ఏప్రిల్ 2017

వసంతఋతువును వెంటబెట్టుకొని, తెలుగువారి కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సందర్భంగా వసంతునికి, వెన్నెలఱేనికి మధ్యన పోటీ గురించి భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం శీర్షిక; వసంత తిలకమనే వృత్తం గురించి జెజ్జాల కృష్ణ మోహన రావు వ్యాసం; అంతా కొత్తగా మొదలెడదామని కోగంటి విజయ్ కవిత; ఇంకా మరికొన్ని చక్కని కవితలు; వలసయుగంలో తెలుగు భాష, సాహిత్యదృక్పథాల్లో వచ్చిన మార్పులు, వాటికి ఎదురొడ్డి తన వాదాన్ని వినిపించిన విశ్వనాథ సాహిత్యగళం, సాహిత్య సందర్భం గురించి వెల్చేరు నారాయణరావు 2018లో ప్రచురించబోతున్న పుస్తకం ముందుమాటకు అబ్బరాజు మైథిలి తెలుగు అనువాదం; దామెర్ల రామారావు చిత్రానికి ఎక్‌ఫ్రాస్టిక్ కవిత రాసిన వేలూరి వేంకటేశ్వర రావు వినూత్న ప్రయత్నం; సినీప్రముఖులు రచించి నటించిన అరుదైన రేడియో నాటకం మనోరమ; కథలు, సమీక్షలు, ఇతర శీర్షికలూ ఈ సంచికలో.


ఈ సంచికలో:

  • కథలు: బెనిఫిట్ ఆఫ్ డౌట్ – పి. విక్టర్ విజయ్ కుమార్; రేపు – అవినేని భాస్కర్ (ఎ. ముత్తులింగం); దయ్యం – ఆర్. శర్మ దంతుర్తి (టాల్‌స్టాయ్); ఒకనాటి యువ కథ: భంగపాటు – ఇసుకపల్లి లక్ష్మీనరసింహ శాస్త్రి.
  • కవితలు: అంతా కొత్తగా – విజయ్ కోగంటి; ఆద – ఎలనాగ; ఆకు రాలు కాలం – పి. రామకృష్ణ; నీతో ఉన్న ఆ కాసేపు – జెన్నీ; బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయం – వేలూరు వేంకటేశ్వర రావు; అవ్యయ: విరహం, అపరాహ్ణం, నీ ఖాళీ ఇల్లు, ల్యాండ్‌స్కేప్, కృష్ణచూడా – సౌభాగ్య కుమార మిశ్ర (అను: వేలూరి వేంకటేశ్వర రావు.)
  • వ్యాసాలు: వసంత తిలకము – జెజ్జాల కృష్ణ మోహన రావు; వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 2. సారథి, సచివుడు, సఖుడు… రెట్ బట్లర్! – కల్లూరి భాస్కరం; విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు – మైథిలి అబ్బరాజు.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ! – భైరవభట్ల కామేశ్వరరావు; తెరచాటు-వులు: 3. శ్రుతి చూసుకో, శ్రుతి చేసుకో! – కంచిభొట్ల శ్రీనివాస్. గడి నుడి 6 – భైరవభట్ల కామేశ్వరరావు; శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక.
  • సమీక్షలు: ఐదుకవితలు: అవ్యయ, సౌభాగ్య కుమార మిశ్ర కవితలు – మానస చామర్తి; పుస్తక పరిచయం: చిట్టి చిట్టి మిరియాలు – చంద్ర లత.
  • శబ్దతరంగాలు: మనోరమ – ఆలిండియా రేడియో మద్రాసు కేంద్ర ప్రసారం – సమర్పణ: గొరుసు జగదీశ్వర రెడ్డి.