ప్రేమ

ఎక్కడో వర్షాలు

ఏటికి నీళ్ళొచ్చాయి.

ఎండిపోయినా

నిండుగా పారిన రోజులను

మరచిపోదు ఏరు.

కదిలిపోయిన నీరు

ఎగుడుదిగుడు దిబ్బలను

నిమిరి వెళ్ళింది.

రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్‌ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్‌, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు.  ...