గాథాసప్తశతి శతకం

[పరిచయ వ్యాసం]


పసు-వఇణో రోసారుణ-పడిమా-సంకంత-గోరి-ముహ-అందం
గహిఅగ్ఘ- పంకఅం విఅ సంఝా-సలిలంజలిం ణమహ

పశుపతే రోషారుణ-ప్రతిమా-సంక్రాంత-గౌరీ-ముఖ-చంద్రం
గృహీతార్ఘ-పంకజమివ సంధ్యా-సలిలాంజలిం నమత


సందెజపమ్మును జేయగ
కెందామర దోసిలి గల ఘృణిదర్పణమం
దందపు టెఱ్ఱని శశిముఖి
గందోయిని గను పశుపతి కంజలు లిత్తున్
… 1-01

The water in His lotus hands
for the evening prayers
reflects the moonlike face of His consort …
red with anger in the dusky glow …
My obeisance to Lord Sivaఅమిఅం పాఉఅ-కవ్వం పఢిఉం సోఉం అ జే ణ ఆణంతి
కామస్స తత్త-తంతిం కుణంతి తే కహఁ ణ లజ్జంతి

అమృతం ప్రాకృత-కావ్యం పఠితుం శ్రోతుం చ యేన జానంతి
కామస్య తత్త్వ-చింతాం కుర్వంతి తే కథం న లజ్జంతే


అమృతము వంటిది ప్రాకృత
మమితముగా వ్రాసి చదివి యలరక నున్నన్
గమి కామమునే దలచన్
దమరికి నవదేమొ సిగ్గు ధరపై యెపుడున్
… 1-02

The Prakrit language is
sweet nectar
Some,
instead of reading and
writing in that language
immerse themselves
in erotic thoughts!
Aren’t they ashamed?ఉఅ ణిచ్చల-ణిప్పందా భిసణీ-పత్తమ్మి రేహయి బలాఆ
ణిమ్మల-మరగఅ-భాఅణ-పరిట్ఠిఆ సంఖ-సుత్తి వ్వ

పశ్య నిశ్చల-నిఃస్పందా బిసనీ-పత్రే రాజతే బలాకా
నిర్మల-మరకత-భాజన-పరిస్థితా శంఖ-శుక్తిరివ


పచ్చని తట్ట పయిన్ గడు
ముచ్చటగా నుండు తెల్ల ముత్తెమువోలెన్
పచ్చని తామరపాకున
నిచ్చలముగ నుండె పక్షి నిశ్శబ్దముగా
… 1-04

Like a white pearl
on a spotless emerald dish
sits the white heron –
unmoving and silent
(Go then to the lake
the lily white damsel
clad in green
waits for you
silently
and patiently)దుగ్గ అ-కుటుంబ-అట్ఠీ కహం ణు మఏఁ ధోఇఏణ సోఢవ్వా
దసి-ఓసరంత-సలిలేణ ఉఅహ రుణ్ణం వ పడఏణ

దుర్గత-కుటుంబాకృష్టిః కథం ను మయా ధౌతేన సోఢవ్యా
దశాపరత్సలిలేన పశ్యత రుదితమివ పటకేన


ఉదుకగ చీరను ప్రతిదిన
మది గతుకుల నిండిపోయె యౌరా లేమిన్
బ్రదుకున నగచాట్లు పడెడు
ముదుసలి గని చినుగు చీర మోమున జలముల్
… 1-18

Then –
she was young and rich with several suitors
with countless priceless saris to wear
Now –
she is old, worn and torn
and the only sari she has
is old, worn and torn
beaten again and again
even the holes in the sari
shed tearsఅలిఅ-పసుత్త విణిమీలి-అచ్ఛ దే సుహఅ మజ్ఝ ఓఆసం
గండ-పరిఉంబణా-పులయి-అంగ ణ పుణో చిరాఇస్సం

అలిక-ప్రసుప్తక-వినిమీలితాక్ష హే సుభగ మమావకాశం
గండ-పరిచుంబనా-పులకితాంగ న పునశ్చరయిష్యామి


బూటకపు నిద్ర చాలిక
నీటుగ పులకింతు వేల నిను చుంబించన్
చోటిమ్ము నీదు ప్రక్కన
మాటిత్తును తడవు జేయ మన కూటమికిన్
… 1-20

I know it is all a fake
you’re not sleeping
See how you got excited
when I brushed a kiss on your cheeks
Move aside
let me also share the bed
I promise, no delay henceforth!