పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16438

  1. “చందమామ” జ్ఞాపకాలు గురించి Ch.Venu అభిప్రాయం:

    08/31/2006 6:53 am

    The article is excellent.
    Chitra and Sankar were my childhood heroes. I saw Sankar’s illustrations for Mahabharatam serial in Chandamama. But for the first time I came to know about MTV ACHARYA. I would like to know more about him and his illustrations. Can anybody suggests the way?
    I request Mr Rohiniprasad to write one more article about Chandamama.

    —— Venu., Hyderabad

  2. సందుక గురించి nArAyaNaswAmi అభిప్రాయం:

    08/29/2006 6:43 pm

    అక్కిరాజు గారూ

    మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. నిజమే గతంలోని పేదరికాన్ని గ్లోరిఫై చెయ్యడం సరైంది కాదు. కాని నేను గతంలో వుజ్వలంగా వున్న “కొత్త సమాజాన్ని నిర్మించాలనే ” ఆకాంక్షని గ్లోరిఫై చేస్తున్నాను. మా తొలి యవ్వన వుద్రేకాలవే కదా! ఆ ఆకాంక్ష ఇంకా సజీవంగా వుండాలనే, వుంచాలనే నా కోర్కె.
    గది పాడుబడలేదు – మళ్ళీ పిట్టలన్నీ దాని లోకి రావాలని కోరుకోవడం అత్యాశ కాదేమో!
    మీరు సభకి వస్తే గొప్పగా వుండేది. మీరు వున్నారని నాకు తెలియదు – తెలిస్తే తప్పకుండా నేను కలిసే ప్రయత్నమైనా చేసేవాణ్ణి.
    ధన్యవాదాలు,
    మీ
    నారాయణస్వామి

  3. హంస ధ్వని గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    08/23/2006 4:05 am

    మీ కధ అద్భుతం కనక ప్రసాదు గారు.

  4. రాచపుండు గురించి Hari Prasad అభిప్రాయం:

    08/22/2006 7:12 am

    కథ బావుంది కానీ, ఆ రెండో పేరా ఎక్కడి నుండో తెచ్చిపెట్టింనట్లుంది. నిసి బాధలేంటో అర్ధం కాలేదు.

  5. గేటెడ్ కమ్యూనిటీ గురించి Hari Prasad అభిప్రాయం:

    08/22/2006 1:25 am

    కథ చాలా బావుంది. పెరిగిన జీవనప్రమాణాల వలన మనం ఏమి కోల్పోతున్నామో చెప్పే ప్రయత్నం చేసారు.

  6. Zenగల్వలు – 1 గురించి srinivasu అభిప్రాయం:

    08/19/2006 8:43 am

    చాలా బాగుంది. కృతజ్ఞతలు.

  7. నౌషాద్‌ గురించి గుళ్లపూడి శ్రీనివాసకుమార్ అభిప్రాయం:

    08/18/2006 3:43 am

    నౌషాద్ అంటే హిందీ సినీ సంగీతానికి పర్యాయపదం అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన జీవితంపై చక్కటి విశ్లేషణతో కూడిన అద్భుత వ్యాసరాజమిది. రచయిత నుంచి ఇలాంటి మరెన్నో వ్యాసాల కోసం ఎదురు చూస్తున్నాను.

  8. సందుక గురించి Akkiraju Bhattiprolu అభిప్రాయం:

    08/18/2006 12:52 am

    స్వామి గారూ,

    చాలా బాగున్నాయి కవితలు.
    రెండు మూడు సార్లు చదివా…. ఓ ఉచిత సలహా…

    జ్ఞాపకాల్ని పదిలపరుచే క్రమంలో దరిద్రాన్ని ఎక్కడన్నా గ్లోరిఫై చేస్తున్నారేమో కొంచెం జాగ్రత్త పడండి. ఇప్పుడు మనం కారులో వెళుతూ “సిటీ బస్సులో వేళ్ళాడుతూ వెళ్ళటం గొప్ప అనుభవం” అని రాస్తే, ప్రస్తుతం వెళ్ళాడుతున్న వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. మీరిలా చేశారని కాదు, ఇలాటి వస్తువుల గురించిన సాహిత్యంలో సాధారణంగా జరుగుతున్న తప్పుని మీకు ఎత్తిచూపించాలనే ప్రయత్నం.

    హైదరాబాదు లో ఉండి మీ పుస్తకావిష్కరణకి రాలేక పోవటం దురదృష్టకరం.

    అక్కిరాజు

  9. సందుక గురించి narayanaswamy అభిప్రాయం:

    08/17/2006 10:25 am

    ప్రసాద్ గారూ
    సందుక అంటే తెలంగాణ లో పాతకాలపు ట్రన్కు పెట్టె అని. కొన్ని చోట్ల సందుగ అని కూడా అంటారు.
    నా కొత్త కవితల పుస్తకమ్ సందుక మొన్న ఆగష్టు 7 న హైదరాబాదులో ఆవిష్కరించారు.
    మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
    మీ
    నారాయణస్వామి

  10. నాతి నోట నువ్వు గింజ గురించి umarani అభిప్రాయం:

    08/12/2006 3:16 am

    ఈమాటలో మాటలు ఇంత తీపి అని ఇప్పుడే తెలుసుకున్నాను.

    ఉమ