మే 2016

గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్యం, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యం పరిశీలనగా చదివి, పరిశోధన చేసి పిహెచ్‌డీలు సంపాదించుకున్న విద్యార్థుల్లో కొందరినీ, తెలుగుదేశంలో ప్రామాణికమైన పరిశోధన చేసిన కొందరినీ, పిలిచి అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో ఏప్రిల్ 16-17 తేదీల్లో, అధ్యాపకులు వెల్చేరు నారాయణరావు, జాయ్స్ ఫ్లూకిగర్ ఒక ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేశారు. తెలుగు సాహిత్య విమర్శ మీద కొత్త ఆలోచనలు ఆవిష్కరించడానికి పరిశోధన మార్గాలలో కొత్త పద్ధతులు అనుసరించడానికి, ఈ సంవృత సదస్సు ఉద్దేశించబడింది. అంతర్జాతీయంగా తెలుగు సాహిత్య విమర్శకి ప్రామాణిక స్థానం ఏర్పడడం, ప్రపంచ సాహిత్య విమర్శలో తెలుగు సాహిత్య విమర్శ ఒక భాగం కావటం ఈ సదస్సు వల్ల ఉద్దేశించిన ఫలితాలు. ఈ సదస్సుకు కావలసిన ఖర్చులన్నీ ఎమరీ విశ్వవిద్యాలయంలో తెలుగుకి ప్రత్యేకమైన ఆచార్య పీఠం ఏర్పాటు చేసిన కొప్పాక కుటుంబం వాళ్ళే ఇచ్చారు. ఈ సదస్సులో చర్చల ఫలితంగా వ్యాసరచయితలు తమ వ్యాసాలను పరిష్కరించుకున్న తరువాత వాటినన్నిటినీ ఒక పుస్తకంగా ప్రచురించాలని నిర్వాహకుల ఉద్దేశ్యం. అలా పుస్తకంగా రాకముందు ఆ వ్యాసాలను కొన్నింటిని అనువాదం చేసి ఈమాటలో ముందుగా వేయటానికి ఆయా వ్యాసరచయితలు అంగీకరించారు. వారికి మా కృతజ్ఞతలు.


ఈ సంచికలో:

  • కథలు: కాపరి భార్య – శారద; సత్యదర్శనం – ఆర్ శర్మ దంతుర్తి; ఆశనిరాశలు – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయ్.
  • కవితలు: చిరంజీవి – మానస చామర్తి; నిశ్శబ్ద సమూహం – విజయ్ కోగంటి; జీర్ణమఙ్గే సుభాషితమ్ – సమవర్తి; రెండు కవితలు: ఆగిన పాట – పాలపర్తి ఇంద్రాణి; ఇది చాలు నాకు – అవినేని భాస్కర్; అమరకోశం – హెచ్చార్కె; సౌభాగ్య కుమార మిశ్ర: రెండు ఒరియా కవితలు – వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణారావు.
  • వ్యాసాలు: పలుకుబడి: తెలుగులో సాధు శకటరేఫములు-1 – సురేశ్ కొలిచాల; తేలిక తెలుగు – వేమూరి వేంకటేశ్వరరావు; శ్రీనాథుని భీమేశ్వర పురాణము: స్థానీయత, కొన్ని అపూర్వాంశాలు – కర్రి రామచంద్రారెడ్డి; ఛందస్సులో గణితాంశములు–2 – జెజ్జాల కృష్ణ మోహన రావు; ఖండిత, కలహాంతరిత – తిరుమల కృష్ణదేశికాచార్యులు.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: శుచిముఖి చెప్పిన మెటా కవిత్వం – భైరవభట్ల కామేశ్వరరావు.
  • శబ్దతరంగాలు: Honey Bee – లైలా యెర్నేని.