గమ్యం(?)

ఏదో స్టేషన్‌

ఆగింది రైలు.

ఇరువైపులా

ఎరుపు దీపాలు.

చలిగాలిలో

కంకర రాళ్ళ మీద

వంకర కాళ్ళతో

పరిగెత్తే కుక్క.

నిదురమత్తు వదలని

వనిత కురులలో

ఇరుక్కున్న చీకటి.

పలుచని నీలితెర

వాలు కొండల్లో

మాయమయే తార.

సంకేతం అందినట్టే వుంది!

నిట్టూర్పు పొగ వదిలి

పట్టాలపై కదిలింది

రైలు.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...