సినీ చైతన్యం

ఇంద్రియాలను కిర్రెక్కించే
అసభ్యకర ఆటాపాటామాటల
దోపిడీదగా మాయామర్మపు
మొసలికన్నీళ్ళ యీ సినిమాలను
పీడిత ప్రజానీకం
చూడటం మానేస్తే
అమ్మో అంత చైతన్యమొస్తే
ఇంకేమన్నా ఉందా
ఈ దోపిడీ వ్యవస్థ
కుప్పకూలిపోదూ