పోగొట్టుకొన్నదేదీ తిరిగిరాదు

ఎండిన చెట్టు నీడన

రాలిన శిథిల పత్రాలు

నగ్న పాదాలతో

చప్పుడు చేస్తూ

నడుస్తూ వెళ్ళకు

అవి నీ ప్రతిబింబాలు

ఏరుకొని

భద్రంగా గుండెమీది

జేబులో దాచుకో

నడక సాగించు

నిన్ను నీవు పోగొట్టుకోకు

పోగొట్టుకొన్నదేదీ తిరిగిరాదు

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...