ఉపదేశం

ఊరి బయట

ఆరుతున్న కుంపటి

బొగ్గులన్నీ

ప్రార్థించిన పిమ్మట

నివురుగప్పిన నిప్పు

జీరలేని గొంతుకతో

ధీరంగా చెప్పింది

“చలించక

జ్వలించండి”

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...