వలస పక్షి

దారి-
గరికపూల అంచులున్న
మెరిసే
ఎండచీర.

నీడపింఛం విప్పి
గాలికి కాస్త
తలూపే
చెట్టు.

సరాసరి
పాటగూట్లోకి
వలసపోయిన
పక్షి
నేను.