సాలీడు

మాటలన్నీ ఆపి

గదిలోకి ప్రవేశిస్తాను.

రైలు పట్టాల మీద

ఒకటే ఆలోచన

మీసాలు దువ్వుతుంది బొద్దింక

అలమరాలో చదవని పుస్తకం

ఉత్తరాలు రాయడం మానేశాను

పావు కదపవా,ఏం?

వెన్నెల లేదు

పడవ మునిగిపోయింది

గోడమీద బల్లి

వేలాడుతుంది సాలీడు

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...