పాఠకుల అభిప్రాయాలు


11373

« 1 ... 1118 1119 1120 1121 1122 ... 1138 »

 1. సందుక గురించి Prasad గారి అభిప్రాయం:

  07/31/2006 8:54 am

  అన్నా, సందూక అంటే ఏంటొ జర జెప్పవూ? నేను రాయలసీమ పోరన్ని, నాకిది తెల్వదు. ఇలా మాండలీకాలల్ల కూడా కవితలొస్తే అన్ని జాగాల బాషని అందరు నేర్చుకొంటరు గద. మస్తుంగుందన్నా ఇది.
  — ప్రసాద్
  http://charasala.wordpress.com

 2. గుల్మొహర్ గురించి Prasad గారి అభిప్రాయం:

  07/31/2006 8:45 am

  చాలా అద్భుతంగా వుంది. మోడుల్లా మారి మళ్ళీ వసంతం రాకతో కొంగొత్త పచ్చదనంతో, మరికొన్ని వడలెల్ల కొత్తకొత్త రంగుల చెంగావి చీరలు కట్టిన వాటిల్లా సింగారించుకుంటే చూసి మురిసిపోవటమే కానీ ఈ సరికొత్త భావనలు పొడచూపలేదు. ఇక ప్రతి వసంతానికీ నే చూసే ప్రతిచెట్టూ ఈ కవితే పలికిస్తుందనడంలో సందేహం లేదు.
  — ప్రసాద్
  http://charasala.wordpress.com

 3. హా (స్యం) సం (గీతం) గురించి iswarimurty గారి అభిప్రాయం:

  07/31/2006 12:26 am

  ప్రసాదుగారు,
  నాకు తెలియని ఎందరో గాయకుల గురుంచి తెలియ చేసిన మీకు నా అభినందనలు . సంప్రదాయ సంగీత గురించి తెలియపరిచింది మీ వ్యాసం.

 4. నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి చిట్టెల్ల కామేశ్వర రావు గారి అభిప్రాయం:

  07/29/2006 11:10 pm

  చాలా బాగుంది. అయితే ఒక చోట “పుబ్బలో పుట్టి … మఖలో మాడిపోయి ” అని రాసారు. ప్రాస కోసం అయితే సరే. కాని చెప్పాలనుకున్న విషయాన్ని బట్టి అయితే “మఖలో పుట్టి , పుబ్బలో మాడి పోయే” అని రాయాలేమో.. అని నా వ్యక్తిగత అభిప్రాయం. రంధ్రాన్వేషణ అనుకోకుండా ఉంటే మంచిదే. లేకపోతే క్షంతవ్యుడిని. ఏదేమైనప్పటికీ, చాలా మంచిగా, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, నిర్భయంగా , సునిశితమైన దృష్ఠతే విశ్లేషించిన తీరు బహూధా ప్రశంసాపాత్రం. మీ నుండి మరిన్ని సమకాలీన సమస్యలపై విశ్లేషణలను ఎదురుచూసేలా చేసారు. హేట్సాఫ్.

 5. ఎంగేజ్మెంట్ గురించి Shiva గారి అభిప్రాయం:

  07/27/2006 7:38 pm

  I am not able to understand the climax…

  Is the moral of the story is chicago and newyork are the places which u cannot leave ?

 6. నౌషాద్‌ గురించి C Rajendra prasad గారి అభిప్రాయం:

  07/27/2006 12:10 pm

  సంగీతం మీద ఎంతో ప్రేమ,పట్టూ ఉంటే తప్ప ఇంత మంచి వ్యాసం రాయలేరు.హిందూస్థానీ సంగీతం గురించి,తెలుగు పాటల గురించి అథారిటేటివ్ గా రాయటం లో ,శైలి లో కొకు గారు కనిపిస్తున్నారు

 7. తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ… గురించి C Rajendra prasad గారి అభిప్రాయం:

  07/27/2006 11:26 am

  మీ చివరి మాట,తానా ఆటా ల ఖర్చు లొ 10శాతం పెట్టినా తెలుగు బోధన సులభమవుతుందనటం నిజం.ఆ దిశలో ఆలొచన ప్రయత్నం జరిగితే చాలా బాగుంటుంది

 8. గేటెడ్ కమ్యూనిటీ గురించి Murali Mohan గారి అభిప్రాయం:

  07/25/2006 3:19 am

  కథ చాలా బాగుంది. ముఖ్యంగా గంగిరెద్దుల వాళ్ళని డిస్ని స్టాంప్ ఉంటేనే లోపలికి రానిస్తారు అనడం, మన సంస్కృతి యెలా మాయం అవుతుందో, western సంస్కృతి భూతం యెలా మనలని ఆవహిస్తున్నదో చెపుతోంది. అలాగే జీవితంలో యెదగాలనే ప్రయత్నం లో యెదురయ్యే అవంతరాలకు యెలా సగటు మనిషి అసహనానికి, నిరాశ కు లోనవుతున్నాడో చక్కగా చెప్పారు. అలా అని అన్ని సౌకర్యాలూ ఉండే ఇల్లు సమకూర్చుకుని, హాయిగా బతకాలి అనుకునే వాళ్ళు, అలా ఉంటున్న వాళ్ళంతా యెమీ నేరం చెయ్యలేదని సుధ ద్వారా చెప్పించారు.

 9. పగటి వాన గురించి kskk గారి అభిప్రాయం:

  07/25/2006 3:19 am

  చాలా బాగున్నదండి

 10. గేటెడ్ కమ్యూనిటీ గురించి B.AJAY PRASAD గారి అభిప్రాయం:

  07/24/2006 1:03 am

  Good Story. I really appreciate for his selection of delicate theme & perfect narration.

« 1 ... 1118 1119 1120 1121 1122 ... 1138 »