పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16438

  1. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:

    02/08/2026 1:25 am

    శరాఘాతం వంటి వార్త.

    సాహితీకృషీవలులు వారు తెలుగుసాహిత్యాభిమానుల హృదయాలలో చిరంజీవులుగానే ఉంటారు.

    ఈమాట వారు వేలూరి వారి విషయంలో రెండు పనులు చేయటం బాగుంటుందని నాసూచన. మొదటిది వారి జీవితచరిత్రను చిరు పుస్తకంగా వెలువరించి భాండారంలో కూడా చేర్చటం. రెండవది వేలూరి వారిపై ఒక చక్కని స్మారకసంచికను వెలువరించటం.

  2. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి అన్వర్ అభిప్రాయం:

    02/07/2026 9:49 pm

    నేను అమెరికా వెళ్ళినపుడు అక్కడ అతి ముఖ్యంగా మిస్ అయిన విషయాలు మూడే మూడు. ఒకటి వేలూరి వేంకటేశ్వర రావుగారు. రెండు వేమూరి వేంకటేశ్వర రావుగారు. మూడు మాచవరం మాధవ్ గారు.

    ముగ్గురూ ముగ్గురే.

    ఈరోజు శ్రీ వేలూరిగారు శాశ్వతంగా మిస్ అయ్యారని వార్త వచ్చింది. మరణించిన వానికి జన్మము తప్పదో లేదో తెలియదు కానీ పుట్టిన వానికి మరణము తప్పదు. “జాతస్య హి ధ్రువో మృత్యుః”. అయితే వేలూరిగారు మరణం లేనంత గొప్ప సాహిత్యం రాశారు. ఆయన మనమధ్య ఇక లేరు అనే భావన కన్నా, ఆయన మనకోసం ఏమి మిగిల్చి పోయారు అనేదాన్ని పొగొట్టుకోకుండా చూస్తే చాలు.

    నేను–శ్రీ వేలూరిగారు చాలా ఎక్కువగా వాట్సప్ చాట్‍లో కలుసుకునేవాళ్ళము. ఆయన నన్ను అమితంగా ప్రేమించాడు. నన్ను నేను రచయితగా ఒప్పుకోను కానీ, ఆయన నన్ను గొప్ప రచయితగా సంబోధించేవాడు, హత్తుకునేవాడు. ఒక్క అమెరికా పర్యటనలోనే కాదు వ్యక్తిగతంగా, హృదయానుగతంగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను సర్. మీరన్నా, మీ రచన అన్నా, మీ వ్యక్తిత్వం అన్నా నాకు ఎంతో ప్రేమ. ఇష్టం. గౌరవం. మిస్ యూ సర్.

  3. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి దార్ల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    02/07/2026 6:56 pm

    అయ్యో… వారి మరణం తెలుగు సాహిత్వలోకానికి తీరని లోటు. వారు డయాస్పోరా సాహిత్యాన్ని ఎంతో సాధికారికంగా చెప్పిన వ్యాసాలు ఎన్నో ఉన్నాయి. వారికి నా శ్రద్ధాంజలి…

    ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
    సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్

  4. వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    02/07/2026 6:30 pm

    పాతికేళ్లుగా అమెరికాలో నేను ఎరిగిన పెద్దమనిషి వేలూరి గారికి కన్నీటి వీడ్కోలు: గతంలో ఒకసారి ‘అమెరికాలో అర శతాబ్దం’ అన్న పేరుతో — తమ ఆత్మకథను రాయవలసిందిగా విజ్ఞప్తి చేశాను. ఇక అది నెరవేరని ఆశయే. వారి మాటల్లో, రాతల్లో గొప్ప ఉత్సాహం ఒకటి కనిపించేది. ఇకపై వారు, బంధుమిత్రుల జ్ఞాపకాల్లో కలకాలం జీవిస్తారు.

    తమ్మినేని యదుకుల భూషణ్

  5. మనసులు దోచే మనస్లు– 1 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/07/2026 5:12 pm

    సునీత గారూ
    సుధ గారూ
    మీ స్పందనలకు ధన్యవాదాలు

  6. కళాసాగరం కర్ణాటకం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    02/07/2026 12:49 pm

    ధన్యవాదాలు చిట్టత్తూరు మునిగోపాల్ గారూ.

  7. కళాసాగరం కర్ణాటకం గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    02/07/2026 12:34 am

    ఎప్పుడో చిన్నప్పుడు 9 వ తరగతిలో 80 లలో అనుకుంటాను, స్కూల్ ద్వారా టూర్ వెళ్ళాను హళిబేడు, హంపి, శ్రావణ బెళగొళ. ఏదో కలలో చూసినట్టు లీలగా మాత్రమే గోమఠేశ్వరుడి విగ్రహం, హోయసళేశ్వరుడి ఆలయ శిల్పసంపద గుర్తుకొస్తాయి. నేను ఉండేది బెంగళూరుకు కేవలం నూరు కిలోమీటర్ల దూరంలోని కుప్పంలో. అయినా మళ్ళీ వెళ్లలేకపోతున్నాను. శ్రీనివాస్ బందా గారూ… మీ పర్యాటక వ్యాసం ఎక్కడో ఎప్పుడో అణగిపోయిన నా లోలోపలి కళాకాంక్షను రగలకొల్పింది. మీ అక్షరాలలో ప్రతిఫలించిన కన్నడిగుల అద్భుత శిల్ప విన్యాసం పదపదమని తొందరపెడుతోంది. చూడాలి… ఏమవుతుందో.

  8. పదమల్లుని పథగమనం: గజ్జెల మల్లారెడ్డికి ఘన నివాళి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    02/07/2026 12:25 am

    కమ్యూనిష్టులు మనుధర్మాన్ని గౌరవించటమూ పాటించటమూ ఏమిటండీ బాబూ.

    ఐనా మీనుండి దానాన్ని స్వీకరించిన వారు ఎవరైనా సరే తీరా మీరే కష్టంలో ఉన్న పక్షంలో మీపైన సానుభూతితో లోగడ మీనుండి స్వీకరించిన దానాన్ని మీకు తిరిగి ఇస్తారా ఏమిటి? అలా ఇచ్చేవారు కోటికి ఒకరూ ఉండరేమో.

  9. మనసులు దోచే మనస్లు– 1 గురించి Subha అభిప్రాయం:

    02/06/2026 5:15 pm

    ఫొటోలు చూస్తూఉంటే ఎంత ప్రమాదకరమైన యాత్రో తెలుస్తున్నది. ఇంత అద్భుతమైన యాత్ర గురించి వ్రాసి మాకళ్ళకెదురుగా నిలిపినందుకు కృతజ్ఞతలు.

  10. మనసులు దోచే మనస్లు– 1 గురించి Subha అభిప్రాయం:

    02/06/2026 5:10 pm

    మాటలు రావటము లేదు మీ ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్పటం తప్ప. మేము చూడలేకపోయిన ప్రపంచాన్ని మా కళ్ళకెదురుగా నిలబెట్టి చూపుతున్నందుకు మరిన్ని కృతజ్ఞతలు.