రాజేశ్వరీదేవి: జాగరణ

అక్షరాలన్నీ గాయాలై రక్తం ఓడుతున్నాయి
ఏ అక్షరాన్నని కళ్ళలో పెట్టుకుని కలలు కంటాం

ఎవరినో ప్రేమిస్తాం
ఎవరినో ద్వేషిస్తాం
ఎవరినో పూజిస్తాం
ఇంకా ప్రేమిస్తూ ద్వేషిస్తూ పూజిస్తూ కూచునే వేళా ఇది

ఇక్కడ నేను శూన్యాన్ని మోస్తున్నాను

నా ఒక్కరి ఖాళీనే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరిదో

ఇక్కడ నేను శవాన్ని మోస్తున్నాను
నా ఒక్క శవాన్నే మోస్తున్నానా ఏమిటి
ఎందరెందరివో

పొద్దుటి నుండి రాత్రివరకూ అలా మోస్తూ మోస్తూ
మధ్యలో వైతరణి దాటిస్తుంటాను
అపరాహ్ణవేళా అలుపు తీర్చుకోనూ లేను
సాయంసంధ్యమీంచి స్వప్నసంచలన చేయనూ లేను
రాతిరి రాగ రంజితమూ కాదు