చీకటిలో కారుకన్ను

నీవేదో పాట పాడుతుంటావు

లేదా

ఓ లెక్కతో కుస్తీ పడుతుంటావు

కారులైటు చీకటిలో

కనురెప్పను తెరచినట్టు

రోడ్డంతా బురద

కప్పను మింగుతుంది పాము

నేను రాను.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...