నా చిన్నీ

రసమయ ఘడియల్లో

రహస్యవీణ శ్రుతిచేసింది

నీవేనా చిన్నీ?

మెరిసిపోయే కన్నులలో

మల్లెపూలు దాచుకొంది

నీవేనా చిన్నీ?

తేలిపోయే మాటలతో

తీపితీపి కాలాన్ని రచించింది

నీవేనా చిన్నీ..

నా చిన్నీ..

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...