మనోరమ

ఈమాట పాఠకుల కోసం ఒక అరుదైన నాటకం అందిస్తున్నాను. ఈ నాటకంలో చేయి పెట్టినవారందరూ ప్రముఖులే! సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య వంటి గొప్ప నటులు పాత్రలు పోషించారు. పాకాల రాజమన్నార్ రచించిన ఈ నాటకానికి దాశరథి స్క్రిప్ట్ రైటర్‌గానూ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (మల్లంపల్లి సోమశేఖర శర్మగారి తమ్ముడు) అనౌన్సర్‌గానూ పనిచేశారు. ఆలిండియా రేడియో నుంచి ఎప్పుడు ప్రసారమయిందో కచ్చితంగా తెలీదు కాని, ఇది మద్రాసు కేంద్ర సమర్పణ అని మాత్రం తెలుసు. రేడియోలో పునఃప్రసారమయినప్పుడు రికార్డ్ చేసుకున్నాను. ఈ నాటకం గురించి మీకు మరికొన్ని వివరాలు తెలిస్తే తప్పకుండా తెలియచేయండి.