అబ్బూరి రామకృష్ణరావుగారి రేడియో ఇంటర్‌వ్యూ-1

అబ్బూరి రామకృష్ణరావుగారి గురించి ఎటువంటి పరిచయం అవసరం లేదని అనుకుంటున్నాను. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రతో యేమాత్రం పరిచయం వున్నా ఆయన పేరు తెలియకుండా వుండదు. ఆయన రాసింది తక్కువయినా (శ్రీశ్రీ ఆయన్ని ‘అబ్బూరి చలివేంద్రం’ అని జ్ఞానార్థులకు దాహంతీర్చి అభ్యుదయమార్గంలో ఆశ్రయం కల్పించిన వ్యక్తిగా ప్రశంసించేవాడు.) ఆయన ద్వారా ప్రభావితమైన ప్రముఖులు ఎందరో! చెళ్లపిళ్ల వెంకటశాస్త్రిగారి తరువాత మళ్ళీ అంత గొప్ప శిష్య సంపద కలిగిన వ్యక్తి ఆయనొక్కరే.

ఈ సంచికలో వినిపించబోయే రేడియో ఇంటర్వ్యూ గురించిన పూర్తి వివరాలు, దాని పాఠం అబ్బూరి సంస్మరణ (1988, పే. 271-286) సంచికలో చూడవచ్చు. ఈ అపురూపమైన ప్రసారాన్ని నాకిచ్చిన పన్నాల సుబ్రహ్మణ్యభట్టు గారికి బోలెడు కృతజ్ఞతలు. అలాగే దీని పూర్తి పాఠం అబ్బూరి సంస్మరణ సంచికలో వున్నట్లు గుర్తు చేయటమేకాక మరికొన్ని వివరాలు వరద స్మృతిలో (పే. 378) వున్నట్లు తెలియచెప్పిన ఏల్చూరి మురళీధరరావుగారికి నా ధన్యవాదాలు. పై సంచికల్లో చెప్పబడినట్లుగా రెండు భాగాలుగా ప్రసారమైన కార్యక్రమంలో ఇది ఒకటి మాత్రమే. రెండవ భాగం ఎవరి దగ్గరైనా వుంటే తెలియజేయగలరు.