పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16437

  1. ది అన్‌సీన్ గురించి Raja Mukhtavaram అభిప్రాయం:

    06/01/2026 4:16 am

    ఈమాట స్టాండర్డ్స్ బాగా తగ్గుతున్నాయి, ఓ రెండు మూడు నెల్ల క్రితం దాకా ఎడిటోరియల్స్ చాలా సూటిగా వివరణాత్మకంగా ఉండేవి. ఇప్పుడు పాంప్లెట్ సాహిత్యంలా వుంది. ఈ మాట ఒక్కటే కొంచెం చదివించదగ్గ పత్రిక అని ఒక ఓదార్పు ఉండేది. అది నెమ్మదిగా నశిస్తోంది.

    ఈ కథ మరీ ప్రత్యేకంగా అక్కడక్కడా తీసుకొచ్చి రాసిన వాక్యాల బొంత లాగావుంది.

    – “‘అతను’ అనేది వట్టి గొడవ ఆపేవాడు మాత్రమే కాదు. ఎవరో ఒకరి అవమానాన్ని ఒక్క క్షణం ఆపేవాడు కూడా.” ఏమిటండీ ఈ వాక్య నిర్మాణం. రచయిత సంగతి సరే, ఇంకెవ్వరూ కథ ఎలా రాసారో చూడరా. ఎలా రాస్తే అలా వేసేసుకుంటారా?

    – “సార్త్రే వాక్యం గుర్తొచ్చింది, – మనం చేసిన చర్యలే మనం.” మధ్యలో సార్త్రే ఎందుకు? ఇలాంటి ఏమాత్రం పసలేని కథలో కొటేషన్స్ పెట్టి చదివేవాణ్ణి ఇంప్రెస్ చెయ్యాలన్న ప్రయత్నంలా వుంది.

    అసలు ఏంటండీ ఆ అనువాదం, ‘We are Our Actions’ అన్నదానికి చేసిన అనువాదం అనుకుంటా.
    మనమేమిటో మన చేతలు చెప్తాయి – అని రాయొచ్చుగా.

    మన తెలుగు అనువాదకులు చేసే అనువాదాల కంటే ఘోరంగా వుంది రచయిత గారి అనువాదం. ఇంతకంటే చెప్పగలిగింది ఏమీ లేదు.

    దయచేసి – మీరు పత్రిక పాఠకుల కోసం నడుపుతున్నారని గమనించ ప్రార్థన.

  2. తలుపులు బార్లా తెరవండి, ఎదురుగా మీ పల్లెటూరుంది గురించి chinaveerabhadrudu vadrevu అభిప్రాయం:

    06/01/2026 4:06 am

    చాలా చాలా ధన్యవాదాలు వాసు గారు! ఒక కవి హృదయాన్ని అతడి జీవితకాలంలోనే ఒక సహృదయుడు పట్టుకోవడం కన్నా ఆ కవికి గొప్ప భాగ్యం మరేదీ ఉండదు.

  3. మనసును దోచే మనస్లు– 5 గురించి Seshagiri Nimmagadda అభిప్రాయం:

    05/31/2026 2:17 pm

    Thank you Srinivas garu and Ramesh garu for your kind comments and feedback.
    Seshagiri

  4. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    05/28/2026 3:02 am

    కొడవళ్ళ హనుమంతరావుగారికి, కె.వి.యెస్.రామారావుగారికి, మంథా వీరభద్రంగారికి, తఃతః గారికి, చదివి వెన్ను తట్టినందుకు ధన్యవాదాలు.

    1. ఇతర భాసనాటకాలను కూడా అనువదించాలనే ఆలోచన ఉన్నదండీ, ప్రయత్నిస్తాను. అన్నట్లు, అల్లప్పుడెప్పుడో, చందమామలో ప్రచురించిన భాసకథల గురించి చెప్పి, కుతూహలాన్ని కలిగించిన క్రెడిటు మీకే.
    2. ఫార్మాటింగ్ గురించి: మూలం– అనువాదం రెండు కాలమ్స్ ‌గా వేయాలని అనుకున్నాము. కానీ ఫోన్లోనో, ట్యాబులోనో చదివే పాఠకులకు కష్టమవుతుందని ఆ ఆలోచనను విరమించుకున్నాము.
    3. వీరభద్రంగారు చెప్పినట్లు “సింగంబాకట…”పద్యంలో కుంతీసుతమధ్యముడనే మాటను “సమరస్థేమాభిరామాకృతి” అయిన అర్జునుడికి వాడారు తిక్కన. అదెట్లా అని సందేహం కలిగి తి.తి.దే.వారి భారతం చెక్ చేసాను. “కుంతి కొడుకులు నిజానికి ముగ్గురే. వాళ్ళలో నడిమివాడు భీముడు. కాని కుంతి అట్లా అనుకొనలేదు. మాద్రీపుత్రులైన నకుల, సహదేవులనూ తన సొంతకొడుకులు అనే అనుకొన్నది. అందుచేత కౌంతేయులన్నా పాండవులన్నా ఒక్కటే! కాగా, ఐదుమందిలో మధ్యవాడూ అర్జునుడే. ఇట్లా అని వ్యాసుడే అన్నాడు. దాన్నే తిక్కన పాటించాడు,” అని వ్యాఖ్యానంలో చెప్పారు. భాసుడి భీముడు “భ్రాతౄణామపి మధ్యమః” అని చెప్పేసాడు.
    4. తఃతః గారు చెప్పినట్లు వ్యాయోగపు కథాకాలం ఒక పగలును మించకూడదు (“వ్యాయోగస్తు ఏకాహకృతః”). నేను మిస్ చేసాను.

    మరోసారి కృతజ్ఞతలతో
    వురుపుటూరి శ్రీనివాస్

  5. శ్రీనాథుని చాటుపద్యములు గురించి .Veera Raghava Reddy అభిప్రాయం:

    05/27/2026 6:48 am

    నాకు శ్రీనాథుల వారన్నా, వారి పద్యాలన్నా ఎంతో ఇష్టం. చాలా శృంగారంగా ఉంటాయి వారి పద్యాలు.

  6. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి తః తః అభిప్రాయం:

    05/27/2026 4:29 am

    “మధ్యముడు” అంటే ఒక విషయం గుర్తొసోంది: నేను మూడో కొడుకుని. మా అమ్మ ఇంట్లో – బయటకు వెళ్ళి ఏమైనా తేవాల్సిన పని వస్తే, “పేరన్న పెద్దవాడు, సూరన్న సుకుమారి. చిన్నా! నువ్వే వెళ్ళి తీసుకురారా” అని మా చిన్నన్ననే పంపేది.
    నమస్కారాలతో – తః తః

  7. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి తః తః అభిప్రాయం:

    05/27/2026 1:30 am

    శ్రీ శ్రీనివాస్ వురుపుటూరి: ఈ నాటకాన్ని తెలుగు చేసి ఇచ్చిన మీకు కృతజ్ఞతలతో ధన్యవాదాలు. పది సంవత్సరాల పై మాటే యూ ట్యూబ్ లో కేరళ కళాకారుల సంస్కృత నాటక ప్రదర్శన చూశాను. ‘వ్యాయోగం’లో చూపిన కథ కొన్ని గంటల్లోనో ఒక ఫూటలోనో జరిగినదిగా ఉండాలన్న నియమం కూడా ఉన్నదని చదివిన గుర్తు. బ్రాహ్మణవృద్ధుడు భీమ, ఘటోత్కచుల కొసగిన ఆశీర్వాదాలలో ఉన్న తేడాను గూడా అప్పుడే గమనించిన గుర్తు. నమస్కారాలతో – తః తః

  8. మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి మంథా వీరభద్రం అభిప్రాయం:

    05/25/2026 3:27 pm

    వురుపుటూరి వారు చాలా చక్కగా వ్రాసారు. తెనుగుసేత నేర్పుగా ఒదిగింది.

    ఆధునిక కవి, నాటకకారుడైన కాలిదాసు తన మాళవికాగ్నిమిత్ర నాందీ ప్రస్తావనలో పూర్వ కవుల నాటకాల గురించి చెప్తూ సూత్రకారుడితో,

    ప్రథితయశసాం భాస సౌమిల్ల కవిఫుత్రాదీనాం
    ప్రబంధాన్ అతిక్రమ్య వర్తమానకవేః కాళిదాసస్య
    క్రియాయాం కథం బహుమానః”

    అని అనిపించాడు కదా. ఇద్దరి కాలాలూ ఎప్పటివైనా భాసుడి కన్నా కాళిదాసు అర్వాచీనుడు అన్నది నిర్వివాదం అనుకున్నాను. ఇక్కడ కొడవళ్ళ వారి వ్యాఖ్య చదివాక, ఇది కూడా కాదనే పండితులున్నారని తెలిసింది.

    మ.వ్యా కీ, ఐతరేయ బ్రాహ్మణంలోని సునశ్శేపుడి కథకూ పోలిక ఎవరికైనా తడుతుంది. మాయాబజారు పోలిక మాత్రం తెనుగువాడికే తెలుస్తుంది. ఇంతకూ మాయాబజారు కథకు మూలం యేదో మరాఠీ నాటకంట కదా!

    “కుంతీపుత్రుల్లో మధ్యముడు కదా” అని అన్నారు కథా సంగ్రహంలో.
    ఇది అనవసరమైన అనుమానాలను రేకెత్తించి, మూలంలో యేముందో చూడాలనిపించేలా చేసింది. సమరస్తేమాభిరామాకృతితో వచ్చే మరో కుంతీపుత్రమధ్యముడున్నాడు కదా! అందుకని.

  9. కుండీలో మర్రిచెట్టు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    05/25/2026 1:13 pm

    ఇంతకాలమూ వచనకవితాపచనంలో ఒక్కో లైనూ రెండేసి మార్లు చదవటం ఆనవాయితీగా వస్తోంది. (ఒకసారి చెప్తే శ్రోతల తలల కెక్కదని ఎంత ప్రగాఢవిశ్వాసమో కదా!)

    ఇపుడు వచనకవితారచనలో ఒక్కో లైను తరువాత ఒక అదనపు ఖాళీలైనుతో రెండేసిపంక్తుల జాగాతో నిడివిని ద్విగుణంచేసే లసద్గుణం ఒక కొత్తసంప్రదాయంగా మొదలౌతున్న దన్న మాట. (పాఠకులకు కండ్లు సరిగా ఆనవనా? ఏమో!)

    [శ్యామలరావుగారు ఇవి తిక్కన ఫాంటులో 2000 ప్రాంతంలో మా గ్రంథాలయంలో ఉంచిన రచనలు. ఆ తరువాత 2006లో తిక్కననుండి యూనికోడ్‌కు కన్వర్ట్ చేసినప్పుడు లైన్లమధ్య జాగా ఆడ్ అయ్యింది. అందువల్ల కన్‌వర్ట్ చేసిన రచనలు అలా కనిపిస్తున్నాయి. – సం.]

  10. కుండీలో మర్రిచెట్టు గురించి కోటగిరి చిట్టిబాబు అభిప్రాయం:

    05/24/2026 1:32 pm

    రచనాశైలి చాలా బాగుంది. పూర్తిగా చదివి అర్ధం చేసుకోవడానికి టైం పట్టింది. ఎందుకంటే మేము కవులం కాదు కదా! కవితలో వాడి వేడి ఆర్ద్రత నీ సొంతం. మరిన్ని కీర్తి శిఖరాలు ఎక్కాలని కోరుకుంటూ,
    బాల్య మిత్రుడు కోటగిరి చిట్టిబాబు, పిఠాపురం