పర పరాగ్ ​- 1970​

హృదయమెంతనో
గాయాల్ కానీ
చిల్లుల్ చిల్లుల్
చిల్లుల్ పడనీ
​ద్రవించి పోనీ
​నిన్నల్ మొన్నల్

నీవు లేవనీ ​
రేపు రావనీ
తెలిసినా మది
దిగుల్ దిగుల్‌గా

మల్లెల్ పువ్వుల్
సిగిరెట్ పొగల్
కాఫీ సెగల్
రేపగ తాపాల్

గిలిగిలి గిలిగా
షిఫాన్ చూపుల్
తుఫాన్‌తో
హఠాత్తుగా
నువ్ ఎదుర్
అవుతావని

బందర్ రోడ్
బాబాయ్ హోటెల్
మెలికల్ మెలికల్
బెజ్వాడ్ బాజార్స్
బాణాల్ వేసి
వెదికీ వెదికీ

మొహాల్ మొహాల్
ఎగాల్ దిగాల్ నే
పరకాయిస్తో
తిరిగీ తిరిగీ

బార్‌ గెడ్డం
మాసి నెర్‌సి
కన్నుల్ ​అలి​సి

ఇడ్లీల్ వడల్
సిగిరెట్ కాఫీల్
జేబుల్ కన్నాల్
స్కూటర్ చక్రాల్
పడనీ చిల్లుల్

గాయాల్ గాయాల్
గాయాల్ కానీ
మనసో జల్లెడ
​అహో! ​
కన్నాల్ చిల్లుల్.