తడిచేతుల సముద్రం

తడిచేతుల సముద్రం

తడిమి

తలబాదుకొంటుంది

శిలలపై..

బడితెలేని

బడిపంతులు

పొడవాటి ఒడ్డు

అదిలిస్తోంది

చదవలేని కెరటాలను

పచార్లు చేసేవారిని

విచారం లేని చలిగాలి

వీచి,పరామర్శిస్తుంది.

కనురెప్పలు లేని చేప

తనువు చాలించాక

తనకు తెలియని లోకాన్ని

కనగలదు ఏకంగా!

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...