తిరువనంతపురం

ఎన్ని నాళ్ళ

అనంతరం

గురుతుకు వస్తుంది

తిరువనంతపురం

ఏ రుతువులోనైనా

ఛాయలేని

తరువుంటుందా ?

చిరుకప్పలా

ఎగిరి దూకి..

ఎన్ని నాళ్ళ

అనంతరం

గురుతుకు వస్తుంది

తిరువనంతపురం

అలల జిహ్వలతో

మొరటు రాళ్ళను

బాది

ఊది వేసే ఉరగం

సముద్రం!

పరచిన ఇసుక తివాచీ

మరచి వచ్చాను

మరలు వాచీ

బరువు బరువు రైలు

కరంజోవ్‌సోదరులు

నాకు తోడుగా

చాకులాంటి దొంగ

కట్టుబట్టలతో మిగిలి

ఎట్టులోర్తునో!

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...