నేనా వ్యాసాన్ని నాకు తెలిసిన ప్రాంతపు భాషలో రాశాను. ఆభాషలో ఒత్తులు, దీర్ఘాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నియమాల్ని పాటించడంలో జాగ్రత్త తీసుకోకపోవడం – అందునా ఓ సాహిత్యపత్రికకి రాసేదాంట్లో – నా అజ్ఞానాన్నీ బద్ధకాన్నీ తెలుపుతుంది గానీ, అదేదో అభ్యుదయం అని సమర్థించుకుంటే ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది.
ఆ నియమాలు అన్ని ప్రాంతాలలో ఒకే రకంగా ఉండవని నాకు తెలుసు. ఆ తేడాలని గౌరవించేపాటి సంస్కారం ఉంది. “మెజారిటీ” సంగతేమోగాని, మన ఆధునిక సాహిత్యంలో వేరు వేరు ప్రాంతాల రచయితలు వారి వారి భాషలో రాశారు; వాటిని ఇతర ప్రాంతాల ప్రజలు గూడా బాగానే ఆదరించారు. ఒకే రచనలో అనేక పాత్రలతో ఆయా ప్రాంతాల, వర్గాల భాషలో సంభాషణలు నడిపించిన నవలొకటి గత శతాబ్దానికే తలమానికంగా నిలిచింది:
“Overwhelmed by sorrow – అంటే యేమిటి?” అని అడిగింది గంగి, పుస్తకంలో వొక పేజీలో గుర్తుపెట్టుకున్న చోట తీసి చూస్తూ.
“సారో అంటే తెలుసుగా విచారం, దుఃఖం. వోవర్ వ్వెల్మింగ్ అంటే – ” అని రెప్పలు మూతపడని కళ్ళతో, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – గంగి” అన్నాడు అనాలోచితంగా.
పగలబడి నవ్వింది, గంగి.
రవి అలాగే చూస్తున్నాడు.
నవ్వు ఆపుకుని, “యాడున్నవ్ సారూ? పాఠం చెప్తున్నవా, కార్కాన్ల వున్నవా?” అంది.
…
తేరుకుని, “వోవర్ వ్వెల్మింగ్ అంటే – యేదైనా వొక భావంగానీ అనుభూతిగానీ ఫీలింగ్ గానీ – సంతోషమో విచారమో అసూయో ద్వేషమో ప్రేమో యివి యేవీ కాని మరేదో అనిర్వచనీయ భావమో – అట్లాంటిది యేదో వుక్కిరిబిక్కిరిగా పుక్కిలింతలుగా నిర్వీర్యంకాని అశక్తతగా చేసినట్లుగా – ” అని ఆ తరవాత యేం చెప్పాలో రాక ఆగిపోయాడు.
“నువ్వు చెప్పేది అర్థంకాకపోయినా నువు చెప్తుంటే వింటం బావుంటుంది” అంది.
రవి ఫక్కున నవ్వాడు.
“దేన్కి?” అంది కోపంగా.
“నీ మాటకి. నీ అనుకరణకి నవ్వొచ్చింది” అన్నాడు.
“నీలాగా మాట్లాడదాఁవని.” అంది.
నవ్వు ఆపుకుంటూ “దేనికి?” అన్నాడు.
“మా మాట బగ్గడ్ గుంటదిలే! మీ ఆంద్రోళ్ళు మంచిగ మాట్లాడతరు” అంది.
“నేను ఆంధ్రావాణ్ని కాదు. తెలంగాణావాణ్నే” అన్నాడు.
“యేదొకటి. నీ మాట అట్లానే వుంటది. నాకు మంచిగ అనిపిస్తది – ఆతీరు మాట్లాడేది. నా మాట మంచిగుండదులే” అంది.
“బావుంటం అనేది మాటలోకంటే, ఆ మాట్లాడే మనసులో మనిషిలో భావంలో వుంటుంది! పుట్టిపెరిగిన ప్రాంతపు వాతావరణాన్ని బట్టి మాట తీరు వుంటుంది. వొక్కొక ప్రాంతంలో వొక్కొక రకంగా మాట్లాడతారు. మనసులు మంచివైతే ఆ మాట్లాడే తేడాలు అంత ముఖ్యంకాదు.” అన్నాడు.
“కాని నా కెందుకో అట్ల మాట్లాడితె మంచిగా అనపిస్తుంది. అటు ఆంధ్రుల అట్లనె మాట్లాడతరు గద?” అంది.
“లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపూరు చిత్తూరుల వరకు తీసుకుంటే చాలా తేడాలుంటయ్. ఐతే చదువుకుని నాలుగు ప్రదేశాలు చూసిన వాళ్ళు అంతా షుమారుగా అందరూ వొక మాదిరిగానే మాట్లాడతారు. రాస్తారు. దానిని మధ్య సర్కారాంధ్ర భాష అనవొచ్చు. పుస్తకాలలో, సినిమాల్లో, రేడియోలో, పత్రికలల్లో మనం సర్వసాధారణంగా చదివే వినేభాష అది. – ”
…
— “అనుక్షణికం,” పేజీలు 267-268.
ఒత్తులు లేకుండా గాని తప్పుడు ఒత్తులతో గాని రాయడం, మాట్లాడటం వాడుకభాషా? “భాద,” బాథ,” “బాద,” ఇలాంటివి చూస్తే నాకు బాధేస్తుంది. అలారాసేవాళ్ళు తెలియకనే రాస్తున్నారనుకుంటాను – నేను చేసిన పొరబాట్ల లాగా. కాదు, ఆప్రాంతంలో అలాగే మాట్లాడతారు అంటే, అది సబబే.
ప్రాచీన తెలుగులో కాలాన్ని కొలవడం గురించి కూడా ఉండే ఉంటుంది, రెప్పపాటు, ఘడియలు, ఝాములు, పొద్దులు, మాపులు అని మరికొన్ని పదాలు ఉండి ఉంటయి సమయాన్ని సూచించటానికి. వాటిని కూడా కలిపితే బాగుంటుందేమో?
{ప్రాచీన తెలుగులో “కాలాన్ని బట్టి దూరం మారుతుంది” అని ఎవరూ రాయలేదంటే ఆశ్చర్యమే.}
స్వర్ణకారులు వాడే కొలతలు కనిపించలేదు ఈ వ్యాసంలో, తులం వంటివి (ఎన్ని వీసాలైతే ఒక తులం (పాత తులం)? జవాబు వ్యాసంలో ఉంది, కానీ క్యాలిక్యులేటర్లకు అలవాటు పడ్డ మన బుర్రలు కొద్దిగా వెతకాల్సొస్తుంది.) (గురివింద గింజలతో బంగారం కొలవగా చూసాన్నేను చిన్నప్పుడు, వాటి బరువెంత?).
వైశాల్యం, బొంబాయిలో నే కాదు హైదరాబాదు రాష్ట్రంలో కూడా కుంట లేక గుంట అంటే 120 గజాలే. ఇప్పటికీ 40 గుంటలు ఒక ఎకరమే. “సెంటు” భూమి అంటే ఎంతో కూడా వ్యాసంలో చెప్పవలసింది (సెంటు ప్రాచీనమైనా కాకపోయినా సరే, ఇప్పటి వాడుక కూడా తెలిస్తే అన్వయించుకుని గుర్తుంచుకోవటానికి వీలుంటుంది).
“ఈ నాటి రేడియోల్లో, పత్రికల్లో, సాహితీ రచనల్లో, సినిమాల్లో అనుక్షణం వాడుకలో ఉండి ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉన్న వ్యావహారాన్ని ఏ శక్తీ ఎక్కువ కాలం బహిష్కరించలేదు” అన్నది బూదరాజు గారే. {పై వాటికి టీవీ యాంకర్లను జత చేయాలిప్పుడైతే. వత్తులు పలికినట్టు హైదరాబాదు పాత బస్తీల కూడ ఎవ్వలు పలుకరట, నిన్న మొన్న బళ్ళెకు పోతున్న పిల్లలతోటి ఒక సారి మాట్లాడి చూస్తె యాంకర్లను తయారు చేస్తున్నది మనమే అని తెలుస్తుంది.}
“ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు పాఠ్య గ్రంథాలు ఇప్పటికీ గ్రాథికంలోనే ఉన్నాయి. మరో మహోద్యమం ప్రళయం లాగా వచ్చి ముంచెత్తితే తప్ప ఈ స్వార్థ సంకుచిత ప్రతీప శక్తులను మొదలంటా పెకలించటం సాధ్యపడకపోవచ్చు.” అని ఈసడించింది బూదరాజుగారే. “ఆ సమయం ఎంతో దూరాన లేదు” అన్నదీ ఆయనే.
ఈ బాట ఇట్లనే పట్కోని పోతె మాటల్లోంచి జారిపోయేటివి ఒత్తులు దీర్ఘాలే, సంధులు సమాసాల తర్వాత. వెయ్యేండ్ల గ్రాంథికం ఒకటి కానప్పుడు వందేండ్ల వ్యవహారికం ఒకలాగనే ఉండాలంటె కష్టం. జాగ్రత్త పడేటోళ్ళు పడొచ్చు. లేకపోయినా భాష ఆగదు.
పొరబాటు సరిచేసినందుకు సాహితిగారికి కృతజ్ఞతలు. భాషావేత్త గురించిన వ్యాసం కాబట్టి మరికాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకొని రాయాలి అని గుర్తున్నా, తప్పులు దొర్లాయి. ప్రత్యేకంగా ఆయన “ఒత్తక్షరాలను (మహాప్రాణాలను) రాయటంలో ఎంతో జాగ్రత్త అవసరం,” చదువుకోని వారి వాడుకలో ఈ భేదం లేదుగాని, చదువుకున్నవారు ఈ భేదం గుర్తించాలని, కాస్త వాత గూడా పెట్టారు. ఉదాహరణలు ఇచ్చారు: అర్థం, అర్ధం; శోధ, శోథ; పలం, ఫలం; గాతం, ఘాతం; కరం, ఖరం.
చదివి highlight చేసుకున్నాను గాని రాసేటప్పుడు జాగ్రత్త పడలేదు!
చాలా బాగుంది.బూదరాజు గారి మీద ఉన్న అభిమానానికి మరిన్ని అలంకారాలు వచ్చి చేరాయి. “విలేఖరులు” (నాకు తెలిసి “విలేకరులు” అని బూదరాజు గారే అన్నారు) .. చిన్న ఇబ్బంది.
వ్యాస కర్త కి కృతజ్ణతలు (ఇది ఇంకెలా రాయాలో తెలీలేదు మన్నించాలి)
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/09/2006 10:27 am

కొడవళ్ళ హనుమంతరావు
రాచపుండు గురించి krao అభిప్రాయం:
07/09/2006 7:02 am
చాలా బాగుంది. కధ అంతా చదవడానికి హాయిగా వుంది. కాని రెండవ పేరాకి మిగతా కధకి ఎమీ సంభందం లేదు.
సందుక గురించి Geeta.K అభిప్రాయం:
07/09/2006 6:44 am
నారాయణ స్వామి గారూ,
మీ కవితలు సందూక, అర్ర మరిచిపోయిన బాల్యాన్ని, యౌవనాన్ని గుర్తుకు తెస్తాయి ఎవరికేనా. గడిచిన చూరు కింద రాలిపడిన సమయాల వాన చుక్కల జాడలు. రియల్లీ చాలా మంచి కవితలు. కీపిటప్.
…కె.గీత
పిచ్చి నాన్న గురించి siva kumar అభిప్రాయం:
07/09/2006 12:01 am
బాగా వుంది. ఇలాంటివి ఇంకా రాసి పిల్లల దృష్టికి తీసుకు వెళ్ళాలి.
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి విప్లవ్ అభిప్రాయం:
07/08/2006 8:34 am
“కాదు, ఆప్రాంతంలో అలాగే మాట్లాడతారు అంటే, అది సబబే.”
కొంతవరకూ ఇదే నేనన్నది. “సబబే” అని ఒప్పుకునే ముందు మరొక్క ప్రశ్న:
ఒక వేళ “ఆ ప్రాంతంలో అలాగే మాట్లాడతారు” అని చెప్పినా సరే, తెలిసినా సరే మీరు “బాద” ను రాతల్లో (మాటల్లో కాక) అంగీకరిస్తారా?
ఇప్పటి మెజారిటీ అంగీకరించరు అని నేనకుంటాను.
విప్లవ్
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/07/2006 7:42 pm
విప్లవ గారన్న ఈక్రింది మాటలు నాకు సరిగా అర్ధం కాలేదు:
“ఈ బాట ఇట్లనే పట్కోని పోతె మాటల్లోంచి జారిపోయేటివి ఒత్తులు దీర్ఘాలే, సంధులు సమాసాల తర్వాత. వెయ్యేండ్ల గ్రాంథికం ఒకటి కానప్పుడు వందేండ్ల వ్యవహారికం ఒకలాగనే ఉండాలంటె కష్టం. జాగ్రత్త పడేటోళ్ళు పడొచ్చు. లేకపోయినా భాష ఆగదు.”
ఒత్తులు లేకుండా గాని తప్పుడు ఒత్తులతో గాని రాయడం, మాట్లాడటం వాడుకభాషా? “భాద,” బాథ,” “బాద,” ఇలాంటివి చూస్తే నాకు బాధేస్తుంది. అలారాసేవాళ్ళు తెలియకనే రాస్తున్నారనుకుంటాను – నేను చేసిన పొరబాట్ల లాగా. కాదు, ఆప్రాంతంలో అలాగే మాట్లాడతారు అంటే, అది సబబే.
కొడవళ్ళ హనుమంతరావు
ప్రాచీన తెలుగు కొలమానం గురించి విప్లవ్ అభిప్రాయం:
07/07/2006 10:03 am
ప్రాచీన తెలుగులో కాలాన్ని కొలవడం గురించి కూడా ఉండే ఉంటుంది, రెప్పపాటు, ఘడియలు, ఝాములు, పొద్దులు, మాపులు అని మరికొన్ని పదాలు ఉండి ఉంటయి సమయాన్ని సూచించటానికి. వాటిని కూడా కలిపితే బాగుంటుందేమో?
{ప్రాచీన తెలుగులో “కాలాన్ని బట్టి దూరం మారుతుంది” అని ఎవరూ రాయలేదంటే ఆశ్చర్యమే.}
స్వర్ణకారులు వాడే కొలతలు కనిపించలేదు ఈ వ్యాసంలో, తులం వంటివి (ఎన్ని వీసాలైతే ఒక తులం (పాత తులం)? జవాబు వ్యాసంలో ఉంది, కానీ క్యాలిక్యులేటర్లకు అలవాటు పడ్డ మన బుర్రలు కొద్దిగా వెతకాల్సొస్తుంది.) (గురివింద గింజలతో బంగారం కొలవగా చూసాన్నేను చిన్నప్పుడు, వాటి బరువెంత?).
వైశాల్యం, బొంబాయిలో నే కాదు హైదరాబాదు రాష్ట్రంలో కూడా కుంట లేక గుంట అంటే 120 గజాలే. ఇప్పటికీ 40 గుంటలు ఒక ఎకరమే. “సెంటు” భూమి అంటే ఎంతో కూడా వ్యాసంలో చెప్పవలసింది (సెంటు ప్రాచీనమైనా కాకపోయినా సరే, ఇప్పటి వాడుక కూడా తెలిస్తే అన్వయించుకుని గుర్తుంచుకోవటానికి వీలుంటుంది).
విప్లవ్
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి విప్లవ్ అభిప్రాయం:
07/07/2006 7:44 am
“ఏతా వాతా” ప్రయోగం వాడకాన్ని గమనిస్తే, కాస్త ఎక్కువైతే ఏ ప్రయోగమైనా పరమ బోర్ గా మిగులుతుంది అని తేలుతుంది.
“మారిపోతున్న విలువలు ఆదర్శపాత్రమయినవా? ” అన్నది ప్రశ్న.
ఏది ఆదర్శమో తెలియదు కానీ, భాషకు సంబంధించి, “మార్పు చెడిపోవడం కాదని” కాల్డ్వెల్ ప్రతిపాదించాడని రాసింది బూదరాజు గారే.
అర్ధానుస్వార శకటరేఫలను వర్జించాలన్న ప్రతిపాదనను చూపెట్టి, అది అభ్యుదయగామి పండితుల దృక్పథం క్రిందికి వస్తుందని చెప్పిందీ బూదరాజు గారే. అభ్యుదయం ఆదర్శపాత్రమేనేమో.
“ఈ నాటి రేడియోల్లో, పత్రికల్లో, సాహితీ రచనల్లో, సినిమాల్లో అనుక్షణం వాడుకలో ఉండి ప్రజాసామాన్యానికి అందుబాటులో ఉన్న వ్యావహారాన్ని ఏ శక్తీ ఎక్కువ కాలం బహిష్కరించలేదు” అన్నది బూదరాజు గారే. {పై వాటికి టీవీ యాంకర్లను జత చేయాలిప్పుడైతే. వత్తులు పలికినట్టు హైదరాబాదు పాత బస్తీల కూడ ఎవ్వలు పలుకరట, నిన్న మొన్న బళ్ళెకు పోతున్న పిల్లలతోటి ఒక సారి మాట్లాడి చూస్తె యాంకర్లను తయారు చేస్తున్నది మనమే అని తెలుస్తుంది.}
“ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న తెలుగు పాఠ్య గ్రంథాలు ఇప్పటికీ గ్రాథికంలోనే ఉన్నాయి. మరో మహోద్యమం ప్రళయం లాగా వచ్చి ముంచెత్తితే తప్ప ఈ స్వార్థ సంకుచిత ప్రతీప శక్తులను మొదలంటా పెకలించటం సాధ్యపడకపోవచ్చు.” అని ఈసడించింది బూదరాజుగారే. “ఆ సమయం ఎంతో దూరాన లేదు” అన్నదీ ఆయనే.
ఈ బాట ఇట్లనే పట్కోని పోతె మాటల్లోంచి జారిపోయేటివి ఒత్తులు దీర్ఘాలే, సంధులు సమాసాల తర్వాత. వెయ్యేండ్ల గ్రాంథికం ఒకటి కానప్పుడు వందేండ్ల వ్యవహారికం ఒకలాగనే ఉండాలంటె కష్టం. జాగ్రత్త పడేటోళ్ళు పడొచ్చు. లేకపోయినా భాష ఆగదు.
http://www.eemaata.com/books/budaraju.pdf
బూదరాజు గారి మీద సమయోచితమైన ముచ్చట్లు చెప్పినందుకు రచయితకు, “ఈ మాట” కు అభినందనలు.
విప్లవ్
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
07/06/2006 6:12 pm
పొరబాటు సరిచేసినందుకు సాహితిగారికి కృతజ్ఞతలు. భాషావేత్త గురించిన వ్యాసం కాబట్టి మరికాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకొని రాయాలి అని గుర్తున్నా, తప్పులు దొర్లాయి. ప్రత్యేకంగా ఆయన “ఒత్తక్షరాలను (మహాప్రాణాలను) రాయటంలో ఎంతో జాగ్రత్త అవసరం,” చదువుకోని వారి వాడుకలో ఈ భేదం లేదుగాని, చదువుకున్నవారు ఈ భేదం గుర్తించాలని, కాస్త వాత గూడా పెట్టారు. ఉదాహరణలు ఇచ్చారు: అర్థం, అర్ధం; శోధ, శోథ; పలం, ఫలం; గాతం, ఘాతం; కరం, ఖరం.
చదివి highlight చేసుకున్నాను గాని రాసేటప్పుడు జాగ్రత్త పడలేదు!
కొడవళ్ళ హనుమంతరావు
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి sahiti అభిప్రాయం:
07/06/2006 12:02 pm