొ సహకరించింది. ఒక విషయం: ‘నిరూపించనంటావు’ అని అన్నారు మీ కవితలో, రామానుజన్ ఎప్పుడైనా ‘నిరూపించను’ అని స్పష్టంగా అన్నాడా, కాక పోతే హార్డీ మాటలనుంచి అల్లా అనుకొవచ్చా, లేక కేవలం మీ ఊహాత్మక అభిప్రాయమా? (రాసినది పది సంవత్సరాల క్రితమని తెలిసినా అడుగుతున్నాను).
నమస్కారాలతో – తఃతః
మంచు గురించి మెర్సి మార్గరెట్. అభిప్రాయం:
01/27/2014 4:42 am