ఆద

నీహారస్వప్నకేదారాల నడుమ
నిత్యోల్లాస వసంతాన్ని కోరుకుంటే
బాధాగ్నికుసుమహారధారణ జరిగి
బరువెక్కింది జీవితం

స్వాదుసౌందర్య దీప్తుల్ని వెలయించే
కళాకర్పూరగంధి కోసం కలవరిస్తే
నిత్యనిస్సారవికారాకారంతో
ప్రత్యక్షమైంది కవితాలలామ

చారిమ మీద కూరిమి నశించి
సాధారణత్వం సార్వత్రికమయ్యాక
మనఃప్రాంగణంలో మనికితం కురిసి
పావనజీవనాభిలాష పాతాళాన్ని తాకింది