Expand to right
Expand to left

పాఠకుల అభిప్రాయాలు


ఈ పదం(పదాలు) ఉన్న అభిప్రాయాలు చూపించండి

ఇప్పటిదాకా ఈమాట లో తెలియచేసిన అభిప్రాయాలు: 10120

«కొత్త అభిప్రాయాలు 1 ... 3 4 5 6 7 ... 1012 పాత అభిప్రాయాలు»

 1. మనుషులపై మదుపు గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

  01/20/2016 5:38 am

  నేనిదే అభిప్రాయం వెల్లడించాను ఒకసారి స్నేహితులతో. ఇల్లు వదిలి ఉద్యోగాలు చేయని ఆడవారి జీవితం వ్యర్థం అని భావించేవారిది అమాయకత్వం. నన్ను ముట్టుకోకు నామాల కాకి అని ఏదో సామెతలా ఉండకుండా; ప్రసవాలు, శుభకార్యాల్లో సహాయాలు చేసినవారికి తమ యింటికి అవసరమైనప్పుడు ఆ అనుభవం తప్పక సహాయపడుతుంది. డబ్బులకోసం పని చేయడమే జీవితానికి సార్థకత అనుకోరాదు అని, బద్ధకస్తులు కాకుండా ఉంటే చాలు అని అన్నాను. అదే మాట ఇక్కడ కథలో నిరూపించబడింది. మంచి కథను అనువదించారు. అభినందనలు.

 2. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

  01/19/2016 8:31 am

  శర్మ దంతుర్తి గారూ,

  పోతన శ్రీమదాంధ్ర మహాభాగవతను ఆశ్వాదించే శక్తి గల మీరు శ్రీశ్రీని, ఆక్షేపించటం కాదు, అభ్యంతరకర విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్ర మహాభాగవతం కనుమరుగవుదు, తెలుగు సాహిత్యం లో శ్రీశ్రీకి స్థానం లేకుండా పోదు (ఏ కొద్దిమంది నిరంకుశ ఇష్టాఅయిష్టాలతో పనిలేకుండా). అంతర్జాలం బేండ్ విడ్త్ వృధాచేస్తూ తొందరపాటుతో చేస్తున్న మన వ్యాఖ్యలు మాత్రం మిగులుతాయి, కొన్ని క్షణికమైన రోజులు.

 3. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి VSTSayee అభిప్రాయం:

  01/19/2016 1:11 am

  సంపాదకులకు మనవి:

  “వ్యంగ్యం అని రచయిత హామీ ఇచ్చిన” అనే శీర్షిక గురించి కాస్తంత ఆలోచన చేయగలరు.

  రిగార్డులతో,
  శాయి.

 4. నాకు నచ్చిన పద్యం: లీలామోహనుని ముగ్ధ సౌందర్యం గురించి విశ్వనాథ్ అభిప్రాయం:

  01/19/2016 12:58 am

  చక్కని విశ్లేషణ. చాలా బాగుంది.

 5. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి కటకటా! అభిప్రాయం:

  01/18/2016 5:31 pm

  అయ్యా సంపాదకుడు గారూ:

  ఈమాటలో తెలుగు పేరుతో సంస్కృతం దంచేసే మహానుభావులెందరో ఉన్నారు అన్నది జగద్విదితం. వారెవరిచేతైనా వ్యంగ్యం — గూఢంగా ఉండే వ్యంగ్యం, అగూఢంగా ఉండే వ్యంగ్యం — వీటిగురించి ఒక చిన్న వ్యాసం రాయించండి మహప్రభో!

  ముమ్మటుడిదో, కుంతకుడిదో — ఏదో ఒక లక్షణగ్రంథం నుంచి ఒక పాఠం రాయిద్దురూ! అర్థం పర్థం లేని కామెంట్లు రాసే వాళ్ళకీ,– కేవలం మెంటల్‌ రాతలు రాసేవాళ్ళకీ — ఇద్దరికీ పనికొస్తుంది!

  లేకపోతే, మీరు కథలకీ, వ్యాసాలకీ బ్లర్బులు రాస్తారుగదా! అప్పుడు, ఇల్లాంటి, “వ్యాస – కథలకీ” లేదా “కథా – వ్యాసాలకీ” బ్లర్బ్బులో, “ఇది వ్యంగ్యము. అపార్థము చేసికొనకుడు,” అని భక్తులకు, — ముఖ్యంగా మూఢభక్తులకు, బోధపడేలా చెప్పేద్దురూ!

  ఒక చిత్రకారుడెవరో తను గీసిన బొమ్మక్రింద “కుక్క బొమ్మ,” అని రాసాడట! బొమ్మని చూసి శ్రోత్రియపరులు చిరుతపులి అని భయపడతారేమోనని భయపడి!

  విధేయుడు,

  కటకటా!

 6. సంపాదకుని తిరస్కరణ లేఖ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

  01/18/2016 12:35 pm

  రామయ్య గారు, నేను రాసినదీ, మీ కామెంటూ మళ్ళీ ఓ సారి చూసుకుంటే తెల్సింది. మీరు చెప్పినది పూర్తిగా సరికాదు. ప్రస్తుత పరిస్థితులు, ఇలాగే కొనసాగుతాయి రెండు తెలుగు రాష్ట్రాలలో అని భావించుకుంటే – అబ్బే తెలుగు మాట్లాడేది తెలంగాణా ఒక్కటే, ఆంధ్రాలో మాట్లాడేది తెలుక్కాదు అంటే సరే ఒక రాష్ట్రం అందాం – రాబోయ్యే రోజుల్లో పోతన ఆంధ్ర మహాభాగవతం కనుమరుగవుతుందనుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం ఉన్నట్టు తోచదు.

  మహాకవి, పెజా కవి శ్రీశ్రీ ఎక్కడా? పోతనలాంటి పనికిమాలిన సీసపద్యాలు రాసేవాడెక్కడా? కధ నిజమో కాదో తెలియదు కానీ పోతన భాగవతాన్ని తనకి అంకితం ఇమ్మని ఆ రోజుల్లోనే – ఇప్పట్లాగానే – ఓ రాజ రాజ నరేంద్రుడు పోతనని ఏడిపించుకు తిని ఆ పనికిమాలిన పద్యాలన్నీ భూస్థాపితం చేసాడుట. బుధ్ధిలేని కొంతమంది వాటిని తవ్వితీసిమనమీదకి వదిలారు. ఆ పద్యాలు ఎంతచదివినా మహాకవి రాసే కవితల మూలంగా వచ్చే “అత్యద్భుత సామాజిక స్పృహ” రాదనేది జగమెరిగిన సత్యం. నా తప్పు ఒప్పుకుంటున్నాను. ఆ మధ్య చదివిన మహా కవి కవిత ఇచ్చాను ఇక్కడ. పోతన భాగవతం అయుదు సంపుటాలలో ఎంత వెదికినా ఇటువంటి అణి ముత్యం ఒక్కటీ నాకు కనపళ్ళేదు.

  అరిచే కుక్కలు కరవవు
  కరిచే కుక్కలు అరవవు
  అరవని కరిచే కుక్కలు తరమవు
  కరవని అరిచే కుక్కలు మరలవు
  అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు

  మా ఆఫీసులో పనిచేసే ఒకాయన “సర్వీస్ డాగ్” అనే దాన్ని తీసుకొస్తాడు. అది ఈ అయిదోపాదానికి పూర్తిగా వ్యతిరేకం మరి. అయినా చెప్పాను కదండి, నాకేం తెలుసు వంకాయ పులుసు అనీ?

  మీ భవిష్యత్ దృష్టినీ పెజాకవినీ ఆక్షేపించినందు క్షంతవ్యుడను. మీ వ్యాక్యం ఏమీ అనుకోరని సరి చేస్తున్నాను.

  “పోతన శ్రీమదాంధ్ర మహాభగవతం పద్యాలు ఎలాగైనా సర్వనాశనం అయితీరుతాయి రాబోయ్యే రొజుల్లో కానీ ప్రజా/మహా కవి కవితలు మాత్రం తెలుగు వాడు జీవించి ఉన్నంతవరకూ (అంటే దిబ్బ/మినప రోట్టి మన తెలుగు వాళ్ళు మర్చిపోయే వరకూ) మనగలుగుతాయి”

  నా తప్పు ఒప్పుకుని ఇంక అంతర్జాలం బేండ్ విడ్త్ (అంటే ఏమిటో నాకూ తెలియదు కానీ అందరూ వాడుతున్నారు ఆ మాట, నేనెందుకు వాడకూడదూ అని) చేయనని మీకు నా హామీ. శెలవు.

 7. మన ఛాందసులు గురించి రామ్ ప్రసాద్ అభిప్రాయం:

  01/17/2016 8:43 pm

  చాలా అద్భుతమైన విశ్లేషణ . నమో నమః

  రామ్

 8. ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి కొండ రవికుమార్ అభిప్రాయం:

  01/17/2016 9:29 am

  ఘంటసాల గారితో వేరెవరినీ పోల్చలేము. ఇంకో.. ఇరవై సంవత్సరాల తర్వాత బాలు గారికి అభిమానులు ఉంటారో.. ఉండరో కానీ, ఇంకా వంద సంవత్సరాల తర్వాత కూడా.. ఘంటసాల గారికి భక్తులుంటారు.

 9. ధీర గురించి sailajamithra అభిప్రాయం:

  01/17/2016 5:20 am

  కధనం చాల బావుంది … ఈ తరానికే కాదు భావి తరాలకు కూడా ఉపయోగించేలా ఉంది.

 10. మా ఆవిడ – మంగళసూత్రం గురించి క్రిష్ణవేణి అభిప్రాయం:

  01/16/2016 12:34 pm

  బులుసుగారూ,
  మీ మార్కయిన బ్రహ్మాడమైన హ్యూమర్‍.
  ఎంత బాగో రాశారో, చెప్పలేను.

«కొత్త అభిప్రాయాలు 1 ... 3 4 5 6 7 ... 1012 పాత అభిప్రాయాలు»