మూగవోయిన గొంతు

ఇన్నాళ్ళూ గలగలా మాట్లడితే
నే చెప్పాల్సిందేమీ లేనందున
నేనేం చెప్పినా విన్నారు

ఇప్పుడేమో నాకూ
చెప్పాల్సిందేదో ఉండి
చాలా గాఢమైంది
చాలా ఇష్టమైంది
చాల స్వచ్ఛమైంది
చెప్పాల్సిందేదో ఉండి
మాట్లాడబోతే
ఎవరూ వినిపించుకోరు
అందుకో మరెందుకో
ఈ గొంతు మూగవోయింది

తాదాత్మ్యపు మత్తు వల్లనో
మాధుర్యపు తీపి వల్లనో
లేదూ మీరెలాగు వినిపించుకోరనో
మూగవోయింది ఈ గొంతు

ఐతే ఏం
మూగవోయిన ఈ గొంతులో
తాదాత్మ్యాన నిద్రించిన
అనురాగమానస నిస్వనాలున్నాయి