గడి నుడి 13 – సమాధానాలు, వివరణ

అడ్డం

 1. నందనవనంలో దాగిన మొహం
  సమాధానం: వదనం. ఏనగ్రామ్.
 2. శకుని చేతిలోని ఆయుధం
  సమాధానం:పాచిక.
 3. వని కాని భూమి
  సమాధానం: వని కానిది అ-వని. అవని అంటే భూమి.
 4. నీటిలోని మొసలి
  సమాధానం: నీరాటం. భాగవతంలో శౌనకాది మునులు సూతుడిని అడిగిన ప్రశ్న: “నీరాట వనాటములకు పోరాటంబెట్లు కలిగె?…” (నీళ్ళలో ఉండే మొసలికి, వనంలో ఉండే ఏనుగుకు పోరాటమెట్లా కలిగింది.)
 5. రాకావెన్నెల సరిపోగా మిగిలిన ఇంటిపేరు
  సమాధానం: రావెల. సరిపోగా = సరిస్థానాల్లోని (2వ, 4వ) అక్షరాలు పోగా అని.
 6. విష్ణువైతే యుగాల తరబడి. కమల్ హాసనైతే ఒకేసారి
  సమాధానం: దశావతారం.
 7. అతికఠినమైన శిరోలంకారం
  సమాధానం: వజ్రకిరీటం. శిరస్సుకు అలంకారం కిరీటం. అతి కఠినమైనది వజ్రం.
 8. జలదరింపు
  సమాధానం: కంపరం.
 9. వనంతో కవిత్వం
  సమాధానం: కవనం.
 10. లాలించేచోటు పాలించకపోయినా లోటు లేదు
  సమాధానం: అంకపాలిక. ఒడి లేదా కౌగిలి.
 11. విశాఖదత్తుడి గుప్తనాటకం
  సమాధానం: ముద్రారాక్షసం.
 12. ఎంతసేపూ కిచకిచలే
  సమాధానం:పిచ్చుక సరసం (పిచుక/పిచిక/సరసం). మాటిమాటికి చేసే పనిని పిచ్చుక సరసం అంటారు.
 13. రాజ్యతంత్రం లేదా మంత్రాంగం
  సమాధానం: కూటనీతి.
 14. క్లూనిచ్చే గుర్తు
  సమాధానం: సంకేతం.
 15. మనం చేసే తలపోత
  సమాధానం: మననం.
 16. అంతుచిక్కని వింతదేవుడు
  సమాధానం: గణపతి. ఈమాటలో వస్తున్న వ్యాస శీర్షిక.
 17. కవి కలానికి రాజులు కట్టిన వెల
  సమాధానం: అక్షరలక్షలు.
 18. మధ్యమంతో మొదలుపెట్టి ఆరోహణ అవరోహణాలు పూర్తి
  సమాధానం: మపదనిస. సప్తస్వరాల్లో మధ్యమం ‘మ’ దగ్గర్నుంచి మొదలుపెట్టి చివరి వరకు ఉన్నవి మపదనిస. వీటిలో ప వరకు ఆరోహణ, తర్వాత అవరోహణ.
 19. చెడ్డ గర్వం
  సమాధానం: దురహంకారం.
 20. చిలీ దేశపు సముద్రమంత గొప్ప కవి నాయకుడు
  సమాధానం: నెరుడా (నెరూడా). చిలీ దేశపు ప్రసిద్ధ కవి, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు పాబ్లో నెరుడా. సముద్రం ఇతని కవిత్వంలో అంతర్భాగం. అందుకే ఇతనిని సముద్ర కవి అని కూడా అంటారు.
 21. అక్కడే ఉంది హద్దు
  సమాధానం: అవధి.
 22. తలవెంట్రుకల వరుస
  సమాధానం: శిరోజావళి.
 23. ఇరుగ్గా సర్దుకున్న తిరుచానూరు అమ్మవారు
  సమాధానం: అలమేల్మంగ. అలమేలుమంగ ఇరుగ్గా అలమేల్మంగ అయింది.
 24. గౌరవం కోసం క్రోసు దూరం వడిగా వెళ్ళు
  సమాధానం: పరువు.
 25. శిల్పి
  సమాధానం: స్థపతి.
 26. అడుగులు తడబడ బుడుత(డు) నడిచెనిలా
  సమాధానం: డుబుత.
 27. ఫుల్ మీల్స్ రాత్రికి తింటారా?
  సమాధానం: డిన్నరు (డిన్నర్). డిన్నరుకు మొదటి అర్థం main meal of the day, taken either around midday or in the evening. రెండో అర్థం a formal evening meal, typically one in honor of a person or event.
 28. రీతికి తోడొచ్చే పరభాషా సంప్రదాయం

సమాధానం: రివాజు. రివాజ్ అనే ఉర్దూ పదం నుంచి వచ్చిన మాట ఇది.

నిలువు

 1. కోరిక తీర్చే వెల్లువ
  సమాధానం: వరద. వరద అంటే కోరిన వరమునిచ్చేవాడు అని, వెల్లువ అని రెండు అర్థాలున్నాయి.
 2. శివుడి వాహనం పెరిగితే ఒక పూలచెట్టు
  సమాధానం: నందివర్ధనం.
 3. కువకువలాడే క్వార్టర్ బాటిల్ రమ్
  సమాధానం: పావురం. క్వార్టర్ = పావు.
 4. మడువలేని వటుడు పాలమరకతో పడిన ఆందోళన
  సమాధానం: కలవరపాటు. ఏనగ్రామ్
 5. 6 నిలువుకు అడ్డమొచ్చేది
  సమాధానం:అడ్డంకి. ఏనగ్రామ్
 6. 5 నిలువు లేకపోవడం
  సమాధానం: నిరాటంకము.
 7. రాధ కంట మరల నీరొలకగ శివాయని పిలిచెనట
  సమాధానం: నీలకంధరా. ఏనగ్రామ్.
 8. ఝంకారం కాదు. నారి చేసే ధ్వని
  సమాధానం: టంకారం. ధనుష్టంకారం అని అంటారు కదా.
 9. పిళ్ళా కనకం తలవాకిట్లో అటు ఇటుగా
  సమాధానం: కళ్ళాపి. ఏనగ్రామ్.
 10. లోపలినుంచి పారే జలం. ఒక ఊరు, ఒక తీర్థం
  సమాధానం: అంతరగంగ. కర్ణాటకలోని కోలూరు జిల్లాలో ఉంది.
 11. చెవికింపైన రాష్ట్రం
  సమాధానం: కర్ణాటక. కర్ణమంటే చెవి. చెవికింపైనది కర్ణాటకం.
 12. పాకాల్లో అతిసులువైనది
  సమాధానం: ద్రాక్ష. నేరుగా నోట్లో వేసుకుని చప్పరిస్తేనే కరిగిపోయేది ద్రాక్షపాకం. సులభంగానే అయినా ఒలిచి తినవలసినది కదళీపాకం. ఒక పట్టాన కొరుకుడు పడనిది నారికేళపాకం.
 13. ఒకరకంగా 15 నిలువు దీనికి సంబంధించినదే
  సమాధానం: సంగీతం.
 14. అడ్డం 1 తల మారిస్తే యుద్ధమే.
  సమాధానం: కదనం. వదనంలో వ మారిస్తే కదనం.
 15. ఒకచోట సొంతభక్తితో, ఇంకొకచోట వేరొకరి యుక్తితో
  సమాధానం: తిరుక్షవరం.
 16. బేడీ
  సమాధానం: సంకెల
 17. 26 అడ్డమాయన దీనిని తొలగిస్తాడా?
  సమాధానం: అపవాదు. నీలాపనిందలు తొలగించేది గణపతే కదా?
 18. ఎటు చూసినా ఒకటే, అయినా దీన్ని తిప్పడం పరువుతక్కువ పని
  సమాధానం: మడమ. మడమ తిప్పడం అంటే వెనుతిరగడం.
 19. రువాండా కాదు ఇంకో దేశపు రాజధాని
  సమాధానం: లువాండా. అంగోలా దేశపు రాజధాని.
 20. నిగనిగల మధ్య తవ్వకాలు జరిపేచోటు
  సమాధానం: గని
 21. ఉజ్జయినిలో ప్రసిద్ధ దేవాలయం
  సమాధానం: మహంకాళి గుడి.
 22. దండుమగడు
  సమాధానం: దళాధిపతి. దండు అంటే సైనికదళం.
 23. ఎల్లప్పుడూ శుభం కలిగించేవాడు (అప్పుడప్పుడూ భయం కూడా)
  సమాధానం: సదాశివుడు. ఎల్లప్పుడూ = సదా. శుభం కలిగించేవాడు = శివుడు. శివుడే రుద్రుడు కూడా. కాబట్టి భయం.
 24. చందమామను మింగేవాడు రాహువు
  సమాధానం: నెలమేపరి. రాహువుకు ఇంకో పేరు. నెల = చంద్రుడు
 25. కష్టమైన దశ
  సమాధానం: అవస్థ
 26. వెళ్ళు అమ్మాజీ అంటున్న అల్లుడు
  సమాధానం: జామాత. హిందీలో జా=వెళ్ళు.
 27. ఇంగ్లీషు పుండు
  సమాధానం: అల్సరు (అల్సర్).
 28. ఉర్దూ భాష రోత
  సమాధానం: గలీజు.