అప్రాప్తం

వినలేను

చేదబావి గిలక మోత!

పూర్తిగా మునిగిన బిందె

తల ఎగురవేస్తూ..

నిలువుగా పయనం!

చేతుల్లో వాలదామని..

అందుకోలేను.

వినలేను

స్టీలు పాత్రల మోత

నిన్ను నీకు చూపే మెరుపు

చూడని వారు అంధులు

ఎవరి ప్రతిబింబం వారికి బహుమతి

స్వీకరించలేను.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...