గోళం

నిద్రపో
మేలుకో
చదువుకో
నవ్వుకో
ఏడ్చుకో

పోట్లాడుకో
పాడుకో
పాడుకో

అంతులేని
అంతరిక్షంలో
భూగోళం
గిరాగిరా
గిరాగిరా
గిర్గిరా

పగలూ పగలూ
రాత్రీ రాత్రీ
రోజులై
జులై
లై
లై-

కరిగిపోతూ
కదిలిపోతూ
పోతూ
పోతూ
పో-

నీ ముద్దుల
గొడవ
దానికి
పట్టదు.