సుదీర్ఘ కవిత్వ ప్రస్థానంలో అఫ్సర్ తనకంటూ సృష్టించుకున్న భాషను వెలికితీసి, అఫ్సర్ నిర్లయాత్మక శైలిని ఈ సంపుటి లోని కవితలు నుండి బలంగా విశ్లేషించి చక్కగా మీరు వివరించారు. అఫ్సర్ గారికి, మీకూ అభినందనలు.
ప్రతి పద్యమూ కావ్యమే ఎంత గాయత్రీ మంత్ర మహిమ. ఈ పద్యాలను కవి చేత వ్రాయించగలిగిందో? ఇలాంటి కవితలు ఈ కవి కలంనుండి మరెన్నో వచ్చేలా గాయత్రీదేవి దీవించు గాక 🙏🌷
సంపాదకులకి ఒక ప్రశ్న/ఉత్తరం లేదా మీరు ఏదనుకుంటే అది.
ఇంటర్నెట్ (అంతర్జాలం) మీద తెలుగు చదువుకోవడానికి, ఈమాట లో తెలుగు కధలు కాకరకాయలు చూసుకోవడానికి (అదే తెలుగులోనే) వస్తూ ఉంటాము. రోజులో దాదాపు 90 శాతం ఆంగ్లంలో గడుపుతూ ఉంటాం కనక తెలుగులో చదువుకోవడానికి అదో సంతోషం. మనం రాసే కధల్లో (నాతో సహా) ఆంగ్ల పదాలు లేకుండా రాయలేకపోతున్నాం, సరే కనీసం కధ పేర్లు కూడా తెలుగులో రాయరేం? జనవరి నెలలో పేర్లు ఇలా ఉన్నై – నో ఎక్జిట్, బ్లిస్ హోం, ఎవరెస్ట్ బేస్ కేంప్, వర్ల్డ్ వితిన్, ఐడెంటిటీ ఉద్యమాలు వగైరా. ఇవన్నీ పంటి కింద ఇంగువ ముక్కల్లా తగుల్తున్నాయి. ఎవరెస్ట్ బేస్ కేంప్ వదిలేసి (యాత్రానుభవం కనక, కానీ దీన్ని కూడా సులభంగా అనువదించగలరు అమరేంద్ర గారు) మిగతావి అన్నింటికీ తెలుగు పేర్లు పెట్టవచ్చు కదా? కనీసం సంపాదకులు కధలు/కవితలు రాసేవారికి ఎందుకు చెప్పడం లేదు తెలుగు పేర్లు పెట్టమని. మొత్తం అంతా తెలుగులో రాయమని కాదు కానీ కనీసం కధ/కవిత కి పేరు అయినా తెలుగులో పెట్టలేమా?
ఇంక ఈ నెలలో సంపాదకులకి ఉత్తరం గురించి చెప్పనవసరమే లేదు. దాదాపు మొత్తం అంతా ఆంగ్లంలోనే ఉంది. ఆంగ్ల కధకులని ఉటంకించినప్పుడు వాళ్ళవి ఇంగ్లీషులో చెప్పడం బాగానే ఉంది కానీ మొత్తం అంతా ఇంగ్లీషులో అయితే (అదీ వేలూరి లాంటి వారినుంచి!!). ఒక్కొక్కప్పుడు లైలాగారు స్పానిష్షో, ఫ్రెంచో రాస్తారు. అది ఎవరికోసమో అర్ధం కాదు. నాలాటి అర్భకులకి తెలుగు, ఇంగ్లీషుకూడా సరిగ్గా రావు; మిగతాభాషల సంగతి ఎందుగ్గానీ.
ఈమాట తెలుగు పత్రిక అనేది మర్చిపోతున్నామా? ఒక్కొక్కప్పుడు కధ/కవిత పేరు ఇంగ్లీషులో చూడగానే అది ఇంక చదవాలనిపించడం లేదు (కనీసం నా మటుక్కి). అనువాదాలు చేసే అవినేని భాస్కర్ గారు కూడా చక్కగా “అకాశంలో వినిపించే స్వరాలు,” అంటూ అనువదించగలుగుతున్నప్పుడు మిగతావారికి ఏమిటి కష్టం? సంపాదకులు కనీసం ఈ విషయం రచయితలతో చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈమాట చేస్తున్న పని ఇష్టపడేవాడిగా, దశాబ్దం పైగా వాళ్ళ రచనలకు పాఠకునిగా ఇలాంటి ఏకపక్ష సంపాదకీయం వాళ్ళ నుంచి నేనెప్పుడూ ఆశించలేదు.
కొన్ని పబ్లిషింగ్ హౌస్‌లు రచయితల పుస్తక ప్రచురణాభిలాష మీద మోపుతున్న నిర్దాక్షణ్యమైన భారాన్ని చూశాకా ఈ సంపాదకీయం లో సహానుభూతి లోపించిందని తోస్తోంది. ఈ విమర్శ నలుగురు సంపాదక మిత్రులు కలసి డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని “రచయితలెంత వెధవలంటే” అని ప్రారంభించి మాట్లాడుకున్నదాన్ని సారాంశంగా ప్రచురించినట్టుంది తప్పించి సహానుభూతితో అన్నివైపులను గమనించి రాసిన “సంపాదకీయం”లా తోచలేదు. ఇది ఆబ్జెక్టివ్‌గా చూసి తిరగరాసుకుని ఉండొచ్చు. అది జరగలేదని అర్థం అవుతోంది.
ఇందులో అబద్ధాలు రాయలేదు. కానీ, ఒకే దృక్కోణం నుంచి మొత్తం రాశారు. కనీసంలో కనీసం – ఈ విషయంలో మార్పులు ఎక్కడైనా జరుగుతుంటే వాటిని ప్రస్తావించడమో, బిగ్ పిక్చర్ ఇలా ఉండడానికి జరుగుతున్న కారణాలను మెరుగ్గా విశ్లేషించడమో కూడా లేదు. ఇది విమర్శ కాదు. ఉత్తి Rant.
ఉదాహరణకు “ఆ ప్రచురణకర్తలు ఎన్ని అమ్మారో ఆ డబ్బు ఏమైందో చెప్పరు అంటూ వాపోయే రచయితల రద్దీ గత కొంతకాలంగా ఎక్కువయింది” అన్న వాక్యం చూడండి. ఈమధ్యకాలంలో ప్రచురణకర్తలకు తామే డబ్బిచ్చి, ప్రచురణసంస్థల పేరిట రచయితలు ప్రచురించుకోవడం బాగా పెరిగింది. ప్రచురణకర్తలు ఇదొక తరహా వ్యాపారంగా చూస్తున్నాయి. ఇంతవరకూ బానే ఉంది. అలాంటప్పుడు డబ్బిచ్చిన రచయిత ఎన్ని అమ్మారో, ఆ డబ్బు ఏమైందో చెప్పకపోతే దానిపై వ్యంగ్యంగా రాసే పనేముంది? పోనీ ఇది వ్యంగ్యం కాదనుకుంటే సంపాదకీయంలో మరోచోట ప్రచురణకర్తలను సమర్థిస్తూ రచయితలను “మీకేం తెలవదు, తెలియనట్టు ఉండరు” అన్న ధోరణిలో ఎందుకు రాయాలి? ఈ రకంగా రాసే సంపాదకీయంలో “మార్పు ఎలా అయితే అనివార్యమో, మార్పు తాలూకు ప్రభావాలను అన్ని కోణాలనుంచీ విశ్లేషించుకోవడమూ అంతే అనివార్యం.” అని మొదట్లోనే ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయాల్సిన అవసరం ఏముంది?
నేను అర్థం చేసుకున్నంతలో ఈ వ్యాసం లక్ష్యం వ్యాసంలో చెప్పినంత విస్తృతమైనది కాదు. సగానికి సగం వ్యాసం – ఈమాట సంపాదకీయ పద్ధతులను వ్యతిరేకించే, అంగీకరించని రచయితల మీద Rantగానే సాగింది. అసలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో రాస్తున్న, పుస్తకాలు వేస్తున్న రచయితల్లో ఎంతమంది ఈమాటకి వ్యాసాలు, కథలు, కవితలు పంపించివుంటారు? ఎంత శాతం? అలాంటప్పుడు, ఆ అంశమే ప్రధానంగా రచయితలను మదింపు వేస్తూ రాసే పనేమిటి? అలాంటప్పుడు దీన్ని విస్తృతమైన రచనల నాణ్యత గురించి, ఈమాట నిర్వాహకవర్గంలో అత్యధికులకు అస్సలు సంబంధం లేని పబ్లిషర్లు-రచయితల డైనమిక్స్ గురించి తోచిన జడ్జిమెంట్లు పాస్ చేయాల్సిన అవసరం ఏమిటి?
ఇన్ని రాశారు కదా. అసలు ఈనాడు ఉన్న పరిస్థితిలో సగటు రచయితకు తన రచనల గురించి ఏవో కొన్ని చప్పట్లు మినహాయించి ఏం మోటివేషన్ మిగిలింది? “అహాలు, అపోహలు” మినహా ఏమీ లేవని జనరలైజ్ చేయకపోతే ఇన్సెంటివ్, మోటివేషన్ వంటివి అయినా ఎక్స్‌ప్లోర్ చేసి ఉండకూడదా?
తమాషా ఏమిటంటే – రచనల్లో నాణ్యత గురించి రాసిన సంపాదకీయమే కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రాయడం. బహుశా, తెలుగు సాహిత్యపు తీరుతెన్నుల్ని సంకేతాత్మకంగా ఈమాట సంపాదకులు ఇలా చెప్పాలనుకుని ఉంటారు.
పదాలతో పెనవేసుకొని ఉండే conventional మూసల ఇమాజినేషన్‌ని సదా ప్రతిఘటిస్తూ పదాలకి ఆవలి భావాన్ని తోడితెచ్చి, చదువరికి అనుభవం చేసే auditory imagination నిండి ఉన్న మీ కవిత ‘వలలెందుకు?’ (టైటిల్ బాలేదు గానీ) గొప్పగా ఉంది. ఇటువంటి మంచికవితలు అరుదుగానైనా ఈమాటలో కనబడటం బాగుంది.
ఈమాట శీర్షికల్లో ఒక్క ‘కవితలు’ మినహా, మిగతా genresలో ఉత్తమాభిరుచి, ఉన్నత ప్రమాణాలూ కనబడుతుంటాయి. ఇందులో రాసేవాళ్లు, కామెంట్లు చేసేవాళ్లు, చర్చోపచర్చల్లో కలబడేవాళ్లు, ఈ ఈమాట నిర్వాహకులతో సహా ఒక Finite Set (గణిత పరిభాష) లాగా, నిలయవిద్వాంసుల బృందం! ఆధునిక – ఆధునికోత్తర కవిత dictionకి ఆ finite set అలవాటు పడకపోయినా, ఇస్మాయిల్ గారి వంటి కవులకి ఈమాటలో స్థానం దక్కడానికి కారణం – బహుశా వేల్చేరు నారాయణరావు గారి వంటి ఒకరిద్దరు scholars, connoisseurs of modern poetry అసోసియేషన్ వల్ల కామోసు.
మరొక పెళ్ళికూతురు: సీత: (ఈమధ్య నా పెద్దన్న నాకు వాట్సాప్‌లో పంపినది యథాతథంగా: పంపినది పంపినట్టుగా)
మరొక జ్ఞాపకం: ముఖపుస్తక మిత్రురాలు చి.సౌ.శిరీష తంగిరాలగారి సీతను చదవంగానే నాఆత్మీయమిత్రుడు శ్రీ చల్లాసీతారామాంజనేయులు గారు స్ఫురించారు. వారిప్పుడు కీర్తిశేషులు.
వారొకప్పుడు వారి మేనల్లుడు చదువుతున్న “బారులు తీరి కేల కరవాలములం ధరియించి కూరుచున్నారు… జానకి చూచువారి నోరూరగ…” పద్యాన్ని విని ఎవర్రా రాసింది? అని అడిగారట. మేనల్లుడు సమాధానమిచ్చాడు. చూచువారి నోరూరటానికి సీతాదేవి మిఠాయిపొట్లమా! అన్నారట.నువ్వైతే ఎలా రాస్తావు మామా? అని అల్లుడు అడిగాడట. వీరు మరునాడు అల్లుడిని పిలిచి సీత అంటే ఏమిటో విను:
పతింవర
******
“మనసులోనున్న వాంఛితమ్మునకు రూప మొదవినట్టుల నా పురామృదుల పుణ్యలతకు ఫలమట్ల ఈ వీర లలిత మూర్తి, తా నవతరించి నన్ను సౌఖ్యాన కెత్తు! 1
మళ్ళీ నేను: చల్లావారితొ పరిచయం 1973,74లలో ఒక సంక్రాంతికి బెజవాడ సోనొవిజన్ మేడమీద జరిగిన స్వీయకవితా పఠన కార్యక్రమలో నేనూ నా పెద్దన్న శ్రీ సుబ్రహ్మణ్య శర్మా శ్రీ చల్లా మా మా కవితలు చదివిన సందర్భంలో కార్యక్రమం ముగిసిన తర్వాత కలిసిన పలకరింపులతో మొదలై 2004-05ల దాకా నడిచింది. వారు విశ్వనాథకు పరమ ఆత్మీయులు. వారు నాకు రెండు మూడు సార్లు చెప్పిన ఒక వివరం: “ఆంజనేయులూ నా పెళ్ళికి పంచరత్నాలు నువ్వు సంస్కృతంలో రాయి. తెలుగులో నేను రాసుకుంటానులే!” శ్రీ కొంగర జగ్గయ్య – గుంటూరు లో వారి సహాధ్యాయి మిత్రుడు.
శ్రీ చల్లా నా పెళ్ళికీ మా అబ్బాయి పెళ్ళికీ పంచరత్నాలు రాశారు.
మంచి రచనలు, అవి కథలు గాని, కవితలు గాని ఇప్పుడూ వస్తున్నాయి. కాని పాఠకులలో చదివే అలవాటు, అభిరుచి తగ్గిపోతున్నాయి. అందువల్ల పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. చివరికి రచయితలే పాఠకులుగా మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది. ఏ రచనలైనా సమకాలీన సమాజంలోని సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, వీలైనంత పరిష్కారం చూపిస్తే అటువంటి రచనలు కొంత కాలమైనా నిలబడతాయని నా అభిప్రాయం. మన సినిమాలకు కథలు దొరక్క ఎలాగైతే ఒక స్తబ్ధత ఏర్పడిందో, అలాగే మన రచయితలకు సరైన కథా వస్తువులు దొరకటం లేదు. ఒక తరం వెనక్కు వెళితే సమాజంలో అప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు. క్రమంగా తగ్గుతున్నాయి. వరకట్నం, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం ఇతివృత్తంగా ఎన్నో రచనలు వచ్చేవి. ఇప్పుడు అసలు వైవాహిక వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలా మారుతున్న సమాజంలో సరైన సమస్యలను ఎంచుకుని మంచి కథలుగా మలిచే రచయితలు తక్కువగా ఉన్నారు. ఇక పుస్తక ముద్రణ అనేది వ్యక్తిగతం. రచయితను అనిపించుకోవాలి, నా పేరు ప్రింట్ లో చూసుకోవాలి అనేవాళ్ళు ఆ పుస్తకాలను బంధు మిత్రులకు ఉచితంగా పంచుతున్నారు. కొన్ని పత్రికలు మంచి థీమ్ లను నిర్దేశిస్తూ కథల పోటీలను నిర్వహిస్తున్నాయి. ఇది ముదావహం. ….జయంతి.
నిరీక్షణ
గురించి Poduru v s Pardhasaradhi అభిప్రాయం:
01/04/2023
4:47 am
పద్మావతిగారి కవితలు సరళమైన బాషలో అపారమైన భావాన్ని సృజించే ప్రజ్ఞాశాలి… ఎందుకో ఈ కవిత నాకు అసంపూర్తిగా అనిపిస్తోంది.
విజయ్ గారు మీ కవితలు ఎంతో బాగున్నాయి నిజంగా చాలా అర్థవంతంగా కూడా ఉన్నాయి కంగ్రాట్యులేషన్స్ అండి ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నేను తూర్పుగోదావరి జిల్లా నుండి పీపుల్స్ గార్డియన్ అనే ఒక వెబ్ డైలీ న్యూస్ పేపర్ ని నడుపుతున్నాను దానిలో మీ కవితలు ప్రచురించాలి అని ఆశిస్తున్నాను దయచేసి మీ మొబైల్ నెంబర్ తెలియజేయగలరు ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను 949 2251150 మరియు 6281679225 పై రెండింటికీ వాట్సాప్ అకౌంట్ కలవు దయచేసి కవితలను ప్రచురించడానికి అనుమతించగలరు
నిరంతర యుద్ధాల మధ్య సజీవ శంఖారావం గురించి శీలా సుభద్రాదేవి అభిప్రాయం:
07/02/2025 7:45 am
సుదీర్ఘ కవిత్వ ప్రస్థానంలో అఫ్సర్ తనకంటూ సృష్టించుకున్న భాషను వెలికితీసి, అఫ్సర్ నిర్లయాత్మక శైలిని ఈ సంపుటి లోని కవితలు నుండి బలంగా విశ్లేషించి చక్కగా మీరు వివరించారు. అఫ్సర్ గారికి, మీకూ అభినందనలు.
దర్శనము గురించి శిరీష అభిప్రాయం:
06/03/2025 7:49 am
ప్రతి పద్యమూ కావ్యమే ఎంత గాయత్రీ మంత్ర మహిమ. ఈ పద్యాలను కవి చేత వ్రాయించగలిగిందో? ఇలాంటి కవితలు ఈ కవి కలంనుండి మరెన్నో వచ్చేలా గాయత్రీదేవి దీవించు గాక 🙏🌷
సంపాదకునికి ఉత్తరం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
01/05/2025 12:36 pm
సంపాదకులకి ఒక ప్రశ్న/ఉత్తరం లేదా మీరు ఏదనుకుంటే అది.
ఇంటర్నెట్ (అంతర్జాలం) మీద తెలుగు చదువుకోవడానికి, ఈమాట లో తెలుగు కధలు కాకరకాయలు చూసుకోవడానికి (అదే తెలుగులోనే) వస్తూ ఉంటాము. రోజులో దాదాపు 90 శాతం ఆంగ్లంలో గడుపుతూ ఉంటాం కనక తెలుగులో చదువుకోవడానికి అదో సంతోషం. మనం రాసే కధల్లో (నాతో సహా) ఆంగ్ల పదాలు లేకుండా రాయలేకపోతున్నాం, సరే కనీసం కధ పేర్లు కూడా తెలుగులో రాయరేం? జనవరి నెలలో పేర్లు ఇలా ఉన్నై – నో ఎక్జిట్, బ్లిస్ హోం, ఎవరెస్ట్ బేస్ కేంప్, వర్ల్డ్ వితిన్, ఐడెంటిటీ ఉద్యమాలు వగైరా. ఇవన్నీ పంటి కింద ఇంగువ ముక్కల్లా తగుల్తున్నాయి. ఎవరెస్ట్ బేస్ కేంప్ వదిలేసి (యాత్రానుభవం కనక, కానీ దీన్ని కూడా సులభంగా అనువదించగలరు అమరేంద్ర గారు) మిగతావి అన్నింటికీ తెలుగు పేర్లు పెట్టవచ్చు కదా? కనీసం సంపాదకులు కధలు/కవితలు రాసేవారికి ఎందుకు చెప్పడం లేదు తెలుగు పేర్లు పెట్టమని. మొత్తం అంతా తెలుగులో రాయమని కాదు కానీ కనీసం కధ/కవిత కి పేరు అయినా తెలుగులో పెట్టలేమా?
ఇంక ఈ నెలలో సంపాదకులకి ఉత్తరం గురించి చెప్పనవసరమే లేదు. దాదాపు మొత్తం అంతా ఆంగ్లంలోనే ఉంది. ఆంగ్ల కధకులని ఉటంకించినప్పుడు వాళ్ళవి ఇంగ్లీషులో చెప్పడం బాగానే ఉంది కానీ మొత్తం అంతా ఇంగ్లీషులో అయితే (అదీ వేలూరి లాంటి వారినుంచి!!). ఒక్కొక్కప్పుడు లైలాగారు స్పానిష్షో, ఫ్రెంచో రాస్తారు. అది ఎవరికోసమో అర్ధం కాదు. నాలాటి అర్భకులకి తెలుగు, ఇంగ్లీషుకూడా సరిగ్గా రావు; మిగతాభాషల సంగతి ఎందుగ్గానీ.
ఈమాట తెలుగు పత్రిక అనేది మర్చిపోతున్నామా? ఒక్కొక్కప్పుడు కధ/కవిత పేరు ఇంగ్లీషులో చూడగానే అది ఇంక చదవాలనిపించడం లేదు (కనీసం నా మటుక్కి). అనువాదాలు చేసే అవినేని భాస్కర్ గారు కూడా చక్కగా “అకాశంలో వినిపించే స్వరాలు,” అంటూ అనువదించగలుగుతున్నప్పుడు మిగతావారికి ఏమిటి కష్టం? సంపాదకులు కనీసం ఈ విషయం రచయితలతో చెప్పాల్సిన అవసరం ఉంది.
అద్వైతం గురించి Rao Vemuri అభిప్రాయం:
06/04/2024 6:56 pm
నేను సాధారణంగా కవితలు చదవను కానీ ఈ చిన్న కవిత ఈ “కొస” నుండి ఆ “కొస” కి చదివించింది. అర్థగర్భితంగా ఉందేమో, “భలే” బాగుందనిపించింది.
అక్టోబర్ 2023 గురించి పవన్ సంతోష్ సూరంపూడి అభిప్రాయం:
10/08/2023 10:53 pm
ఈమాట చేస్తున్న పని ఇష్టపడేవాడిగా, దశాబ్దం పైగా వాళ్ళ రచనలకు పాఠకునిగా ఇలాంటి ఏకపక్ష సంపాదకీయం వాళ్ళ నుంచి నేనెప్పుడూ ఆశించలేదు.
కొన్ని పబ్లిషింగ్ హౌస్‌లు రచయితల పుస్తక ప్రచురణాభిలాష మీద మోపుతున్న నిర్దాక్షణ్యమైన భారాన్ని చూశాకా ఈ సంపాదకీయం లో సహానుభూతి లోపించిందని తోస్తోంది. ఈ విమర్శ నలుగురు సంపాదక మిత్రులు కలసి డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని “రచయితలెంత వెధవలంటే” అని ప్రారంభించి మాట్లాడుకున్నదాన్ని సారాంశంగా ప్రచురించినట్టుంది తప్పించి సహానుభూతితో అన్నివైపులను గమనించి రాసిన “సంపాదకీయం”లా తోచలేదు. ఇది ఆబ్జెక్టివ్‌గా చూసి తిరగరాసుకుని ఉండొచ్చు. అది జరగలేదని అర్థం అవుతోంది.
ఇందులో అబద్ధాలు రాయలేదు. కానీ, ఒకే దృక్కోణం నుంచి మొత్తం రాశారు. కనీసంలో కనీసం – ఈ విషయంలో మార్పులు ఎక్కడైనా జరుగుతుంటే వాటిని ప్రస్తావించడమో, బిగ్ పిక్చర్ ఇలా ఉండడానికి జరుగుతున్న కారణాలను మెరుగ్గా విశ్లేషించడమో కూడా లేదు. ఇది విమర్శ కాదు. ఉత్తి Rant.
ఉదాహరణకు “ఆ ప్రచురణకర్తలు ఎన్ని అమ్మారో ఆ డబ్బు ఏమైందో చెప్పరు అంటూ వాపోయే రచయితల రద్దీ గత కొంతకాలంగా ఎక్కువయింది” అన్న వాక్యం చూడండి. ఈమధ్యకాలంలో ప్రచురణకర్తలకు తామే డబ్బిచ్చి, ప్రచురణసంస్థల పేరిట రచయితలు ప్రచురించుకోవడం బాగా పెరిగింది. ప్రచురణకర్తలు ఇదొక తరహా వ్యాపారంగా చూస్తున్నాయి. ఇంతవరకూ బానే ఉంది. అలాంటప్పుడు డబ్బిచ్చిన రచయిత ఎన్ని అమ్మారో, ఆ డబ్బు ఏమైందో చెప్పకపోతే దానిపై వ్యంగ్యంగా రాసే పనేముంది? పోనీ ఇది వ్యంగ్యం కాదనుకుంటే సంపాదకీయంలో మరోచోట ప్రచురణకర్తలను సమర్థిస్తూ రచయితలను “మీకేం తెలవదు, తెలియనట్టు ఉండరు” అన్న ధోరణిలో ఎందుకు రాయాలి? ఈ రకంగా రాసే సంపాదకీయంలో “మార్పు ఎలా అయితే అనివార్యమో, మార్పు తాలూకు ప్రభావాలను అన్ని కోణాలనుంచీ విశ్లేషించుకోవడమూ అంతే అనివార్యం.” అని మొదట్లోనే ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయాల్సిన అవసరం ఏముంది?
నేను అర్థం చేసుకున్నంతలో ఈ వ్యాసం లక్ష్యం వ్యాసంలో చెప్పినంత విస్తృతమైనది కాదు. సగానికి సగం వ్యాసం – ఈమాట సంపాదకీయ పద్ధతులను వ్యతిరేకించే, అంగీకరించని రచయితల మీద Rantగానే సాగింది. అసలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో రాస్తున్న, పుస్తకాలు వేస్తున్న రచయితల్లో ఎంతమంది ఈమాటకి వ్యాసాలు, కథలు, కవితలు పంపించివుంటారు? ఎంత శాతం? అలాంటప్పుడు, ఆ అంశమే ప్రధానంగా రచయితలను మదింపు వేస్తూ రాసే పనేమిటి? అలాంటప్పుడు దీన్ని విస్తృతమైన రచనల నాణ్యత గురించి, ఈమాట నిర్వాహకవర్గంలో అత్యధికులకు అస్సలు సంబంధం లేని పబ్లిషర్లు-రచయితల డైనమిక్స్ గురించి తోచిన జడ్జిమెంట్లు పాస్ చేయాల్సిన అవసరం ఏమిటి?
ఇన్ని రాశారు కదా. అసలు ఈనాడు ఉన్న పరిస్థితిలో సగటు రచయితకు తన రచనల గురించి ఏవో కొన్ని చప్పట్లు మినహాయించి ఏం మోటివేషన్ మిగిలింది? “అహాలు, అపోహలు” మినహా ఏమీ లేవని జనరలైజ్ చేయకపోతే ఇన్సెంటివ్, మోటివేషన్ వంటివి అయినా ఎక్స్‌ప్లోర్ చేసి ఉండకూడదా?
తమాషా ఏమిటంటే – రచనల్లో నాణ్యత గురించి రాసిన సంపాదకీయమే కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రాయడం. బహుశా, తెలుగు సాహిత్యపు తీరుతెన్నుల్ని సంకేతాత్మకంగా ఈమాట సంపాదకులు ఇలా చెప్పాలనుకుని ఉంటారు.
వలలెందుకు? గురించి నరేష్ నున్నా అభిప్రాయం:
06/03/2023 12:00 am
పదాలతో పెనవేసుకొని ఉండే conventional మూసల ఇమాజినేషన్‌ని సదా ప్రతిఘటిస్తూ పదాలకి ఆవలి భావాన్ని తోడితెచ్చి, చదువరికి అనుభవం చేసే auditory imagination నిండి ఉన్న మీ కవిత ‘వలలెందుకు?’ (టైటిల్ బాలేదు గానీ) గొప్పగా ఉంది. ఇటువంటి మంచికవితలు అరుదుగానైనా ఈమాటలో కనబడటం బాగుంది.
ఈమాట శీర్షికల్లో ఒక్క ‘కవితలు’ మినహా, మిగతా genresలో ఉత్తమాభిరుచి, ఉన్నత ప్రమాణాలూ కనబడుతుంటాయి. ఇందులో రాసేవాళ్లు, కామెంట్లు చేసేవాళ్లు, చర్చోపచర్చల్లో కలబడేవాళ్లు, ఈ ఈమాట నిర్వాహకులతో సహా ఒక Finite Set (గణిత పరిభాష) లాగా, నిలయవిద్వాంసుల బృందం! ఆధునిక – ఆధునికోత్తర కవిత dictionకి ఆ finite set అలవాటు పడకపోయినా, ఇస్మాయిల్ గారి వంటి కవులకి ఈమాటలో స్థానం దక్కడానికి కారణం – బహుశా వేల్చేరు నారాయణరావు గారి వంటి ఒకరిద్దరు scholars, connoisseurs of modern poetry అసోసియేషన్ వల్ల కామోసు.
నాకు నచ్చిన పద్యం: అమృతం కురిసిన మైథిలి మనస్సు గురించి ఎరికలపూడి వాసుదేవ రావు అభిప్రాయం:
02/06/2023 10:20 am
మరొక పెళ్ళికూతురు: సీత: (ఈమధ్య నా పెద్దన్న నాకు వాట్సాప్‌లో పంపినది యథాతథంగా: పంపినది పంపినట్టుగా)
మరొక జ్ఞాపకం: ముఖపుస్తక మిత్రురాలు చి.సౌ.శిరీష తంగిరాలగారి సీతను చదవంగానే నాఆత్మీయమిత్రుడు శ్రీ చల్లాసీతారామాంజనేయులు గారు స్ఫురించారు. వారిప్పుడు కీర్తిశేషులు.
వారొకప్పుడు వారి మేనల్లుడు చదువుతున్న “బారులు తీరి కేల కరవాలములం ధరియించి కూరుచున్నారు… జానకి చూచువారి నోరూరగ…” పద్యాన్ని విని ఎవర్రా రాసింది? అని అడిగారట. మేనల్లుడు సమాధానమిచ్చాడు. చూచువారి నోరూరటానికి సీతాదేవి మిఠాయిపొట్లమా! అన్నారట.నువ్వైతే ఎలా రాస్తావు మామా? అని అల్లుడు అడిగాడట. వీరు మరునాడు అల్లుడిని పిలిచి సీత అంటే ఏమిటో విను:
పతింవర
******
“మనసులోనున్న వాంఛితమ్మునకు రూప మొదవినట్టుల నా పురామృదుల పుణ్యలతకు ఫలమట్ల ఈ వీర లలిత మూర్తి, తా నవతరించి నన్ను సౌఖ్యాన కెత్తు! 1
తాత్త్వికులెల్ల మన్నిటల తాండవకుంకుమ రాగ వీరప
త్నీత్వ మహోగ్రరేఖ గణుతించి వచించిరి తండ్రి “కీమె శౌ
ర్యత్వ మహత్త్వపూర్ణుడగు రాజసమూర్తికి రాజ్ఞియౌ”నటం-
చా త్వరపెట్టు వాంఛ హృదయమ్మున నేండ్లు భరించి యుంచితిన్! 2
భోగము ఆస చేయను;విభుత్వ ప్రభుత్వము కోరుకోను నా-
యోగము పండెనేని ప్రథనోగ్ర భుజోజ్వల శౌర్యమూర్తి అ-
భ్యాగతుడౌను గావుత; ప్రభావిత మామక భాగ్యమౌ ధను
-ర్యాగ మహోత్సవమ్మునకు రాగ నవోదయ మైన వేళకున్! 3
ఈతని చేత వింటి కొన లెంతగ వంగెనొ!శత్రు వక్ర రే-
ఖాతి పరాక్రమమ్ములటు,లల్లరి తుమ్మెద లల్లెత్రాటి మ్రో-
తై తెగి యాడెనే ప్రణయ తాండవ కన్యక వోలె నారి;నా-
చేతము నందు; కండ్ల నును సిగ్గులు మూయగ వీని చూపులై! 4
మా జనకుడు నా కొరకు మంగళమే పొనరించినాడునా
పూజలకైన లక్ష్యంమగు పుణ్యుడటే;యితడాత్మ శౌర్యహే
లాజయ సూచకోన్నత విలాసం వలాహక నీల మూర్తి;వే
లాజలు చల్లునట్లు చెలులందరు ఈతనివైపె చూస్తుంటే! 5
జయలక్ష్మీ మృదుపీఠమైన విరళాశ్మ ప్రౌడ వక్షస్సము-
ఛ్ఛ్రయదేశంబున మాలకట్టెదను హస్తాబ్జాత యుగ్మాన; హై
మ యశఃక్షౌమము చుట్టెదన్ పృధు మహాంసస్నిగ్ధతూణీరమౌ
గ్ధ్యయుతోపాంతమునన్, మనోజ్ విశిఖాకారంబులౌ వ్రేళులన్!6
శ్రీ సుమదీప్తిమన్మమతలే,తలబ్రాలుగ చల్లెదన్,లతా
పేశలకుంతలాఢ్యునకు; వేణు మృగాలకు రాగతోయముల్
పోసెద క్షాత్రధారలుగ,భౄధనురంతర దేశలగ్న దీ
ర్ఘాసమ నాసికాశుగ విరాడ్యువతీ వికసన్మనోహరున్! 7
క్షమ హృదయమ్ము,బుద్ధిని వికాసము, చిత్తము సుస్థిరత్వ మం
గమును శుచిత్వమై,విషయకంటక దూరగమౌ మనస్సుతో,
విమలయశో2భివర్తను, పవిత్ర చరిత్రు,పతింవరాశిరో2
గ్రమణి వరించె,నీలమృదులద్యుతిమత్సమభక్త దేహునిన్!!8
(శ్రీ చల్లా సీతారామాంజనేయులుగారి కావ్యమాల (1968)నుండి. అంతర్వాణి-వారి కలంపేరు)
****
మళ్ళీ నేను: చల్లావారితొ పరిచయం 1973,74లలో ఒక సంక్రాంతికి బెజవాడ సోనొవిజన్ మేడమీద జరిగిన స్వీయకవితా పఠన కార్యక్రమలో నేనూ నా పెద్దన్న శ్రీ సుబ్రహ్మణ్య శర్మా శ్రీ చల్లా మా మా కవితలు చదివిన సందర్భంలో కార్యక్రమం ముగిసిన తర్వాత కలిసిన పలకరింపులతో మొదలై 2004-05ల దాకా నడిచింది. వారు విశ్వనాథకు పరమ ఆత్మీయులు. వారు నాకు రెండు మూడు సార్లు చెప్పిన ఒక వివరం: “ఆంజనేయులూ నా పెళ్ళికి పంచరత్నాలు నువ్వు సంస్కృతంలో రాయి. తెలుగులో నేను రాసుకుంటానులే!” శ్రీ కొంగర జగ్గయ్య – గుంటూరు లో వారి సహాధ్యాయి మిత్రుడు.
శ్రీ చల్లా నా పెళ్ళికీ మా అబ్బాయి పెళ్ళికీ పంచరత్నాలు రాశారు.
ఎ వా రా
ఫిబ్రవరి 2023 గురించి JVVSN Murthy అభిప్రాయం:
02/05/2023 2:30 am
మంచి రచనలు, అవి కథలు గాని, కవితలు గాని ఇప్పుడూ వస్తున్నాయి. కాని పాఠకులలో చదివే అలవాటు, అభిరుచి తగ్గిపోతున్నాయి. అందువల్ల పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోతోంది. చివరికి రచయితలే పాఠకులుగా మిగిలిపోయే దుస్థితి ఏర్పడింది. ఏ రచనలైనా సమకాలీన సమాజంలోని సమస్యలను సున్నితంగా స్పృశిస్తూ, వీలైనంత పరిష్కారం చూపిస్తే అటువంటి రచనలు కొంత కాలమైనా నిలబడతాయని నా అభిప్రాయం. మన సినిమాలకు కథలు దొరక్క ఎలాగైతే ఒక స్తబ్ధత ఏర్పడిందో, అలాగే మన రచయితలకు సరైన కథా వస్తువులు దొరకటం లేదు. ఒక తరం వెనక్కు వెళితే సమాజంలో అప్పుడు ఉన్న సమస్యలు ఇప్పుడు లేవు. క్రమంగా తగ్గుతున్నాయి. వరకట్నం, స్త్రీలకు ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం ఇతివృత్తంగా ఎన్నో రచనలు వచ్చేవి. ఇప్పుడు అసలు వైవాహిక వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలా మారుతున్న సమాజంలో సరైన సమస్యలను ఎంచుకుని మంచి కథలుగా మలిచే రచయితలు తక్కువగా ఉన్నారు. ఇక పుస్తక ముద్రణ అనేది వ్యక్తిగతం. రచయితను అనిపించుకోవాలి, నా పేరు ప్రింట్ లో చూసుకోవాలి అనేవాళ్ళు ఆ పుస్తకాలను బంధు మిత్రులకు ఉచితంగా పంచుతున్నారు. కొన్ని పత్రికలు మంచి థీమ్ లను నిర్దేశిస్తూ కథల పోటీలను నిర్వహిస్తున్నాయి. ఇది ముదావహం. ….జయంతి.
నిరీక్షణ గురించి Poduru v s Pardhasaradhi అభిప్రాయం:
01/04/2023 4:47 am
పద్మావతిగారి కవితలు సరళమైన బాషలో అపారమైన భావాన్ని సృజించే ప్రజ్ఞాశాలి… ఎందుకో ఈ కవిత నాకు అసంపూర్తిగా అనిపిస్తోంది.
ఒక ఖాళీ ఉదయం గురించి Subramanyam అభిప్రాయం:
11/20/2022 12:43 am