సెప్టెంబర్ 2016

వ్యావహారిక భాషోద్యమ పితామహుడైన గిడుగు రామమూర్తి పంతులుగారి జయంతిని (29 ఆగస్ట్, 1863) తెలుగు భాషోత్సవదినంగా ప్రకటించుకుని తెలుగువారు తెలుగు భాష గొప్పదనాన్ని కీర్తిస్తూ సాహిత్య కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. గ్రాంథిక భాషను కాదని వ్యావహారికభాష తెలుగులో తెచ్చిన పెద్ద మార్పుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా — ఈ భాషావాదాలకి ఆద్యులుగా మన మనసుల్లో స్థిరపడిపోయిన పరవస్తు చిన్నయ సూరి, గిడుగు రామమూర్తుల రచనల వల్ల తెలుగు భాష వ్యవహారాలలో కలిగిన మార్పులేమిటి? తెలుగు భాష చరిత్రలో మొదటగా వినిపించే ఈ ప్రముఖుల అభిప్రాయ వైరుధ్యాలు ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? వీరిద్దరి రచనలు ఏ సందర్భాలలో ప్రాచుర్యం లోకి వచ్చాయి, వాటివల్ల ఆధునిక వచన రచనకి లాభమా, నష్టమా? అనే విషయాలు చర్చిస్తూ వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్ రాస్తున్న వ్యాసంలో మొదటి భాగం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.

  • ఈ సంచికనుండి గడి నుడి శీర్షిక మొదలుపెడుతున్నాం. పాఠకులు ఆదరించి ప్రోత్సహిస్తారని, ఉత్సాహంతో పాల్గొంటారని, ఆశిస్తున్నాం.

ఈ సంచికలో:

  • కథలు: భర్తృహరి అభాషితం – తాడికొండ శివకుమార శర్మ; హృదయం ఇక్కడే ఉంది – ఆర్. దమయంతి.
  • కవితలు: జంతువు – అవినేని భాస్కర్; ఐదు కవితలు – దేహం మొండిగోడల మీంచి…!, రెయిన్ ఫారెస్ట్, చిల్లులముంత, ఉత్తీత పాట, ఎర్రమట్టిగోడ – గోపిని కరుణాకర్.
  • వ్యాసాలు: చిన్నయసూరి-గిడుగు రామమూర్తి – వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్; అభిసారిక, విప్రలబ్ధ – తిరుమల కృష్ణదేశికాచార్యులు; ముక్తచ్ఛందకవిత కొన్ని మౌలిక సమస్యలు – ఆవంత్స సోమసుందర్; తెలుగు – తెనుగు శబ్దాలలో ఏది ప్రాచీనం – పసుపులేటి చరణ్ రాజ్; English and Telugu Lexicons: Parallel Trajectories – రాజేశ్వర్ మిట్టపల్లి; జీవితాన్ని పండగచేసుకొన్న కవి సోమసుందర్ – ఇంద్రప్రసాద్.
  • ముఖాముఖి: వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం – సి రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం – సుజాత.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: తెలుగు సత్యభామ పలుకు-బడి – భైరవభట్ల కామేశ్వరరావు; గడి నుడి-1; ఐదుకవితలు: గోపిని కరుణాకర్ – మానస చామర్తి.
  • సమీక్షలు: అవ్యయ: సౌభాగ్య కుమార మిశ్ర కవితలు – తమ్మినేని యదుకుల భూషణ్.
  • శబ్దతరంగాలు: భీమసేన విజయం: యక్షగానం; అబ్బూరి రేడియో ఇంటర్‌వ్యూ -1 సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.