పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16438

  1. వ్యథ – 2004 గురించి అసమీక్ష్యసమీక్ష్యకారి అభిప్రాయం:

    05/02/2006 7:44 am

    మోతాదుకు మించిన అపహాస్యం, మితిమీరిన పాంటిఫికేషనూ, ఆంగ్లాంధ్ర సంస్కృతాలు కలగాపులగమైన కృత్రిమ భాష, అనవసరమైన కక్కసపాటులతో ఏ ప్రయోజనం ఉంది? ఇంతటి అసమీక్ష్యకారిత్వమున్న ఈ రచనను సమీక్షగా ప్రచురించడానికి సంపాదకులెలా ఒప్పుకున్నారో?

  2. ఈమాట కొత్త వేషం గురించి మురళి నందుల అభిప్రాయం:

    05/02/2006 5:50 am

    ఈమాట క్రొత్తవేషం అద్భుతంగా ఉంది. సురేశ్, పద్మగార్లకు ప్రత్యేక అభినందనలు.

  3. ‘వ్యయ’ ప్రయాస గురించి చంద్రశేఖర్ వల్లభనేని అభిప్రాయం:

    05/01/2006 10:53 pm

    Article చాలా బాగుంది.
    మీ Articles ఇంతకుముందు తెలుగు పేపర్లలో(బహుశా వార్తలో అనుకుంట) చదివేవాళ్ళం.
    అదేవిధంగా ‘ఈమాట’ లో కూడా మీ అనుభవాలు అందరితో పంచుకుంటారని ఆకాంక్షిస్తున్నాము.

  4. ఈమాట కొత్త వేషం గురించి చంద్రశేఖర్ వల్లభనేని అభిప్రాయం:

    05/01/2006 10:36 pm

    ఈ బ్లాగు Idea బాగుంది.
    Wordpress ను పూర్తిగా తెలుగులోకి అనువదించినట్లు అనిపిస్తోంది.
    తెలుగు Posting/Commenting కు ఏదన్నా Plugin create చేసారా?

  5. వానా పూలు ఇంద్రాణి కవిత్వం గురించి s. kanaka prasad అభిప్రాయం:

    05/01/2006 3:58 pm

    ఇంద్రజాలం
    ఇంద్రాణి గారి కవితల ఇంద్రజాలంలో ఏడాదిగా పడి కొట్టుకుంటున్నాను. జనవరిలో ఎన్నో చోట్ల వెతికినా వస్తుందన్న కవితల పుస్తకం దొరకలేదు. నెట్ లో దొరికిన కాసిన్ని కవితలనే మళ్ళీ మళ్ళీ అబ్బురంగా సంబరంగా చదువుతున్నాను. గుప్తనిధి అని ముకుందరామారావు గారన్నమాట, ప్రతిభ గల కవయిత్రి అని యదుకుల భూషణ్ గారన్నమాట ముమ్మాటికీ నిజం. ఈ కవితలకి ఇంతటి లాలిత్యం ఈ సమ్మోహక శక్తి ఎలా వచ్చి ఉంటాయా అని నాలో నేనే కులికి చస్తున్నాను. ఇది చాల జటిలమైన ప్రశ్న; దీనికి సమాధానాలు మాత్రం ఈ కవితలలానే చాల సున్నితమైనవి, మేధస్సుకు అతీతమైనవి అయి ఉండాలి. ఎంతో ఇష్టంగా అవి వెదుకుతున్నాను; కాని మొత్తం పుస్తకం నాకు దొరకలేదు. పరిచయంలో ముకుందరామా రావు గారు చూపినటువంటి సంయమనం, ఏ నిరాశకు గురి కాకుండా ఉండాలన్న ఆకాంక్ష, ఈ ఐంద్రజాలికి చేయతగిన కనీస గౌరవాలు. దొరికిన కవితలు చదినప్పుడల్లా నేను అలాగే అనుకున్నాను.

    నిద్రపోతున్న పిల్లలు, సైకిలు మీద తమ్ముడితో వెళ్ళడం, నీళ్ళు తాగే పిట్ట, వానకు తడిసిన పువ్వూ ఇవి సర్వ సాధారణమైన దృశ్యాలూ, అనుభవాలూ కదా! వీటిని చూసి, రాస్తే అవి అంత చక్కదనాలుగా ఎలా, ఎందుకుంటాయో? ఈ ఒక్క ప్రశ్నDavid Wagoner అని నాకు చాల ఇష్టమైన కవి ఒకరిని అడిగేను. ఆయన ఇది చాల చిక్కు ప్రశ్న అని అంటూనే నాకు నచ్చిన జవాబు చెప్పేరు. నిత్య జీవితంలో మంచి చెడ్డల బేరీజులు, నిర్ణయాలతోనూ సతమతమౌతుంటుండే మన అంతరంగాన్ని మంచి కవిత తన పదాలు, నడకలు, చిత్రాలు, ఉపమలతో ఊరడించి, సర్వ సాధారణమైన దృశ్యాల్ని, మనుషుల్ని, ప్రపంచాన్నే మరింత ఉదారంగా లోతుగానూ దర్శింపచేస్తుంది. (I have no good way to answer your very difficult question. But a partial answer would be that the sounds and rhythms and metaphors of poetry sometimes make us suspend our ordinary judgments and help us see the material world and its people, ordinary actions, and commonplace events more openly and deeply.) ఇందుకే ఇంద్రాణి గారి కవితలలో ఏమేం ఉన్నాయి అని కాకుండా ఏమేం లేవు అని, వేటిని ఒదులుకోవటం వలన వాటికి ఆ శక్తి అనీ ఇంకా అడుగుతున్నాను నన్ను నేనే. తప్పకుండా రాసి తీరాలి అని గిలగిల్లాడుతున్నది రాసినందుకు ముకుంద రామారావు గారికి అభినందనలు.

  6. నా మాట: చాటువు – పేరడీ గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/01/2006 3:14 pm

    వచనంలో శ్రీరమణ మంచి పేరడీలు రాశారు. ఆయన అనుమతితో వాటిలో కొన్నిటిని ఈమాటలో వేస్తే బావుంటుందేమో.

  7. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    05/01/2006 2:55 pm

    నా వ్యాసంలో ఉదహరించని పేర్లు చాలానే ఉన్నాయి. 30 ఏళ్ళుగా నిర్వహించిన అనేక సంగీత కార్యక్రమాలల్లో ఔత్సాహికులైన గాత్ర, వాయిద్య కళాకారులెందరితోనో పనిచేసే అవకాశం నాకు కలిగింది. ప్రస్తుతం హ్యూస్టన్ లో ఉంటున్న డా. ఎ.వి.మురళి కవిగా, ప్రయోక్తగా చాలా ప్రతిభ కలిగిన వ్యక్తి. ఆయన మా కార్యక్రమాల్లోనూ, రాజేశ్వరరావు, పెండ్యాల నైట్ వగైరాల్లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. స్వయంగా కవీ, గాయకుడూ అయినప్పటికీ నా “ధాటి”కి గాయకుడుగా ఆయన కాస్త వెనక్కి తగ్గారు! ఆయన భార్య శ్రీమతి విమల ఎన్నో పాటలకు వీణ వాయించారు. ఆయన సోదరి విమల, మేనకోడలు రేణుక కూడా మాతో పాడారు. అలాగే ప్రస్తుతం అట్లాంటాలో చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న దువ్వూరి రమేశ్ కుమార్, గుణుపూరు శ్రీనివాస్ (న్యూయార్క్) పాటలు పాడారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న శ్రీమతి సరిపల్లి బాలాత్రిపురసుందరి మాకు ఉత్తమ గాయని. బొంబాయిలో ఇంతమంది తెలుగువారితో కలిసి మాకిష్టమైన పాత పాటలన్నీ పాడడం, పాడించడం చాలా సరదాగా ఉండేది. సినీగీతాలు కాకుండా కవితా స్రవంతి అనే పేరుతో గురజాడనుంచి చెరబండరాజుదాకా ఆధునిక తెలుగు కవుల గీతాలను ట్యూన్లు కట్టి, పూర్తి ఆర్కెస్ట్రా, కోరస్ వగైరాలతో రక్తి కట్టించగలిగాం. వీరందరిలోకీ రిహార్సల్స్ ని కూడా సీరియస్ గా తీసుకున్న కొద్దిమందిలో లక్ష్మన్న ఒకరు.

    మేము నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వచ్చిన ప్రొఫెషనల్ కళాకారుల దగ్గరికి “మొరటు” మనుషులు రాకుండా మర్యాదస్తులైన మా మిత్రులను “కాపలా” పెట్టవలసివచ్చేది. ఎందుకంటే ఇతర సభల్లో ఒక్కొక్కప్పుడు పొరబాట్లు జరిగేవి. నూకలవారు కచేరీ చేస్తున్నప్పుడు ఎవరో మధ్యలో పక్క వాయిద్యం వాయిస్తున్న యెల్లావారిని మృదంగం సోలో వాయించమంటూ చీటీ పంపించారు. దురదృష్టవశాత్తూ అది నూకలవారి దగ్గరకు వెళ్ళింది. అది చూసి ఆయన మైకులో పెట్టిన చివాట్లను అందరం విన్నాం!

    కొన్ని సందర్భాల్లో మా సభ్యులందరూ కూర్చుని శ్రవ్య నాటికలు వేసేవారు. ఇది ఖర్చులేని ఉత్తమ ప్రక్రియ అని ఇప్పటికీ నా అభిప్రాయం. సినిమాలే కల్చర్ అనుకోకుండా, మరొకవంక అస్తమానమూ శాస్త్రీయసంగీతం లేదా కూచిపూడితో మొహం మొత్తించకుండా ఇలాంటివి తెలుగు సంఘాలు చేపడితే బావుంటుందని నాకనిపిస్తుంది.

  8. బతుకు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/01/2006 11:05 am

    అచ్చు తప్పులు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు.

  9. కొత్త కథకుల కష్టాలు గురించి Lakshmanna Vishnubhotla అభిప్రాయం:

    05/01/2006 1:16 pm

    శ్రీ అక్కిరాజు భట్టిప్రోలుకి:

    మీ వ్యాసం బాగుంది. నాలుగు కథలు రాసి “కొత్త కథకుల కష్టాలు” అని వ్యాసం రాయటం నా ఉద్దేశ్యంలో తప్పు లేని పని. మీ ఆలోచనలని మరింత పదును పెట్టండి. కథ అన్న ప్రక్రియ మీద గౌరవం ఉన్నవారు మంచి కథల గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు.

    శ్రీ శ్రీ అన్నట్టు, వంకాయ కూర బాగాలేదని చెప్పటానికి, వంకాయ కూర ఎలా చెయ్యాలో తెలియనక్కరలా! నేను ఇప్పటి వరకు ఒక్క కథ రాయలా! అయితే, మంచి కథ ఎలా ఉంటుందో నాకు తెలుసు!

    ఈమాటలో మీ కథలు ఇంతకు ముందు చదివా. మళ్ళీ మీరు చెయ్యచేసుకొని మంచి కథలు రాయండి.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. గుర్రాలు – గుగ్గిళ్ళు గురించి gokul reddi అభిప్రాయం:

    05/01/2006 12:41 pm

    నేను మీ పత్రిక చూడడం ఇదే మొదలు. పత్రిక చక్కగా ఉంది.
    మీ కథ చాలామంచి శెటైర్. Quite timely.
    ఈ కథలో చిన్న భూషయ్య ప్రెసిడెంటు బుష్. ఉలవ గుగ్గిళ్ళు పెట్రోలు.
    గుఱ్ఱాలు అమెరికాలో కార్లు. పోలికలు బాగున్నాయి.
    అన్నింటికన్నా బాగుంది, బుష్ ని హిరణ్య కసిపుడితో పోల్చిన పోతన భాగవత పద్యభాగాలు.
    మీ ఈమాట మీద ప్రభుత్వనిఘా వస్తుందేమో జాగ్రత్త!
    గోకుల్