ఏండ్రాయిడ్ మనిషి

గడప దగ్గర
వేగంగా
తలుపు మీద వరకూ
ఓ వెలుతురు నీడ వూగులాట!
నిలుస్తూ వూగుతూ
నిలకడ లేకుండా-

గమనించాను పరీక్షగా!

బయట చూరుకొక్కేనికి
పాపాయి ఆటలో భాగంగా
దిష్టిబొమ్మగా కట్టిన
పనికిరాని,
మల్టిపుల్ కనెక్టర్
ఏండ్రాయిడ్ బొమ్మ
మనిషి
వెలుతురు నీడ!

అవును,
ఏండ్రాయిడ్ మనిషి!
వూగుతూ
నిలకడ లేకుండా
పాతగా
పనికి రాక దూరంగా
ఆటలో బొమ్మలా
గడప బయటా లోపలా
నీడలా!

విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సాహిత్య బోధన, రచన ప్రధాన వ్యాసంగాలు. ...