అన్వర్ గారు మీ రాతల్ని ఫాలో అవుతున్నా ఈ మధ్య. చాలా బాగా రాస్తున్నారు. మీ కాంటాక్ట్ ఏమైనా ఉంటే షేర్ చెయ్యండి. మీరు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు అనుకుంటా.
అన్నమయ్య కీర్తనలు ఎక్కువగా భక్తిభావంతో కరిగిపోతున్నాయి అలాగే సంగీతసాధనలలో ఇరుక్కుపోతున్నాయి. ప్రతీ కీర్తనలో సాహిత్యాన్ని ఈకాలం వాడుకభాషలో వివరించి ఈ తరానికి అందించాలి. అన్నమయ్య కీర్తనలు, పోతన భాగవతం అలాగే రామదాసు కీర్తనలు…ఈ మహానదులు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉండాలి. అటువంటి సాహిత్యవేత్తలను eemaata.com ప్రోత్సహించాలని కోరుతున్నాం.
తుపానులతో తలపడుతూ శిశిరాలను ఎదిరిస్తూ యుద్ధాలు చేసి చేసి అలసిన శరీరపు కొమ్మలపై మరో వసంతపు పిట్ట అప్పుడే ఎలా వాలింది? ఏమైనా చెప్పారా… తీసుకున్నవాళ్లకు తీసుకున్నంత, పాఠకుల ఊహలకే ఒక సవాలు విసిరారు…
కలానికి, ఎన్ని వైపులనుంచైనా పదును పెట్టొచ్చని చెప్పారుగా!
ఈ వ్యాసం నచ్చింది, దానిపై వచ్చిన అభిప్రాయాలు చాలావరకూ వ్యాసం ప్రామాణికతకు లోటు రానీయకుండానే ఉన్నై. అయితే paradigm shift అంటే ‘రూపావళి మార్పు’ అనడం సరికాదు. భాషాశాస్త్రంలో రూపావళిని paradigmకి (ధాతువుకి తిఙ్ ప్రత్యయాలు చేర్చగా ఏర్పడిన పదావళి) వాడుతున్నది నిజమే గానీ ఆ paradigm ఇక్కడి paradigm వేరు. ఇక్కడి చర్చలో paradigm అంటే కొన్ని సిద్ధాంతాలకు ప్రాతిపదిక. దాన్ని అధిసిద్ధాంతం అనవచ్చునేమో.
నిజమే మరి!
రాజ కుటుంబ స్త్రీల పరిస్థితి గాలిలో నీటి బుడగ వంటిది. ప్రతి క్షణం పెనం మీద ఉన్నట్టు ఉంటుంది. ఇక దానిలో నైతికత, సంప్రదాయాలు వెతకటం సముద్రంలో మంచి నీరు వెతికినట్టే.
కథ బాగుంది. ముగింపు ముచ్చటగా ఉంది. అయితే ఎటువంటి మలుపులు లేకుండా ఉన్నట్టుంది. శారద మనసులోని సంఘర్షణ, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులకు సిద్ధం అవ్వడం బాగుంది
నాకు పైన చూపిన https://www.magaMti.org/ సైట్ తెరుచుకోనే లేదు! This site can’t be reached అని వస్తోంది సందేశం.
ఓడిస్సీ గురించి వినటమే కాని కథ ఏమీ తెలియదు నాకు.
మంచి చందమామ సీరియల్ కథ లాగా ఉంది. అనువాదం చదవటానికి హాయిగా ఉంది. పిల్లల కోసం వ్రాసానంటున్నారు. చాలా సంతోషం. ముసలివాళ్ళూ పిల్లలతో సమానం కాబట్టి నాకోసం వ్రాసారనుకొని అనందంగా చదువుకున్నాను.
ఈ ట్రాయ్ యుద్ధానికి సంబంధించి సీరియల్ చందమామలో వచ్చింది. అక్కడక్కడ చదివినట్లు జ్ఞాపకం ఉంది. మొత్తం ఐతే అది చదవలేదు.
స్క్రాప్ బుక్ మాటలు గురించి Govardhan అభిప్రాయం:
01/31/2026 2:13 pm
అన్వర్ గారు మీ రాతల్ని ఫాలో అవుతున్నా ఈ మధ్య. చాలా బాగా రాస్తున్నారు. మీ కాంటాక్ట్ ఏమైనా ఉంటే షేర్ చెయ్యండి. మీరు కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు అనుకుంటా.
నిలువు నూరు వండేటి మొలక: అన్నమయ్య పదం గురించి Giri అభిప్రాయం:
01/29/2026 6:41 pm
అన్నమయ్య కీర్తనలు ఎక్కువగా భక్తిభావంతో కరిగిపోతున్నాయి అలాగే సంగీతసాధనలలో ఇరుక్కుపోతున్నాయి. ప్రతీ కీర్తనలో సాహిత్యాన్ని ఈకాలం వాడుకభాషలో వివరించి ఈ తరానికి అందించాలి. అన్నమయ్య కీర్తనలు, పోతన భాగవతం అలాగే రామదాసు కీర్తనలు…ఈ మహానదులు ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉండాలి. అటువంటి సాహిత్యవేత్తలను eemaata.com ప్రోత్సహించాలని కోరుతున్నాం.
ఆకాంక్ష గురించి venkat KVR అభిప్రాయం:
01/29/2026 5:33 pm
తుపానులతో తలపడుతూ శిశిరాలను ఎదిరిస్తూ యుద్ధాలు చేసి చేసి అలసిన శరీరపు కొమ్మలపై మరో వసంతపు పిట్ట అప్పుడే ఎలా వాలింది? ఏమైనా చెప్పారా… తీసుకున్నవాళ్లకు తీసుకున్నంత, పాఠకుల ఊహలకే ఒక సవాలు విసిరారు…
కలానికి, ఎన్ని వైపులనుంచైనా పదును పెట్టొచ్చని చెప్పారుగా!
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి ఉమామహేశ్వరరావు గారపాటి అభిప్రాయం:
01/29/2026 12:42 pm
ఈ వ్యాసం నచ్చింది, దానిపై వచ్చిన అభిప్రాయాలు చాలావరకూ వ్యాసం ప్రామాణికతకు లోటు రానీయకుండానే ఉన్నై. అయితే paradigm shift అంటే ‘రూపావళి మార్పు’ అనడం సరికాదు. భాషాశాస్త్రంలో రూపావళిని paradigmకి (ధాతువుకి తిఙ్ ప్రత్యయాలు చేర్చగా ఏర్పడిన పదావళి) వాడుతున్నది నిజమే గానీ ఆ paradigm ఇక్కడి paradigm వేరు. ఇక్కడి చర్చలో paradigm అంటే కొన్ని సిద్ధాంతాలకు ప్రాతిపదిక. దాన్ని అధిసిద్ధాంతం అనవచ్చునేమో.
కళ్యాణ తిలకం గురించి చందు అభిప్రాయం:
01/29/2026 3:38 am
నిజమే మరి!
రాజ కుటుంబ స్త్రీల పరిస్థితి గాలిలో నీటి బుడగ వంటిది. ప్రతి క్షణం పెనం మీద ఉన్నట్టు ఉంటుంది. ఇక దానిలో నైతికత, సంప్రదాయాలు వెతకటం సముద్రంలో మంచి నీరు వెతికినట్టే.
పద్మవ్యూహం గురించి చందు అభిప్రాయం:
01/29/2026 1:37 am
యుద్ధం వలన గెలుపెవరిదైనా బాధ పడేది తల్లి. ఇంకెవరికీ ఆ బాధ గురించి పూర్తిగా వర్ణించడం వీలు కాదేమో.
ఓ ప్రేమ కథ గురించి చందు అభిప్రాయం:
01/29/2026 12:45 am
కథ బాగుంది. ముగింపు ముచ్చటగా ఉంది. అయితే ఎటువంటి మలుపులు లేకుండా ఉన్నట్టుంది. శారద మనసులోని సంఘర్షణ, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులకు సిద్ధం అవ్వడం బాగుంది
ఓడిస్సీ – 2: మహాప్రస్థానం గురించి Rao Vemuri అభిప్రాయం:
01/28/2026 10:34 pm
శ్యామల రావు గారూ, ఈ దిగువ లంకె చూడండి.
https://www.maganti.org/newgen/index1.html
సైన్సు వ్యాసాలు-పుస్తకాలు అనే అంశం కింద చూడండి.
పోతన భాగవతంలో దృశ్యీకరణం – 4 గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
01/28/2026 6:55 pm
చిన్నముద్రారాక్షససవరణ:
ఆ కొలనులో నివsiస్తున్న ఒక మొసలి
దయచేసి సవరించగలరు.
[సరిచేసాము. మా తప్పును సూచించినందుకు ధన్యవాదాలు. – సం.]
ఓడిస్సీ – 2: మహాప్రస్థానం గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
01/28/2026 12:58 pm