దర్శకుడు బి. ఎన్. రెడ్డితో ముఖాముఖీ

గతంలో బి.ఎన్‌. రెడ్డి పైన వ్యాసం రాసినప్పుడే ఈ రేడియో ఇంటర్‌వ్యూని ప్రస్తావించినందువల్ల దానిని కూడా జత పరచుదామనుకున్నాను కానీ సమయానికి డిజిటైజ్ చేయడం సాధ్యపడలేదు. ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. ఈ మధ్య మిత్రులు పైడిమర్రి వెంకటరమణగారు ఇంటర్‌వ్యూ పాఠాన్ని తమ బ్లాగులో పోస్ట్ చేస్తూ ఈ ఆడియో దొరుకుతుందా అని అడిగారు. అలా ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు, ఇక్కడ, మీరందరూ వినగలిగేట్లు!

పైన బ్లాగు పోస్టులో చెప్పినట్లుగా ఈ సంభాషణ 1973లో విజయవాడలో రికార్డు చేయబడింది. ఈ సంభాషణ జరిపిన భట్టుగారే ఇరవయ్యేళ్ళ క్రితం ఆడియో టేపుపై కాపీ చేసి ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు.