ఆకు రాలు కాలం

ఎడారిదేహం మీద
చెమటపూల
చిగుర్లు.

నీటిపెదాలపై
ఆవిరవుతూ
నీరెండ
మెరుపు చిర్నవ్వు.

నేను
నీడ క్రిందికి
నా నీడ
నాలోకి.

బావిలోతున
చిక్కి
ఈతరాని
దాహం.

పాట
పాడటం
వినడం
అంతా వేడి నిట్టూర్పే.

పువ్వూ… నేనూ…
రాలిపోతున్న
స్వంత అనుభవాల్తో.