కలిశాం

ఎండల్లో ,వెన్నెల్లో

తడిచాం ,నడిచాం

పంచుకొన్నాం

కలలు ,కవిత్వాలు !

అరచేతుల గరకు స్పర్శ

చాలు..

పోదాం పద నేస్తం

వేయి కన్నుల

వేయి కలల ప్రపంచం

వేచి చూస్తుంది

మన కోసం

సెలవా మరి …

పవన్‌కు

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...