మార్చ్ 2017

తెలుగు విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో ప్రామాణికత లేమిని ఎత్తి చూపిస్తూ, “జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి.” అంటూ వెల్చేరు నారాయణ రావు 1988లో తెలుగు పరిశోధన అనే పత్రికలో చేసిన చర్చ నేటికీ తన సంగతత్వాన్ని ఎంతమాత్రమూ కోల్పోలేదు. ఆ చర్చ పరిష్కృత పాఠం; బాలకథారచయితగా సుప్రసిద్ధుడైన డాక్టర్ ౙాయిస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన కథల స్ఫూర్తితో లలిత టి.ఎస్. చెప్పిన అంకెల కథ; ఒక కాలానికి చెందిన వ్యక్తిని, లేదా సంఘటనని, లేదా సామాజిక దృశ్యాన్ని కాలాతీతం చేసే మార్మిక శక్తి కావ్యానికి మాత్రమే ఉన్నదని, చరిత్ర చేయలేని పని కావ్యం చేస్తుందని చెప్తున్నారు భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం ద్వారా; విశ్వనాథ – వేయిపడగలు, మార్గరెట్ మిచల్ – గాన్ విత్ ద విండ్ నవలల లోని పోలికలూ తేడాలూ చూపిస్తూ కల్లూరి భాస్కరం ఇకనుండీ ఈమాటలో కొనసాగించబోయే విశ్లేషణ; ఇంకా ఎన్నో రచనలతో కలిసి ఈ సంచికలో మీకోసం.

🔸 ఇప్పటికీ చాలామంది ఈమాట రచయితల పరిచయాలు ఇంచుమించు ఖాళీగా ఉన్నాయి. దయచేసి తమ వివరాలు పంపమని, అలానే కాలదోషం పట్టిన వివరాలు సరిదిద్దడంలో మాకు సహాయపడమని రచయితలకు మా మనవి. రచయితల గురించి పాఠకులకు తెలియడానికి ఈ పరిచయాలు ఎంతో ఉపయోగపడతాయి. దయచేసి తోడ్పడమని విజ్ఞప్తి.


ఈ సంచికలో:

  • కథలు: ఒక ప్రయాణం – తాడికొండ శివకుమార శర్మ; అయిదో కుర్చీ – అవినేని భాస్కర్ (మూలం: అప్పాదురై ముత్తులింగం); అతిథి – ఆర్ శర్మ దంతుర్తి; ఒకనాటి యువ కథ: అమ్మ – రంగనాయకమ్మ.
  • కవితలు: శబ్దాన్ని జయించి రా – చంద్ర మోహన్ (మూలం: వైరముత్తు); వలస పక్షి – పి. రామకృష్ణ; త్వం తత్ అసి – విజయ్ కోగంటి; ఒకటి నుంచి పదిల దాకా… లలిత టి. ఎస్.
  • వ్యాసాలు: ఉదాహరణములు -2: శారదోదాహరణ తారావళి – జెజ్జాల కృష్ణ మోహన రావు; ఇద్దరు కథకులు – రెండు చెదిరిన బ్రతుకుల కథలు – ల.లి.త.; వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 1. ఒక ధీర, ఇద్దరు అధీరులు – కల్లూరి భాస్కరం.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: రాజు-కవి-కావ్యం – భైరవభట్ల కామేశ్వరరావు; తెరచాటు-వులు: 2. రాజువయ్యా! మహారాజువయ్యా! – కంచిభొట్ల శ్రీనివాస్. గడి నుడి 5 – కొల్లూరు కోటేశ్వరరావు.
  • ఇతరములు: తెలుగు పరిశోధనపై వెల్చేరు నారాయణరావుతో ఇంటర్‌వ్యూ – చేరా, ఎన్. గోపి; పుస్తక పరిచయం: స్వప్నసాకారం – కొల్లూరి సోమ శంకర్; శ్రీశ్రీ పదబంధప్రహేళిక.