పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16438

  1. నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి గుళ్లపూడి శ్రీనివాసకుమార్ అభిప్రాయం:

    08/10/2006 5:42 am

    స్వయంకృతాపరాధాలతో దుర్భిక్షంలో కూరుకుపోయిన నేటి సినిమా తీరు తెన్నులను అన్ని కోణాల్లో సవివరంగా ఆవిష్కరించిన వ్యాసరాజం ఇది.

  2. ఈమాట కొత్త వేషం గురించి గుళ్లపూడి శ్రీనివాసకుమార్ అభిప్రాయం:

    08/10/2006 5:22 am

    కొత్త వేషం ముచ్చటగా ఉంది. మీ బృందం అభినందనీయమైన సేవలు చేస్తోంది. ఈ సందర్భంగా నేనొక విషయాన్ని మీతో పంచుకుందామనుకుంటున్నాను.

    తెలుగు యునికోడ్ ఫాంట్ ఉపయోగించి క్ చ్ ట్ త్ ప్ గ్ జ్ డ్ ద్ బ్ వంటి హలంతాక్షరాలను టైప్ చేసేప్పుడు ఇక్కడ తెలిపిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు… కంప్యూటర్‌కు… హార్డ్‌వేర్‌లో… మానిటర్‌తో… మెషీన్‌పై… అని మీరు టైప్ చెయ్యాలనుకుంటే… హలంతాక్షరాలు, వాటితోపాటు టైప్ చేసిన అక్షరాలు కలిసిపోయి కంప్యూటర్కు… హార్డ్వేర్లో… మానిటర్తో… మెషీన్పై ఇలా వస్తాయి. దీంతో ఏం చెయ్యాలో అర్థంకాక చాలా మంది కంప్యూటర్ కు… హార్డ్ వేర్ లో… మానిటర్ తో… మెషీన్ పై… ఇలా హలంతాక్షరానికి, దాని వెంటనే టైప్ చెయ్యాల్సిన అక్షరానికి మధ్య ఒక ఖాళీ ఉంచి టైప్ చేస్తున్నారు. దీనికి ఓ పరిష్కారం ఉంది. వర్డ్ లేదా నోట్‌ప్యాడ్‌లో మీరు ఇలా చేసుకోవచ్చు.

    హలంతాక్షరం టైప్ చెయ్యగానే దాని పక్కనే కర్సర్ ఉంచి Ctrl+Shift+2 కీలు కలిపి నొక్కండి. ఆ తర్వాత మీకు కావలసిన అక్షరాలను పక్కనే టైప్ చేసుకున్నప్పటికీ అవి హలంతాక్షరాలతో పైన చూపిన విధంగా కలిసిపోవు. Ctrl+Shift+2 కీల ద్వారా హలంతాక్షరం పక్కనే నాన్-జాయినర్ (ఇది కనిపించదు) చేర్చబడి, ఈ సమస్యను నివారిస్తుంది.

    ఇదే సమస్యకు మౌస్ ఉపయోగించి, నోట్‌ప్యాడ్‌లో కూడా పరిష్కారం పొందవచ్చు. హలంతాక్షరం పక్కనే మీ కర్సర్ ఉంచి, మౌస్ రైట్ క్లిక్ చెయ్యండి. అక్కడ కనిపించే మెనూలోంచి “INSERT UNICODE CONTROL CHARACTER” పైన మౌస్‌ను పాయింట్ చేస్తే… ఉప మెనూ తెరుచుకుంటుంది. ఇందులో “ZWNJ – Zero Width non-joiner” పైన క్లిక్ చెయ్యండి. దీంతో హలంతాక్షరం పక్కన నాన్-జాయినర్ (కనిపించదు) చేర్చబడి, ఈ సమస్యను నివారిస్తుంది. తర్వాత ఈ టెక్ట్స్‌ను వర్డ్, ఎక్సెల్ లేదా మీకు కావలసిన దానిలోకి కాపీ చేసుకోవచ్చు.

    ఈమాట ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నది నా అభిమతం.
    ఇదే పరిష్కారం కన్నడ భాషకూ వర్తిస్తుంది.

  3. అనుబంధం గురించి sreenivas అభిప్రాయం:

    08/09/2006 12:49 am

    చాలా అందంగా వ్రాశారండి. శ్రీనివాస్.

  4. సంకట్ కాల్ మే బాహర్ జానే కా మార్గ్ గురించి Geetha అభిప్రాయం:

    08/07/2006 11:02 pm

    ఈ కధ చదువుకొనని, హాయిగా నవ్వుకున్నాము..

  5. యథార్థ చక్రం – 1 గురించి Rama S Yeleswarapu అభిప్రాయం:

    08/07/2006 2:00 pm

    గౌరవనీయులైన ఈమాట సంపాదకులకు,
    అయ్యా,

    మీ ఈమాట పత్రిక అద్భుతముగా ఉన్నది. అయితే, ఇది వరకు మీరు, మంచి మంచి గ్రంధములు ప్రచురించారు. దురదృష్టవశాత్తు అవి మీ నూతన వెబ్ సైట్ లొ అందుబాటులో లేవు. ఉదాహరణకు, శ్రీ కృష్ణ దేవరాయ విరచితమైన “ఆముక్తమాల్యద”. దయచేసి, మరల ఆ అధ్భుత గ్రంధాన్ని తెలుగు వ్యాఖ్యానంతో అందించ కోరుతున్నాను.

    ఇట్లు భవదీయుడు,
    రామ సుబ్రహ్మణ్యం యేలేశ్వరపు

  6. సఖియ గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    08/06/2006 10:21 pm

    సఖియ కి మద్యం అంటే ఇష్టం. 🙂

  7. “చందమామ” జ్ఞాపకాలు గురించి Naga Raja Sharma అభిప్రాయం:

    08/06/2006 7:44 pm

    This is abolutely great. Chandamama is the greatest patrika ever produced. There is no comparision.

    How can we get the old Chandamama “sanchikalu” . Is there any way we can get them, Could you pls give us some contacts?

    Thanks for sharing your memories. This is excellent and nostalgic as our childhood is closely associated with Chandamama

    Thanks
    Nagaraja Sharma

  8. ఆకాశంలో ఎడారి గురించి Bandla Madhava Rao అభిప్రాయం:

    08/04/2006 8:18 pm

    రాములు గారూ
    కవిత కన్నుల్ని చెమ్మగిల్ల జేసింది. రయితుల యెతల్ని కళ్ల ముందుంచింది. మంచి కవిత రాశారు. అభినందనలు.
    బంద్ల మాధవరావు

  9. సందుక గురించి Bandla Madhava Rao అభిప్రాయం:

    08/02/2006 10:56 pm

    నారాయణ స్వామి గారూ

    సందుక లోని తీపి జ్ఞాపకాల్ని మాముందుంచినందుకు మీకు అభినందనలు. 7 వ తేదీన మీ కవితల సందుక ను చదువరులకు అందించబోతున్న మీకు నా శుభాకాంక్షలు.

    బండ్ల మాధవరావు
    త్రివేణి టాలెంట్ స్కూల్
    అల్వాల్
    సికింద్రాబాద్
    98661 82378

  10. మా ఈజిప్ట్ యాత్ర గురించి Ramanadha Reddy అభిప్రాయం:

    07/31/2006 8:15 pm

    అద్భుతమైన రచన. ఆ అద్భుతానికి ఉక్కిరిబిక్కిరై తమాయించుకొని ఇంత వివరంగా రాసారు, మీరు ఈజిప్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకొని మరీ వెళ్ళినట్లున్నారు. ఒక మహామహోపాధ్యాయుని పరిచయం చేసారు. ఒక మంచి శ్లోకంతో ముగించారు. ధన్యవాదాలు.