పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16438

  1. కళాసాగరం కర్ణాటకం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/03/2026 6:10 pm

    Many thanks Srinivas garu..i hope your love for Travelogues prompts you to travel more..

  2. పాట-మాట-1: జనం మెచ్చిన జాంపండు – మన వంగపండు గురించి Ramesh అభిప్రాయం:

    02/03/2026 5:38 pm

    వంగపండు గారి గురించి వారి రచనలు మరియు వారి పాట గురించి చక్కగా రాశారు.

  3. కళాపూర్ణోదయం: విషయ సూచిక గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    02/03/2026 2:45 pm

    రాధాదేవి గారు: తెలుగు రచనలు చదవటమే మహాభాగ్యం. లంకెలు పంచుకోవటానికి ఎవరి అనుమతులూ ఎందుకు? హాయిగా పంచుకుని అందరూ చదివి ఆనందించండి !

  4. ఫిబ్రవరి 2026 గురించి Giri అభిప్రాయం:

    02/03/2026 10:20 am

    చాలా బాగా చెప్పారు. ఇప్పుడున్న సాంకేతికత కారణంగా ఆంగ్లానువాదం మీద ఆధారపడనవసరంలేదు. భాషల మధ్య అనుసంధానానికి సాంకేతికత ఉపయోగపడుతున్నప్పుడు మూలభాషల విస్తృత అధ్యయనం మీద దృష్టి పెట్టాలి.

  5. కళాసాగరం కర్ణాటకం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    02/02/2026 11:29 pm

    Thank you అమరేంద్రగారూ!

  6. కళాసాగరం కర్ణాటకం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    02/02/2026 11:26 pm

    Thank you Srinivas garu!

  7. కళాసాగరం కర్ణాటకం గురించి అమరేంద్ర అభిప్రాయం:

    02/02/2026 11:19 pm

    నాకు తెలిసి ఇది కథకుడు కవి శ్రీనివాస్ బందా తొలి యాత్రారచన. మొదటి కథనంలోనే చక్కని పరిణత. అభినందనలు.

  8. కళాసాగరం కర్ణాటకం గురించి Srinivas అభిప్రాయం:

    02/02/2026 11:16 pm

    Nicely described.

    I fall in love with travelogues after Mr. Amarendra’s writings (own/translations).

    If one just describes what he sees, it will be just an account. It will be informative. However, if one explains his/her feelings and how he felt at different moments, it becomes poetry. The explanation need not be very poetic. The minor details give special flavor to the write-up. (True, one needs to know the balance).

    Thank you, Srinivas Garu, for this account. Eagerly waiting for the next installment.

  9. మనమెరుగని మధ్య అమెరికా 2 గురించి అమరేంద్ర దాసరి అభిప్రాయం:

    02/02/2026 4:48 pm

    ధన్యవాదాలు మనోజ్ కుమార్ గారూ
    ధ్రువతార – పెద్దమాట వాడారు

  10. ఎవరికెవరు? గురించి ప్రసాద్ అభిప్రాయం:

    02/02/2026 4:18 pm

    ఈ కధలో, బిచ్చమెత్తుకుని, అలా సంపాదించిన డబ్బుని దాచుకునే ఒక ముసలావిడ వుంటుంది. [ఆ డబ్బు తాను వుండే ఇంట్లో కాక, ఏదో చెత్త కుప్పలో (తాత్కాలికంగా కాదు) ఎందుకు దాచుకుంటుందో నాకు అర్ధం కాలేదు. కారణం, కధ లోనే వుంటే, నా కంట మాత్రం పడలేదు. ఈ విషయం, ముఖ్యం కాదు లెండి.] ఆ ముసలావిడ డబ్బుని కాజేసే ఇంకో జేబు దొంగ కూడా వుంటాడు. చివరికి ఆ ముసలావిడ మరణిస్తే, ఆ జేబుదొంగ తల కొరివి పెడతాడు.

    ఇక్కడ నాకు అర్ధం అయినంత వరకూ, రెండు విషయాలను సమానం చేశారు.

    1. ఆ ముసలావిడ, తనకి తెలియకుండానే, తాను ముష్టెత్తిన డబ్బుతో, ఆ జేబుదొంగకి అన్నం పెట్టింది.
    2. దానికి బదులుగా, ఆ ముసలావిడకి, తనకి తెలియకుండానే, ఆ జేబుదొంగ తల కొరివి పెట్టాడు.

    నా దృష్టిలో, పై రెండూ సమానం కావు.

    ఒక శరీరానికి, ప్రాణం పోయాక, ఏం చేసినా, (అవయదానం, పరిశోధన కోసం ఆస్పత్రికి దానం చెయ్యడం లాంటి పనులు తప్ప), అది, మత నమ్మకాల మనసులకి తృప్తి కలిగించడానికి తప్ప, ఎందుకూ పనికి రాదు. ముఖ్యంగా చనిపోయిన మనిషికి ఎటువంటి మేలూ జరగదు.

    మృత దేహానికి తల కొరివి పెట్టడం అనేది ముఖ్యంగా ఆ ముసలావిడకి పనికిరాని విషయం. ఆవిడికి ఏ మేలూ కలగదు. ఇది, ఆ ముసలావిడ బిచ్చంతో అన్నం తిన్న జేబుదొంగకి జరిగిన మేలుతో ఎన్నటికీ సమానం కాదు.

    నేను, ఇలా ఆలోచించే పాఠకుణ్ణి కాబట్టి, కధ చివరిలో ప్రస్తావించిన ‘కొత్త సత్యం’ నాకేమీ తెలియలేదు.

    “అరవ పిడిగుద్దులు”, “ప్రొఫెషనల్ రైవల్రీ” అనే మాటలు ఈ సందర్భాలలో నాకు బొత్తిగా నచ్చలేదు.

    ఇవి, నా అభిప్రాయాలే సుమా!

    – ప్రసాద్