పాఠకుల అభిప్రాయాలు

కవితలు results: 258

  1. ఆహా గురించి kalhara అభిప్రాయం:

    03/04/2008 1:24 am

    ఇలాంటి కవితలు చదివాక కొన్నాళ్ళు ఏమీ రాయాలనిపించదు. ‘ఇక గొప్పగా రాయటానికి ఏం మిగిలింది గనక’ అనిపించి. ఎన్నాళ్ళు సాన పట్టారు ఈ వజ్రాన్ని?

  2. ఆహా గురించి నిషిగంధ అభిప్రాయం:

    03/03/2008 4:48 am

    ఎన్నిసార్లు చదివినా మళ్ళీ ‘ఆహా!’ అనిపిస్తాయి నీ కవితలు.. ప్రతి ఒక్కటి అద్భుతం!!

  3. యాత్ర గురించి Pavan Kumar Garikapati అభిప్రాయం:

    03/01/2008 8:04 pm

    కవితలు ఎంతొ బాగున్నాయి. క్లుప్తత కి అర్థం ఇదే. వినీల్ ఉక్కు పిడికిళ్ళతో వదులుతున్నాడు కవితలని. కొత్త కొత్త పద బంధాలు చాలా అందంగా ఇమిడాయి.

    పవన్ కుమార్ గరికపాటి

  4. నా జ్ఞాపకం గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    01/03/2008 9:00 pm

    చాలా బావుందండీ.. మీ పాత కవితలు కూడా చదివాను.మంచి పదచిత్రాలు ఉన్నాయి. keep writing!

  5. అరణ్య కవితలు గురించి సరదా సుబ్బారావు అభిప్రాయం:

    09/18/2007 6:06 pm

    ఎంత ఆకలేసి
    దిక్కులంతా కలియతిరిగినా
    ఎట్టకేలకు ఆవకాయ జాడీ

    ఆకలితో మరొక సారి
    అలమటించాలనుంది
    _____________

    చిక్కనైన కమ్మనైన ఆవకాయ జాడీ

    పిండిలో దూరి
    కారంతో మమేకమై
    కమ్మని నూనె తమని
    ముద్దాడుతుంటే

    పుల్ల్లనైన
    ఆవకాయ
    ముక్కలన్నీ
    నోరూరిస్తూ…
    _________________

    తనలో మునిగిన
    ప్రతీ మామిడి ముక్కకీ
    దీక్షగా కారపు ఘుమఘుమల నూనె
    ఒక రుచినిస్తోంది

    చూడ్డానికి ఒకేలా ఉన్నా
    దేని రుచి దానిదే!
    _______________________

    ఏ ఊరి ఆవకాయని చూసినా
    ఆ ఘుమఘుమలు
    నా ఆకలిలో ప్రతిఫలిస్తున్నాయి

    కొన్నాళ్ళకి నేను
    ఆవకాయి వేయడం మొదలు పెట్టాను
    ______________________

    ఒకరితో
    నిమిత్తం లేదు

    ఆవకాయ పెడతారు
    ఖాళీ అయ్యాక కడిగేస్తారు

    మా మంచి బామ్మలు.
    ********************************

    అయ్యా! సరదగా నేను వ్రాసినా అందులో ఉద్దేశ్యం కనిపెట్టలేనివారు కాదు. ఈ ఆవకాయ కవితలా మాత్రం కవితలు ఉండకూడదన్నదే కృష్ణ గారు చెబుతున్నారు. కాస్త నిదానించి అర్ధం చేసుకోండి.

    కొత్త విషయమో లేక కొత్తగానో చెప్పమని అడిగితే ఎక్కడ చూశారో చూపండీ అంటుంటే నవ్వు వస్తోంది. ఏనాడో రామాయణం నుంచి ఈ మధ్య నాటి ఎంకి పాటలు.. దాక ఎన్ని వేల సార్లు అడవి నీటిపై కిరణాలు ప్రతిఫలించడం ఎన్ని వేల రకాలుగా మనం చదవలేదు? అవేవీ ఎవరూ చదవలేదా ఏమిటి కొంపదీసి? ఎన్నో ప్రబంధ కావ్యాలున్నయి కదా.. వాటి నిండా ఈ గొడవే కదా (నాకు అవి నచ్చాయి అన్నది వేరే విషయం!) కొత్తగా కూడా ఎంతో మంది భావకులు వచనంలోనే ఎంతో అందంగా ఈ విషయాన్నే కొత్తగా చెప్పారు.

  6. అరణ్య కవితలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/16/2007 7:18 am

    డు,ము,వు,లు వంటి తెలుగు ప్రత్యయాలు లేకుండా సంస్కృత పదాలను తెలుగు వాక్యంలో రాయడం దాదాపు అసంభవం. కవిత అన్న పదాన్ని “poem” (ఒక కవితా ఖండిక) అన్న అర్థంలో ప్రయోగించడం అర్వాచీనమైనంత మాత్రాన “అరణ్యకవితలు”, “విప్లవ కవితలు”, “వచన కవితలు”- ఇవేవి దుష్టసమాసాలు అయిపోవు. ఇక సమాసం అందంగా అనిపించడంలేదన్న అభ్యంతరం మోహనరావు గారు చెప్పినట్టుగా వ్యక్తిగతం. నా మట్టుకు నాకు అంత ఎబ్బెట్టుగా లేదు. – సురేశ్.

  7. అరణ్య కవితలు గురించి Sriram అభిప్రాయం:

    09/12/2007 9:43 pm

    అరణ్యకవిత దుష్టసమాసం కాకపోవచ్చు. కానీ కవితలు అనేప్పటికి డు,ము,వు,లు ప్రధమావిభక్తి గుర్తొచ్చి తెలుగు పదం అనిపించేస్తోంది. మరి అరణ్యకవితలు కూడా దుష్టసమాసం కాదా?

    నిజానికి, అరణ్యకవిత అంటే నాకు బానే ఉంది కానీ అరణ్యకవితలు అంటే మాత్రం అందంగా అనిపించట్లేదు.

  8. అరణ్య కవితలు గురించి Sriram అభిప్రాయం:

    09/12/2007 8:23 am

    అరణ్య కవితలు అనే కన్నా అడవి కవితలనో అరణ్యకవిత్వమనో అంటే బాగుండేది.

    సంస్కృత పదమూ తెలుగు పదమూ కలిపి దుష్టసమాసం చేసారని కాదు. ఈరోజుల్లో కవిత్వానికి తర్కమే కాదు వ్యాకరణం కూడా అఖ్ఖల్లేదు కదా.

    “అరణ్య కవితలు” అన్నది ఏంటో నాకు వినడానికే అన్ పొయెటిక్ గా ఉంది.

    కేవలం నా అభిప్రాయం.

    షరా: నేను స్వతహాగా ఛాందసుడినే కానీ, ఇది మాత్రం నా సహాధ్యాయి ప్రభావం.

  9. అరణ్య కవితలు గురించి కవిత్వానికి తర్కం అవసరం లేదా? « వికటకవి అభిప్రాయం:

    09/10/2007 12:58 pm

    […]అగ్నికి ఆజ్యం తోడైనట్లు, చావా కిరణ్ గారిచ్చిన ఈ లంకె చూసి ఆ కవితలు, చర్చ చదివాక ఇక లాభం లేదురా అబ్బాయ్, నీ బాధని, నీ సంశయాన్ని బయటికి కక్కేయ్ అని ఆత్మ ఘోషిస్తూంటే, ఇదిగో ఇలా బయటకి చెప్పేసుకుంటున్నా!
    కవిత్వానికి తర్కం అవసరం లేదా? […]

  10. అరణ్య కవితలు గురించి J K Mohana Rao అభిప్రాయం:

    09/07/2007 7:01 am

    చూడ్డానికి ఒకేలా ఉన్నా
    దేని అందం దానిదే!

    అని కవితలోనే వ్రాయబడినది కదా!
    ఎందుకో ఇంత తర్జన-భర్జనలు?
    అన్ని కవితలు ఛందోబద్ధముగా నుండ నవసరము లేదు.
    అన్ని కవితలు ఒక ప్రత్యేక కవి వ్రాసినట్లు ఉండవలసిన
    అవసరము లేదు. లోకో భిన్నరుచిః
    ఎవరికివారే యమునాతీరే! కవితాభావము ఉంటే
    చాలు కవిత్వానికి. దానిని జూవాలజీ విద్యార్థి కోసే
    ఒక కప్ప కళేవరములా కోయ నవసరము లేదు.
    నచ్చితే మఱొక సారి చదవండి.

    – మోహన